For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎలుగుబంట్లు ఎందుకు ఇంత దారుణంగా చంపేస్తున్నాయి.. శ్రీకాకుళంలో జరిగిన సంఘటనలు ఘోరం (వీడియో)

శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల ఒక ఎలుగుబంటి దాడి ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామం,ఎలుగుబంటి దాడి, శ్రీకాకుళంలో ఎలుగుబంటి దాడి, ఎలుగుబంటి దాడులు

|

శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల ఒక ఎలుగుబంటి దాడి ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామంలోకి ఒక్కసారిగా ఎలుగుబంటి చొరబడి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. గ్రామస్తులపై దాడి చేసింది గాయపరిచింది. ఊర్మిళ (40) ఆమె భర్త తిరుపతిరావు చనిపోయారు.

అయితే ఇప్పటికీ ఉద్దానం ప్రజలను ఎలుగుబంట్లు భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉన్నాయి. సోంపేట మండలంలోని ఎర్రముక్కాం, పాతపితాళిలలో ఎలుగుబంటి చేసిన బీభత్సం ఇంకా అక్కడి ప్రజల కళ్ల ముందు కదులుతూనే ఉంది. ఎర్రముక్కాం గ్రామంలో ఎలుగుబంటి సృష్టించిన బీభత్సంతో గ్రామానికి చెందిన బైపల్లి శ్యాం జీవితం చీకట్లోకి వెళ్లిపోయింది. మొత్తం ఆరు కుటుంబాలకు ఎలుగు రూపంలో తీరని కష్టం మిగిల్చింది.

ఎర్రముక్కాం గ్రామంలో

ఎర్రముక్కాం గ్రామంలో

గత ఎనిమిది సంవత్సరాలుగా ఎర్రముక్కాం గ్రామంలో

ఒక ఎలుగు సంచరించేది. మనుషులు మాటలు విని వెళ్లిపోతుండంతో దాన్ని గ్రామస్తులు ఏమి అనేవారు కాదు. కాని ఒక ఎలుగు ఎర్రముక్కాంలో సృష్టించిన విధ్వంసంతో గ్రామంలో ఎలుగు పేరు చెపితే బయపడే పరిస్థితి వచ్చింది. ఇక చుట్టుపక్కలున్న గ్రామాల్లో కూడా ఎలుగులు సంచరిస్తున్నాయని ప్రజలు భయపడుతున్నారు. మందస మండల పరిధిలో రెండు ఎలుగులు సంచరిస్తున్నాయని ఆ గ్రామంలోని యువత గ్రామం చుట్టూ కర్రలు పట్టుకుని కాపలా కాస్తున్నారు.

భయం ఇంకా వీడడంలేదు

భయం ఇంకా వీడడంలేదు

అయితే మందస, సోంపేట మండలాలకు ఎలుగుబంట్ల భయం ఇంకా వీడడంలేదు. సోంపేట, మందస మండలాల్లో బీభత్సం సృష్టించిన ఎలుగుబంటిని గ్రామస్తులు చంపేశారు. అది హతమైనప్పటికీ పదుల సంఖ్యలో ఉన్న ఎలుగుబంట్లు ఉద్దానం వాసులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.ఇటీవల రెండు ఎలుగుబంట్లు సముద్ర తీర ప్రాంతాల్లో హల్‌చల్‌ చేశాయి. దీంతో తీర ప్రాంతానికి చెందిన ఉద్దానం వాసులు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడ్డారు. ఉద్దానం కొండలు, జీడితోటల్లో సంచరిస్తున్న రెండు ఎలుగులు దారి తప్పి భేతాళపురం, దున్నవూరు, రట్టి, గంగువాడ తదితర గ్రామాల పరిసరాల్లో తిరిగాయి.

మత్స్యకారులను భయపెట్టాయి

మత్స్యకారులను భయపెట్టాయి

సముద్ర తీరం నుంచి వెళ్తూ, కనిపించిన మత్స్యకారులను భయపెట్టాయి. ఇటీవల ఒక ఎలుగు కనిపించిన మనుషులను, పశువులు, పెంపుడు జంతువులపై దాడి చేసి మరీ చంపేయ్యడంతో స్థానికులు భయపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్దానంలో జీవించడం కూడా కష్టమేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రముక్కాం, పాతపితాళి, దున్నవూరు సంఘటన మరువక ముందే మరో రెంటు ఎలుగుబంట్లు కలకలం సృష్టించడంతో ఉద్దానం ప్రజలకు కంటిమీద కునుకు కరవవుతుంది.

బొడ్డు గంగమ్మ తోటల్లోకి వెళ్తుంగా

బొడ్డు గంగమ్మ తోటల్లోకి వెళ్తుంగా

ఇక మందస మండలంలోని నల్లబొడ్లూరు గ్రామానికి చెందిన బొడ్డు గంగమ్మ తోటల్లోకి వెళ్తుండగా ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. ఆమె కుడిచేయిపై కొంత భాగాన్ని కొరికేసింది. గ్రామస్తులు గమనించి, కేకలు వేసి తరమడంతో ఎలుగు పారిపోయింది. అలాగే సువర్ణాపురం గ్రామానికి చెందిన సాలీన భీమారావు తోటకు వెళ్తుండగా దారిలో ఎలుగుబంటి దాడి చేయడానికి ప్రయత్నించింది.

ఉద్దాన ప్రాంత వాసులు హడలెత్తిపోతున్నారు

ఉద్దాన ప్రాంత వాసులు హడలెత్తిపోతున్నారు

సమయస్ఫూర్తితో వ్యవహరించి సమీపంలోని చెట్టు ఎక్కారు. ఆ ప్రాంతంలో కొంతసేపు తిరిగిన ఎలుగుబంటి వెళ్లిపోవడంతో ఆయన బతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి చేరుకున్నారు. ఇలా వరుస ఎలుగుబంట్లు దాడులతో ఉద్దాన ప్రాంత వాసులు హడలెత్తిపోతున్నారు. ప్రాణభయంతో రాత్రి వేళల్లో ఇంటి నుంచి రావడానికి భయపడుతున్నారు. అయితే కేవలం శ్రీకాకుళంలోనే కాదు చాలా చోట్ల ఎలుగుబంట్లు దాడులు చేస్తూనే ఉన్నాయి.

శ్రీనివాస్‌ చెట్టు ఎక్కినా

శ్రీనివాస్‌ చెట్టు ఎక్కినా

ఇటీవల జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారం పరిధిలోని భూపతిపురం గ్రామంలో గ్రామానికి చెందిన శ్రీనివాస్‌, తన మిత్రుడు కృష్ణమూర్తితో కలిసి కట్టెల కోసం సమీపంలోని అడవికి వెళ్లారు. కట్టెలు కొడుతున్న క్రమంలో సమీప పొదల్లోంచి ఎలుగుబంటి ఒక్కసారిగా వారిపై దాడికి దిగింది. కృష్ణమూర్తి పారిపోగా, శ్రీనివాస్‌ సమీపంలోని చెట్టు ఎక్కాడు. ఎలుగుబంటి సైతం చెట్టెక్కి దాడి చేయడంతో అదుపుతప్పి కింద పడిపోయాడు. అయినప్పటికీ వదలకుండా అతడి ముఖంపై దాడి చేసింది. దీంతో ముక్కు, కళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

కుక్క ఎదురుతిరిగి ఎలుగుబంటిని వెంటాడంతో

కుక్క ఎదురుతిరిగి ఎలుగుబంటిని వెంటాడంతో

ఈ క్రమంలో.. శ్రీనివాస్‌ వెంట ఉన్న కుక్క ఎదురుతిరిగి ఎలుగుబంటిని వెంటాడంతో అది పొదళ్లలోకి వెళ్లిపోయింది. అది మళ్లీ వెనక్కు రావడానికి ప్రయత్నించగా.. కుక్క తరమడంతో ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోయింది. అలాగే నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి‌లో ఇటీవల ఒక ముసలావిడపై ఎలుగుబంటి దాడి చేసింది. డిచ్‌పల్లి ప్రధాన రహదారి పక్కన మదనపల్లి రోడ్డు సమీపంలో లక్ష్మి (70) అనే వృద్ధురాలు నివాసముంటోంది. ఇంటిపై దాడి చేసి ఆమెను గాయపర్చింది. వృద్ధురాలు తలుపులు తీయగానే ఎలుగుబంటి ఇంట్లోకి ప్రవేశించి ఆమె చేతిపై దాడి చేసి గాయపర్చింది.

సెల్ఫీ దిగాలనుకుని చనిపోయాడు

సెల్ఫీ దిగాలనుకుని చనిపోయాడు

ఇక ఒడిశాలో కూడా ఆ మధ్య ఎలుగుబంటి దాడిలో ఒకరు చనిపోయారు. ఇది నవరంగ్‌పూర్‌ జిల్లా కొడింగ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ప్రభు భొత్ర అనే వ్యక్తి కొంత మంది మిత్రులతో కలిసి పపడహండి గ్రామం నుంచి బొలెరో వాహనంలో ఒక గ్రామానికి వెళ్లి పనులు చూసుకుని వారిని దింపివేసి తిరిగి వాహనంలో ఒక్కడే వస్తున్నాడు. ఈ క్రమంలో కిర్చిమాల ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో గల కుజాగుడ గ్రామ సమీప పొదబొస సంరక్షిత అడవిలో ఒక చెరువు వద్ద గాయపడిన ఎలుగుబంటి అతడికి తారసపడింది. చెరువు దగ్గర నీళ్లను తాగేందుకు వచ్చిన దాని దగ్గరకు వెళ్లి సెల్ఫీ దిగాలనుకున్నాడు. కానీ ఎలుగుబంటి అతనిపై దాడి చేసి చంపేసింది.

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఎలుగుబంటి దాడులు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఏవైనా చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే అమాయకులు రోజుకొకరు ఎలుగుబంట్లకు బలి కావాల్సి వస్తుంది.

Image credit

English summary

bear mauls people in srikakulam district

bear mauls people in srikakulam district
Desktop Bottom Promotion