Latest Updates
-
ఈ 5 సూపర్ ఫుడ్స్ చాలు.. వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీకి ఢోకానే ఉండదు.! -
Father's Day 2026: చాలా మంది తండ్రులు 60 ఏళ్లు దాటాక పశ్చాత్తాపపడే ఒక్క విషయం అదే! -
జుట్టు చివర్లు దారుణంగా చిట్లిపోతున్నాయా.. మీరు చేస్తున్న తప్పులివే.! -
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు.. -
పెళ్లయింది తర్వాతేంటి.. అమ్మాయిలు గూగుల్ని అడుగుతున్న సలహాలు ఇవేనట.! -
పోషకాల పవర్ హౌస్..ఇంట్లోనే రాగి మాల్ట్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే.. -
ఆర్థరైటిస్ పేషెంట్లకు అలర్ట్.. ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.? -
నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం.. శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది! -
జూన్ 19 నుంచి ధన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
పొగాకు నమిలితే క్యాన్సర్, గుండెపోటు మాత్రమే కాదు.. మరో ప్రమాదం ఉందని తెలుసా.?
ఈ పెళ్లి కూతురు అలా చేసి అందరికీ షాక్ ఇచ్చింది.. సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది
ఆమె బస్సు డ్రైవర్‌గా పని చేస్తోంది. దాంతో తన పెళ్లి వేడుకకు కూడా బస్సులోనే వెళ్లాలనుకుంది. పెళ్లికూతురిలా చక్కగా ముస్తాబై బస్సు నడుపుకుంటూ మండపానికి బయలుదేరింది ఆ చిన్నది. చైనా పెళ్లి కూతురు, బస్సు
ప్రస్తుతం పెళ్లిళ్లు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ చేసుకుంటూ ఉంటారు. కొందరు పెళ్లి కూతుర్లు మండపానికి వస్తూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకొందరు పెళ్లి కూతుర్లు వివాహం అయిపోగానే స్టెప్స్ తో అదరగొడుతుంటారు. అలా వారు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటారు.
ఇలా ఈ మధ్యకాలంలో యువతీ యువకులు రకరకాల ఆలోచనలతో వివాహాలు నిర్వహించుకుంటున్నారు. కొందరు పెళ్లికి ముందే రకరకాల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ట్రెండింగ్ అయిపోతుంటారు. సరదాగా ఫొటోలు దిగి ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తుంటారు.
ఫ్రెండ్స్ తో కలిసి డ్యాన్స్ చేస్తూ వచ్చి
ఆ మధ్య ఒక అమ్మాయి పెళ్లి వేదిక వద్దకు తన ఫ్రెండ్స్ తో కలిసి డ్యాన్స్ చేస్తూ వచ్చి అందరినీ ఆకర్షించింది. అప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇక సాధారణంగా పెళ్లి కొడుకు మండపానికి వాహనంలోనే లేదంటే వారి ఆచారం ప్రకారం వివిధ రకాలుగా వస్తాడు. కొందరు పెళ్లి కొడుకులు గుర్రంపై మండపానికి వస్తుంటారు.

గుర్రంపై ఊరేగింపుగా వచ్చి
కానీ ఇటీవల ఓ ప్రాంతంలో వెరైటీగా పెళ్లి కూతురే గుర్రంపై ఊరేగింపుగా వచ్చింది. మరో ఘటనలో పెళ్లికూతురు మండపానికి ఏకంగా బుల్లెట్ బైక్‌పై వచ్చి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇప్పుడు ఇలాంటి ఘటనే చైనాలో చోటు చేసుకుంది.

పెళ్లి మంటపానికి వచ్చిన తీరు
సాధారణంగా పెళ్లి కూతురు పల్లకిలో ఊరేగుతూ కల్యాణ మంటపానికి రావటాన్ని మనం చూసేవుంటాం. అయితే చైనాకు చెందిన ఒక పెళ్లి కుమార్తె... పెళ్లి మంటపానికి వచ్చిన తీరు చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే.

బస్సు నడుపుతూ
ఈ నూతన వధువు స్వయంగా బస్సు నడుపుతూ కల్యాణ మంటపానికి చేరుకుంది. ఈ వధువు వృత్తి రీత్యా డ్రైవర్ కావడంతో ఇలా వినూత్న రీతిలో కల్యాణ మంటపానికి చేరుకుందట. చైనాకు చెందిన ఓ యువతికి పెళ్లి నిశ్చయమైంది.

మండపానికి బయలుదేరింది
ఆమె బస్సు డ్రైవర్‌గా పని చేస్తోంది. దాంతో తన పెళ్లి వేడుకకు కూడా బస్సులోనే వెళ్లాలనుకుంది. పెళ్లికూతురిలా చక్కగా ముస్తాబై బస్సు నడుపుకుంటూ మండపానికి బయలుదేరింది ఆ చిన్నది.

బస్సులోనే ఎక్కించుకుంది
తన పెళ్లి జరగనున్న ఫంక్షన్ హాల్‌కి తమ బంధువులను కూడా ఆ బస్సులోనే ఎక్కించుకుంది. బస్సు నడుపుతూ మధ్యలో పెళ్లి కొడుకు ఇంటి వైపునకు వెళ్లి ఆయనను కూడా అందులో ఎక్కించుకుని, తన పక్కన కూర్చోబెట్టుకుని ఆ యువతి వెళ్లింది.

సోషల్‌మీడియాలో పోస్ట్
ఈ దృశ్యాలను చైనా మీడియా వర్గాలు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాయి. అయితే ఆ యువతి ఇలా చేయడం వెనుకా ఓ మంచి ఆలోచన ఉంది. ప్రతి ఒక్కరూ సొంత కార్లు నడపడం కాకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని వాడటం వల్ల పర్యావరణానికి కొంతయినా మేలు జరుగుతుందనీ.. కాలుష్యం కాస్తయినా తగ్గుతుందనీ ఆలోచించి ఆమె అలా బస్సులో వచ్చిందట.

తక్కువ కాలుష్యం
ప్రజలంతా కాలుష్యాన్ని తగ్గించాలని, పచ్చదనాన్ని పెంచాలని అనుకుంటున్నారు. అందుకే నేను పెళ్లి వేడుకకు కారులో కాకుండా నాకు కేటాయించిన బస్సులోనే వెళ్లాను. ఎందుకంటే ఈ బస్సులు తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి.. అని పెళ్లి కూతురు చెప్పింది

సోషల్‌మీడియాలో వైరల్
ఇందుకు సబంధించిన వీడియోను ఓ చైనా మీడియా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. బస్సు అంతా బెలూన్లు, పూలతో చాలా అందంగా ఉంది. మొత్తానికి యువతలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా పెళ్లి చేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నారు.
స్పెషల్ గా ట్రై చెయ్యండి
ఇక త్వరలో మీ పెళ్లి కూడా ఉంటే మీరు కూడా మీ వివాహంలో ఏదైనా ఒకటి స్పెషల్ గా ట్రై చెయ్యండి. సమాజానికి ఉపయోగపడే పని చేస్తే సోషల్ మీడియాలో మీరు కూడా వైరల్ గా మారొచ్చేమో. ప్రపంచం మొత్తం కూడా మీ గురించి మాట్లాడుకునే పరిస్థితి కూడా రావొచ్చు. సో ట్రై చేసి చూడండి.



Click it and Unblock the Notifications