For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కండోం బదులుగా ప్లాస్టిక్ బాగ్ ?

కండోం బదులుగా ప్లాస్టిక్ బాగ్ ?

|

ఎప్పుడైనా ఈ ఆలోచన మనసులో మెదిలిందా ? రతిలో కండోం బదులు ప్లాస్టిక్ బాగ్ వాడుతారా? నిజం, ఇది కొంచం అసహజంగా అనిపించినా కూడా, కొందరు ఇలాంటి వింత పద్దతులను అనేకం అనుసరిస్తున్నారు అంటే ఆశ్చర్యం కలిగించకమానదు. పరిస్థితులు, కండోం అందుబాటులో లేని సమయంలో ఇలాంటి చర్యలకు పూనుకుంటూ ఉంటారు కొందరు.

మనం నివసిస్తున్న ఈ వింతైన లోకంలో కొన్ని పోకడలు విచిత్రంగానే ఉంటాయి. ఇక్కడ కండోం బదులుగా ప్లాస్టిక్ బాగ్ వినియోగించిన జంట గురించిన వివరాలు మీకోసం.

కండోం బదులుగా అసంబద్దమైన ప్లాస్టిక్ బాగ్ ను వినియోగించిన జంట ఎదుర్కొన్న ఫలితాలు ..

వీరి గురించిన ఆలోచన వస్తేనే నవ్వొస్తుంది కదా, కానీ ఇలాంటి ప్రయోగాల వలన కండోం బదులుగా మరే ఇతర వస్తువులు వాడకూడదన్న విషయాలు అందరికీ అర్ధమవుతాయి. అర్ధమయింది కూడా. తద్వారా వేరే ఇతర పరికరాలను కండోం బదులుగా వినియోగించకూడదన్న అవగాహన అనేకమందిలో కలుగుతుంది.

అసలేం జరిగింది ... !

అసలేం జరిగింది ... !

వియత్నాం లోని ఒక యువజంట, రతి సందర్భంలో భాగంగా కండోం అందుబాటులోలేని నేపద్యంలో , రక్షణా చర్యల నిమిత్తం ప్లాస్టిక్ బాగ్ ను వినియోగించారు. తద్వారా జననేంద్రియాలు గాయాల పాలయ్యి అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చింది.

చివరికి హాస్పిటల్ లో లాండ్ అయ్యారు .. !

చివరికి హాస్పిటల్ లో లాండ్ అయ్యారు .. !

మొదటిసారి రతిలో పాల్గొoటున్న ఈ యువజంట , కండోం కొనుటకు సిగ్గు పడి, ఇలాంటి చర్యలకు ఉపక్రమించారు. తద్వారా జననేంద్రియాల వద్ద గాయాలతో హాస్పిటల్ లో చేరవలసిన పరిస్థితికి చేరుకున్నారు.

హాస్పిటల్ లో ... !

హాస్పిటల్ లో ... !

ప్లాస్టిక్ బాగ్ కండోం వలె సున్నితంగా, ఆరోగ్యకర లూబ్రికెంట్ కలిగి ఉండదు. తద్వారా ఈ గరుకుదనం తోడవడం కారణంగా గాయాలు తీవ్రంగా తయారయ్యాయి. తద్వారా రక్త స్రావం తోడైంది.

రోగ నిరోధక ఔషధాల వాడకం:

రోగ నిరోధక ఔషధాల వాడకం:

తప్పని సరి పరిస్థితుల్లో వైద్యుల సలహా మేరకు, జననేంద్రియాలకు లేపనాలు , రోగ నిరోధక ఔషధాలు వాడి, తగ్గించుకోవలసిన పరిస్థితులు వచ్చాయి. కానీ ఈ పరిస్థితి కారణంగా తెలియని వారికి కూడా వీరి సంబంధం గురించి తెలిసింది. రక్షణా చర్యల నిమిత్తం అవగాహనా రాహిత్యంతో చేసిన చర్యలు, వీరి జీవితాన్నే మార్చింది.

వైద్యుల సూచన :

వైద్యుల సూచన :

కండోంలు పూర్తిగా స్టెరిలైజ్ చేయబడి ప్రత్యేకమైన శ్రద్ధతో తయారుచేస్తారు, అవి కూడా ఎంపిక చేసిన కంపెనీలవే కొనేలా ఉండాలి. ఇలాంటి అసురక్ష చర్యలకు పూనుకోవడం వలన గాయాలే కాదు, ఒక్కోసారి ఇన్ఫెక్షన్ల బారిన పడి శారీరికంగా మానసికంగా జీవితాంతం చిత్రవధను అనుభవించే పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇటువంటి పరిస్తితులనైనా పాఠాలుగా తీసుకుని , క్రమంగా ఇలాంటి వికార చర్యలకు పూనుకోకుండా జాగ్రత్త పడాలని, లేకుంటే అనేక ఆరోగ్య సంబంధమైన సమస్యలకు కేంద్ర బిందువుగా మారాల్సి వస్తుందని వైద్యులు అంటున్నారు.

వీరు నివారణా చర్యలు తీసుకున్నారు అనిమాత్రమే తెలుసు కానీ, అవి ఎంత మాత్రం వీరికి పనిచేశాయి అన్న విషయం పై సరైన నివేదికలు కూడా లేవు.


English summary

Couple Who Used Plastic Bag Instead Of Condom!

Here, in this article, we are about to share the story of a couple who made love using a plastic cover instead of using a condom!! How absurd!! What happened to the couple will surely give a hearty laugh, but it will also educate you on "NOT" to use any unwanted things for pleasure sake, not even if you want to
Story first published:Saturday, April 21, 2018, 15:40 [IST]
Desktop Bottom Promotion