For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆమె వయస్సు ముప్పై ఏడేళ్లయినప్పటికి ఒక చంటిపిల్ల శరీరంలో బంధీ అయిపోయింది!

ఆమె వయస్సు ముప్పై ఏడేళ్లయినప్పటికి ఒక చంటిపిల్ల శరీరంలో బంధీ అయిపోయింది!

|

ఒక ముప్ఫై ఏడేళ్ల యువతి, కొన్ని వైద్య కారణాల వలన ఒక తొమ్మిది నెలల చిన్నారి దేహంలో చిక్కుకుపోతే, ఎలా ఉంటుంది. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఆమె పుట్టుకతోనే కలిగిన ఈ పరిస్థితి, ఆమె పెరుగుదలను పూర్తిగా నిరోధించి ఎదగనివ్వలేదు. ఆమె ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ దుస్థితి వైద్యపరమైన నిర్లక్ష్యం వలన జరిగింది. సరైన సమయంలో వైద్య సహాయం అందజేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు.

అరుదైన వ్యాధికి గురైన 37 ఏళ్ల వయసు కల యువతి

మరియా ఆడెట్ డో నసిమెంటో యొక్క శారీరక ఎదుగుదల విషయంలో అయినా, లేదా మానసిక ఎదుగుదల విషయంలో అయినా తలెత్తిన ఈ వైద్య పరిస్థితికి కారణం హైపోథైరాయిడిజం.

ఆమె జీవనపరిస్థితుల గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంటే....

She Was Born With A Rare Disorder And Looks Like A 9-Month-Old Baby, But She’s 37 Years Old

ఆమె బ్రెజిల్ లో జన్మించింది.
మరియా ఆడెనెట్ ఫెరయిరా డో నసిమెంటో మే 7, 1981 తేదీన బ్రెజిల్ లోని సియరా లో జన్మించింది. ఈ లెక్క ప్రకారం ఆమెకు 37 ఏళ్ళు అయినప్పటికీ, ఆమె తొమ్మిది నెలలు మించి ఒక్క రోజు కూడా ఎక్కువ వయస్సు ఉన్నట్లు కనపడదు.

పుట్టినప్పుడే ఆమె ఈ పరిస్ధితితో పుట్టింది

మరియాకు పుట్టుకతోనే సంక్రమించిన ఈ అరుదైన మరియు తీవ్రమైన హైపోథైరాయిడిజం , ప్రస్ఫుటమైన థైరాయిడ్ హార్మోన్ లోపం వలన కలిగింది.

ఆమెకు తొమ్మిది నెలల వయస్సు ఉన్నప్పుడే, ఈ వ్యాధి మొదలైంది.

మరియాకు తొమ్మిది నెలల వయస్సు ఉన్నప్పుడు మొదలైన ఈ ఆటోఇమ్యూన్ వ్యాధి మూలంగా, ఆమె శారీరకంగా, మానసికంగా మరియు అభిజ్ఞాత్మకంగాఎదగడం ఆగిపోయింది.

ఆమె పుట్టినప్పుడే సరైన వైద్యం చేపట్టి ఉంటే...

మరియాకు సంబంధించి, ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఆమె పుట్టినప్పుడే కనీస వైద్య సహాయం అందించి ఉన్నట్లైతే, ఆమెకు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు.

ఆమె పరిస్థితి ఏమిటంటే..

హైపోథైరాయిడిజం సాధారణంగా అయోడిన్ లోపం వలన కలుగుతుంది. థైరాయిడ్ గ్రంధులు మెడ వెనుక భాగంలో ఉంటాయి. ఇవి మన శరీర జీవక్రియ మరియు ప్రోటీన్ సంశ్లేషణ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వీటితో పాటు ఇది శారీరకంగా, మానసికంగా మరియు అభిజ్ఞాత్మకంగా సామర్థ్యాలపై ప్రభావం చూపిస్తుంది.

ఆమె ఎంతో అదృష్టవంతురాలు ఎందుకంటే ఆమె కుటుంబం ఆమెకు తోడుగా నిలిచింది.
మరియా ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్నప్పటికి, కుటుంబ సభ్యులు అందించే అవ్యాజ్యమైన ప్రేమ ఆమెను దృఢంగా మార్చింది. ఆమె సవతి తల్లి, ఫ్రాన్సిస్కా డోరా డోస్ శాంటోస్ ఆమెను భగవంతుని కానుకగా భావిస్తుంది. ఆమె కన్నతల్లి మరణించినప్పటి నుండి ఆమె సవతి తల్లి ఆలనాపాలనా చూసుకుంది. ఆమె తండ్రి అందుచేత రెండో పెళ్లి చేసుకున్నాడు.

ఇది చదివాక మీ ఆలోచన ఏమిటి?

ఎన్నోసార్లు మనం ఎప్పటికీ పసిపాపల్లాగా ఉండిపోతే, ఏ బాధలు లేకుండా ఆనందంగా ఉండవచ్చు అనుకొని ఉండి ఉంటాము. ఆమె పరిస్థితి చూసిన తరువాత, మీకేమనిపిస్తుంది? మీరు కూడా చిన్న పిల్లల శరీరంలో బంధీ కావాలనుకుంటున్నారా? మీకు అలా ఉండటం ఇష్టమేనా? మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి.

English summary

She Was Born With A Rare Disorder And Looks Like A 9-Month-Old Baby, But She’s 37 Years Old

She Was Born With A Rare Disorder And Looks Like A 9-Month-Old Baby, But She’s 37 Years Old.She is 37 years old but trapped in a body of a 9-month-old baby! This is because she suffers from a rare condition of hyperthyroidism. Check on to know more.
Story first published:Wednesday, June 27, 2018, 19:16 [IST]
Desktop Bottom Promotion