For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లీటర్ పాల ధర 3000 రూపాయలా? సంతోషంలో భారతీయులు.

లీటర్ పాల ధర 3000 రూపాయలా? సంతోషంలో భారతీయులు.

|

ఒక్కోసారి బాగా తెలిసిన ఆహార పదార్దాలలోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం అకస్మాత్తుగా తెలిస్తే, ఆ పదార్ధాల ధర ఊహకి అందని రీతిలో అమాంతం పెరిగిపోవడం మార్కెట్లో సర్వసాధారణం. ఉదాహరణకు ఒకప్పుడు జపాన్లో బనానా డైట్ అని వచ్చినప్పుడు, ఒక్కొక్క అరటి పండు విలువ భారతీయ కరెన్సీ ప్రకారం వందల్లో వెళ్ళిన విషయం ఇదివరకే మన బోల్డ్స్కీలో చెప్పడం జరిగింది.

అదేవిధంగా, ఇటీవల పరిశోధకులు చెప్పిన ప్రకారం, ఒంటె పాలు తాగడం అనేది భారతదేశంలో ఎప్పుడూ అంత ముఖ్యమైన విషయంగా పరిగణించలేదు. వీరికి సర్వసాధారణమైన విషయమే. మరియు మిగిలిన పాలిచ్చే జంతువులతో సమానంగానే ఒంటెను చూసేవారు కానీ, అంత గొప్పగా ఏనాడూ పరిగణించలేదు. అయితే, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని పరిశోధకులు, ఒంటె పాలలో ప్రత్యేక ప్రయోజనాలను ఉన్నాయని కనుగొన్నారు.

Camel Milk Is On High Demand In The USA

లీటర్ పాలధర 3000 రూపాయలా? రైతులకు సరైన గిట్టుబాటు.

తద్వారా డిమాండ్ పెరగడం, ధర పెరగడం పరిపాటి అయింది. ఈ ఒంటెపాలను పాల పొడిగా చేసి విక్రయించడం ద్వారా మంచి లాభాలను ఆర్జించగలుగుతున్నారు. క్రమంగా ఒక లీటర్ ఒంటె పాలు సుమారుగా 50 డాలర్లకు చేరింది. అనగా భారతీయ కరెన్సీ ప్రకారం ఇంచుమించు 3 వేల నుండి 3,500 రూపాయల మద్యలో దీని ధర ఉంటుందన్న మాట.

ముఖ్యంగా, ఇది రాజస్థాన్లోని ఒంటె యజమానులకు ఊహించని అదృష్టంగా ఉన్నందున భారతీయులు సంతోషంగా ఉన్నారు అని చెప్పవచ్చు. బికనెర్, కచ్ మరియు సూరత్ నుండి రైతులు ముఖ్యంగా లాభపడుతున్నారు. ముఖ్యంగా ఈ పాలకు ఎక్కువ డిమాండ్ ఉండి, మద్దతు ధర పలికే అమెరికా వంటి ఇతర దేశాలకు పాలను విక్రయించడానికి మొగ్గుచూపుతున్నారు.


నిజంగా ఒంటె పాలలో ఇన్ని ఉపయోగాలున్నాయని మీరు భావిస్తున్నారా? మీకోసం, ఒంటె పాల గురించిన కొన్ని వాస్తవాలను మీ ముందు ఉంచుతున్నాం.

ఆటిజం, డయాబెటిస్, కీళ్ళ నొప్పి మరియు ఇతర రోగనిరోధక సంబంధిత వ్యాధుల చికిత్సలకు, మరియు నివారణలకు ఒంటె పాలు ఎంతగానో సహాయం చేస్తుందని పరిశోధనల సారాంశం. ఆవు పాలతో పోల్చినప్పుడు, ఒంటె పాలలో తక్కువ లాక్టోజ్ ఉన్నట్లు నమ్ముతారు, దీని వలన ఆవు పాలకు (ముఖ్యంగా లాక్టోస్ అలెర్జీ ఉన్న వ్యక్తులకు) మంచి ప్రత్యామ్నాయం అవుతుంది.

ఇది అతిసారం వంటి రోగాలకు కారణమైన సాల్మొనెల్ల సంబంధిత వైరస్ మరియు ఇతర అంటురోగాలకు వ్యతిరేకంగా పోరాడటానికి కూడా సహాయపడుతుంది. ఆవు పాల కన్నా, ఒంటె పాలల్లోనే ఎక్కువ మోతాదులో షార్ట్-చైన్ కొవ్వు ఆమ్లాల స్థాయిలు ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు.

అనేక ప్రయోజనాలకు కొలువుగా ఉన్న ఈ ఒంటె పాల వినియోగాన్ని, శారీరిక ప్రయోజనాల దృష్ట్యా భారతీయులు కూడా గుర్తిస్తే, ఎగుమతి అవసరం లేకుండానే రైతులు స్వదేశంలోనే సరైన లాభాలను గణించే దిశగా సహాయపడుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆరోగ్య సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Camel Milk Is On High Demand In The USA

Camel milk and its products may not have found favour in India, but it is popular in other parts of the world so much so that people from the USA are willing to pay Rs. 3000/- for a litre of this milk! According to research, camel milk gained its popularity after researchers found the medicinal value of it.
Story first published:Monday, July 9, 2018, 18:15 [IST]
Desktop Bottom Promotion