For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రింది ఫోటో లో ఒక చిహ్నాన్ని ఎంచుకోవడం ద్వారా మీ వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు.. !

మీరు ఎంపిక చేసుకునే ఫోటోను బట్టి మీ వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు

|

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశిచక్రాలను అనుసరించడం ద్వారా మనిషి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చని అందరికీ తెలిసినదే. కానీ మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేసే పద్దతులు ఈ ప్రపంచంలో అనేకం ఉన్నాయి.

Personality Tests That Help You Know Your Inner Self

హస్త సాముద్రికo వంటివి. అందులో ఇప్పుడు చెప్పబోయే పద్దతి కూడా ఒకటి. ఈ పద్దతి ద్వారా మీకు మీరే ఇక్కడ చూపిన చిత్రం నుండి ఒక చిహ్నాన్ని ఎంచుకొనవలసి ఉంటుంది. తద్వారా ఆ చిహ్నానికి సంబంధించిన వివరాలను చూసి మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు.

మొదటి చిహ్నం:

మొదటి చిహ్నం:

మీరు ఈ చిహ్నాన్ని ఎంచుకున్న ఎడల, మీరు ఉదారవాదిగా ఉంటూ నీతి నిజాయితీలకు ఎక్కువగా విలువని ఇచ్చేవారిలా ఉంటారు. జీవితంలో ప్రతి ఒక్క అడుగూ ఉన్నతంగా సాగాలని, దక్కే ప్రతి ఒక్క విషయం ఉన్నతంగానే ఉండాలనే స్వభావం కలిగిన వారిగా ఉంటారు. మీరు ఒక నియమానికి కట్టుబడి ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, లక్ష్యసాధనలో ఆ నియమాలను ఎన్నటికీ వీడరు. తద్వారా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారిగా ఉంటారు. మరియు కష్ట జీవిగా, ఉదారవాదిగా, ఆదర్శంగా ఉంటారు. మీరు మీ జీవితాన్ని ఉన్నతంగా మలచుకోవడమే కాకుండా మీ ప్రియమైన వారి జీవితాలను కూడా దృష్టిలో ఉంచుకుని పయనిస్తారు. కొన్ని సందర్భాలలో ఇతరులు మీతో మాట్లాడుటకు కొన్నిఇబ్బందులను సైతం ఎదుర్కుంటూ ఉంటారు. తద్వారా మీకు ప్రతికూల పరిస్థితులు దూరంగానే ఉంటాయి. మీ కుటుంబ సభ్యులు మీకు ఎన్నడూ చేదోడు వాదోడుగా ఉంటూ

ఉంటారు.

రెండవ చిహ్నం :

రెండవ చిహ్నం :

మీరు ఇతరులను మంత్రముగ్ధులను చేసే లక్షణాలను కలిగి ఉంటారు. ఏ విషయము నందైనా ఒక భాధ్యతను కలిగి ఉండడం మీ సహజ గుణం. మీరు కష్టజీవిగా, నీతి నిజాయితీలను కలిగిన వారిగా ఉంటారు. మీ ఉన్నతమైన వ్యక్తిత్వానికి అభిమానులు ఉండడం సర్వసాధారణం. మీరు కొంచం వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొనే వారిలా ఉంటారు. కానీ ఎన్నడూ నిర్ణయ లోపాన్ని మాత్రం కలిగి ఉండరు. మిమ్ములను ఇతరులు తప్పు అంచనాలు వేస్తుంటారు, కానీ మీరు ఫలితాల ద్వారా వారికి సమాధానాలు ఇస్తుంటారు.

మూడవ చిహ్నం :

మూడవ చిహ్నం :

మీరు ఎక్కువగా మెదడుకు పని చెప్తూ ఉంటారు, ఏ నిర్ణయాన్నైనా తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి తీసుకోవడం మీ అలవాటుగా ఉంటుంది. మీ మెదడు నిండా ఉత్తమమైన ఆలోచనలతో నిండి ఉంటుంది. అనేక ప్రశ్నలకు బదులుగా ఉంటారు. ఒంటరిగా కూర్చుని కొన్ని విషయాల పరిష్కారాల గురించి తీవ్రమైన ఆలోచనలు చేస్తుంటారు. మీరు ఎక్కువగా లోలోపల ఆలోచించేవారిగా(introvert) ఉంటారు, నలుగురితో మీ భావాలు పంచుకునేందుకు సిద్దంగా ఉండరు. ఒకవేళ అలా పంచుకోవాలి అనిపిస్తే, మీ ప్రియమైన వారు అవ్వాల్సిందే. మీరు ఉన్నతమైన విలువలను కలిగి ఉంటారు, మోసాన్ని క్షమించలేరు. ఏదైనా విషయాన్ని ఒప్పుగా భావిస్తే, ఎవరు మీ వెనుక ఉన్నా లేకపోయినా మొండిగా నిలబడే లక్షణాన్ని కలిగి ఉంటారు. తద్వారా తెలియని శత్రువులు తయారవుతుంటారు. కానీ మీ ఎదుగుదలను మాత్రం వీరు ఎన్నటికీ అడ్డుకోలేరు.

నాల్గవ చిహ్నం:

నాల్గవ చిహ్నం:

ఈ చిహ్నాన్ని ఎంచుకున్నట్లయితే మీరు ఆలోచనా పరులుగా, జ్ఞానిగా ఉంటారు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం మీ సొంతం. అంతర్దృష్టి కలిగిన వారిగా ఉంటారు. తద్వారా ప్రజలకు మిమ్ములను అర్ధం చేసుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. తద్వారా మిమ్ములను తప్పుగా అర్ధం చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు కాస్త సృజనాత్మక దృష్టిని కలిగిన వారిలా ఉంటారు. మీరెప్పుడూ మీకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని కోరుకునే వారిలా ఉంటారు. ఒక్కోసారి ఇతరుల నుండి గౌరవాన్ని ఆశిస్తారు, భావోద్వేగాలు అధికంగా కలిగిన వారిలా ఉంటారు.

అయిదవ చిహ్నం:

అయిదవ చిహ్నం:

మీరు ఈ చిహ్నాన్ని ఎంచుకున్నట్లయితే, మీరు స్వతంత్ర భావాలు కలిగిన వారిలా ఉంటారు. మీ జీవితాన్ని మీకిష్టమైనట్లుగా మలచుకోవడానికి ఇష్టపడుతారు. వేరొకరు కలుగజేస్కోవడాన్ని అస్సలు సహించలేరు. మీకంటూ ప్రత్యేకమైన నియమాలు, నిబంధనలు ఉండేలా చూసుకుంటారు. మీ పరిధుల మేరకే ఇతరులను నమ్మడం నమ్మకపోవడం ఆధారపడి ఉంటాయి. ఒక ఉన్నతమైన మనిషిగా మీరు మీ కుటుంబానికి, స్నేహితులకు, సన్నిహితులకు, ప్రియమైన వారి జీవితాల ఎదుగుదలకు పునాదిలా సహాయపడుతారు. మీ కలల సాకారానికై మీరు నిరంతర శ్రమని కలిగి ఉంటారు. ఏది ఏమైనా మీ కల నెరవేరడం కోసం ఏమైనా చేయగలిగే పట్టుదల మీ సొంతo. మీ లక్ష్యాలను గురించిన ఫలితాలను కూడా మీరు అంచనా వేయగలరు. ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది . ఒక ప్రణాళికా బద్దమైన జీవితాన్ని నడుపుతారు, ఈ పద్దతే మీ విజయాలకు అండగా ఉంటుందని విశ్వసిస్తారు.

ఆరవ చిహ్నం:

ఆరవ చిహ్నం:

ఈ చిహ్నాన్ని ఎంచుకున్నట్లయితే, మీరు సంబంధాలకు అత్యధికంగా ప్రాధాన్యతని ఇచ్చేవారిలా ఉంటారు. తద్వారా ఇతరులతో , కుటుంబ సభ్యులతో , ప్రియమైన వారితో , స్నేహితులతో ఉత్తమమైన సంబంధాలను కలిగి ఉంటారు. మీ చుట్టూతా ఎల్లప్పుడూ కుటుంబ సభ్యులు , స్నేహితులు ఉండేలా చూసుకోవడం మీ అలవాటుగా ఉంటుంది. వారి సంతోషo లోనే మీ సంతోషాన్ని చూసుకోగల మనస్తత్వం కాబట్టి. మీ చుట్టూ ఉన్న మనుషులు ఎంతో సంతోషంగా, మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. మీరు అందరికీ తల్లో నాలిక లాగా సహాయపడుతూ ఉంటారు. మీరు ఎక్కువగా ఇతరుల నుండి ప్రేమను ఆశిస్తూ ఉంటారు, మరియు మీరు అంతే ప్రేమని ఇచ్చేవారిలా ఉంటారు కూడా.

ఏడవ చిహ్నం:

ఏడవ చిహ్నం:

మీరు ఆకర్షణీయంగా, అత్యధిక స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తిగా ఉంటారు. ఎల్లప్పుడూ నవ్వుతూ, నలుగురిని నవ్విస్తూ ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరుల నవ్వుకై మీరొక బహుమతిగా ఉంటారు. మిమ్ములను స్నేహితులుగా కలిగి ఉండడం వారి అదృష్టంగా భావిస్తారు. మీరు మీ చుట్టూ ఉన్న పరిస్థితులపట్ల నిరంతర ఆలోచనలను కలిగి ఉంటారు. మీ వ్యక్తిత్వం నలుగురికీ ఆదర్శంగా ఉండి, ఎల్లప్పుడూ మీ చుట్టూ ఇతరులు ఉండుటకు ఇష్టపడేలా ఉంటారు.

ఎనిమిదవ చిహ్నం:

ఎనిమిదవ చిహ్నం:

ఈ చిహ్నం ఎంచుకున్నట్లయితే మీరు సానుకూల దృక్పధాన్ని కలిగిన వారుగా ఉంటారు. మీరు మీ జీవితాన్ని ఒక బహుమతిగా భావిస్తుంటారు. ఆ జీవితాన్ని సార్ధకం చేసుకునే దృష్ట్యా మీ అడుగులు వేస్తుంటారు. మరియు నలుగురికీ సహాయపడుతూ, మీరు నష్టపోకుండా మీ జీవితాన్ని అర్ధవంతంగా ముగించాలన్న ఉన్నతమైన ఆలోచనలను కలిగి ఉంటారు. మీ విజయాలను చూసి మీకే గర్వంగా అనిపిస్తుంది. భావోద్వేగాలను పక్కనపెట్టి ఇతరుల సంతోషంలో పాలుపంచుకుంటూ మీ అసాధారణ వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తారు. మీ భావోద్వేగాలను మీ కుటుంబ సభ్యులతో లేదా మీ ప్రియమైన వారితో పంచుకుంటూ ఉంటారు. భావ వ్యక్తీకరణలో మిమ్ములని మించిన వారు ఉండరు.

Images Source: Link

English summary

Personality Tests That Help You Know Your Inner Self

It is believed that zodiac can point out some of our main personality traits. Apart from this, there are a few common favourite colours/symbols which can help you know your inner self; however, it can't send us a spiritual message like certain signs can.Pick A Symbol & Know About Your True Personality Type
Story first published:Tuesday, April 10, 2018, 18:18 [IST]
Desktop Bottom Promotion