For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జన్మరత్నం వెనుక దాగివున్న నిగూఢార్ధం తెలుసుకోండి!

మీ జన్మరత్నం వెనుక దాగివున్న నిగూఢార్ధం తెలుసుకోండి!

|

మీ జన్మ రత్నం గురించి తెలుసుకోవాలని మీకు ఉత్సుకతతో ఉన్నారా? జాతిరత్నాలు లేదా జన్మరత్నాలు మన జీవితంలో శక్తివంతమైన మార్పులు కలుగజేసేందుకు గాను ప్రకృతి మాత మనకిచ్చిన అందమైన బహుమతులు. మన జన్మరాశి ఎలా అయితే మన వ్యక్తిత్వ లక్షణాలను నిర్థారిస్తుందో, అదే విధంగా ప్రతి జాతిరత్నం దేనికదే విలక్షణమైన ప్రత్యేకత కలిగి, మనం పుట్టిన నెలను బట్టి దాని ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మనం పన్నెండు జన్మరత్నాలలో దాగి ఉన్న నిగూఢార్ధం గురించి విశదంగా తెలుసుకుందాం.

Discover the hidden meaning of your birthstone

జన్మరత్నంతో మీ జీవితాన్ని పునరుత్తేజితం చేసుకోండి:

జాతిరత్నాలు అందమైనవే అయినా మన ఇష్టానుసారంగా ధరించరాదు. జాతిరత్నాలు ధరించేముందు నిపుణుల సలహా అవసరం. రత్నం యొక్క ఆకారం, రంగు మరియు పరిమాణం మీద ఆధారపడి, మీ వ్యక్తిత్వం వికశిస్తుంది. మీ హితార్థం ప్రఖ్యాత జ్యోతిష్కుడు ఆచార్య ఆదిత్యను సంప్రదిస్తే, మీకు తగిన జాతి రత్నమేదో తేల్చి చెప్తారు.

జనవరిలో పుట్టిన వారి కోసం గోమేధికం:

జనవరిలో పుట్టిన వారి కోసం గోమేధికం:

గోమేధికం నీలం కాకుండా వివిధ రంగుల్లో ఉంటుంది. ఈ రత్నం, ధరించిన వారికి చీకట్లో కాంతిపుంజంలాగా మార్గం చూపిస్తుంది. సందిగ్ధంలో ఉన్నప్పుడు సహాయం అందిస్తుంది. పాముకాటు, పీడకలల నుండి ఉపశమనం లభిస్తుంది. గోమేదికం ప్రేమ, నమ్మకం మరియు నిలకడలను సూచిస్తుంది. ఈ రత్నాన్ని ధరించిన వారు అత్యంత శక్తివంతులుగా ప్రేరేపణ పొందుతారు. మంచి పేరు కలుగుతుంది. ఇది మానసిక ప్రశాంతత చేకూరుస్తుంది.

2. ఫిబ్రవరిలో పుట్టిన వారి కోసం ఊదా రంగు గరుడపచ్చ:

2. ఫిబ్రవరిలో పుట్టిన వారి కోసం ఊదా రంగు గరుడపచ్చ:

ఊదా రంగు గరుడపచ్చ ఫిబ్రవరి నెలను సూచిస్తుంది. ఈ రత్నం రాజఠీవి, ప్రశాంతత, శాంతి, మరియు నిగ్రహమును సూచిస్తుంది. మద్యపానం అలవాటు తీవ్రంగా ఉన్నవారిని సంస్కరించడానికి ఈ రత్నం ఉపయోగపడుతుంది.

3. మార్చిలో పుట్టినవారికి లేత నీలం రంగు ఏక్వామెరైన్ (AQUAMARINE) :

3. మార్చిలో పుట్టినవారికి లేత నీలం రంగు ఏక్వామెరైన్ (AQUAMARINE) :

మేలో జన్మించిన వారికి ఉద్దేశింపబడిన ఏక్వామెరైన్ ప్రేమ, ఆశ, యవ్వనం మరియు మంచి ఆరోగ్యంలను సూచిస్తుంది. దీనిని ధరించినవారిని సాహసవంతులుగా మార్చి, సంపూర్ణ ఆనందం, ప్రశాంతత మరియు పరిపూర్ణ ప్రేమ జీవితాన్ని జీవితాన్ని అందిస్తుంది.

4. ఏప్రిల్ లో పుట్టిన వారి కోసం వజ్రాలు:

4. ఏప్రిల్ లో పుట్టిన వారి కోసం వజ్రాలు:

వజ్రాలు ఆడవారికి ప్రాణస్నేహితురాళ్ళని అంటారు. నిజమే కదా! అలా అయితే ఏప్రిల్ లో పుట్టినవారు అదృష్టవంతులు. దీనికి ఉన్మాదాన్ని పారద్రోలే రత్నంగా మంచి పేరు ఉంది. వివిధ రంగులలో లభ్యమయ్యే వజ్రాలు , అజేయానికి ప్రతీకగా, ప్రేమకు చిహ్నంగా నిలుస్తుంది. ఇది ప్రపంచంలోనే దృఢమైన రత్నం.

5. మేలో పుట్టిన వారి కోసం పచ్చలు:

5. మేలో పుట్టిన వారి కోసం పచ్చలు:

ప్రపంచంలో ఎక్కువమంది, అత్యంత ఇష్టపడే రాళ్ళు పచ్చలు. ఇవి మేలో జన్మించిన వారికి ఉద్దేశింపబడినవి.పచ్చ ఆరోగ్యం, విశ్వాసం మరియు సంతానోత్పత్తిని సూచిస్తుంది. పచ్చలను ధరిస్తే,కంటి చూపును గొప్పగా మెరుగుపడుతుంది.

6. ముత్యాలు మరియు మూన్ స్టోన్ (MOONSTONES):

6. ముత్యాలు మరియు మూన్ స్టోన్ (MOONSTONES):

ముత్యాలు రాచదర్పానికి చిహ్నాలు. అవునా? కాదా? జూన్ లో జన్మించిన వారికి మూన్ స్టోన్ తో పాటు ముత్యం కూడా జన్మ రత్నం. ముత్యాలు వివిధ రంగులలో లభ్యమవుతాయి, బూడిద, నలుపు, చాక్లెట్, తెలుపు, క్రీమ్ మొదలైనవి. ముత్యాలు నిరాడంబరత, స్థిరత్వం, వైవాహిక ఆనందం మరియు పవిత్రతను సూచిస్తాయి.

7. జులైలో పుట్టినవారికి కెంపులు:

7. జులైలో పుట్టినవారికి కెంపులు:

అందమైన ఎర్రని రంగులో మెరిసే ఈ రత్నం జులై నెలలో పుట్టినవారికి ఉద్దేశింపబడినది. కెంపులు బలం మరియు గొప్పదనంను సూచిస్తాయి. దీనిని ధరించినవారు సత్సాంగత్యం మరియు అదృష్టాన్ని ఆకర్షించడంలో సఫలీకృతం అవుతారు.

8. ఆగస్టులో పుట్టినవారికై లేత ఆకుపచ్చ పెరిడాట్ (Peridot):

8. ఆగస్టులో పుట్టినవారికై లేత ఆకుపచ్చ పెరిడాట్ (Peridot):

ప్రత్యేకమైన స్వీయకాంతిని కలిగి ఉండే ఈ రత్నంను ఆగస్టులో పుట్టినవారు ధరించాలి. ఇది చేతబడిని పారద్రోలి, ధరించినవారిలో అరిష్టాన్ని మరియు నిరాశను తొలగిస్తుంది.

9. సెప్టెంబర్ లో పుట్టిన వారికి నీలం:

9. సెప్టెంబర్ లో పుట్టిన వారికి నీలం:

గమ్మత్తైన ఈ రత్నం సెప్టెంబర్ లో జన్మించిన వారికి తగినది. సాధారణంగా ఇవి నీలిరంగులోని వివిధ ఛాయలలో లభిస్తాయి. నీలాలు ప్రశాంతత, గౌరవం, విశ్వాసం మరియు జ్ఞానంను సూచిస్తాయి

10. అక్టోబర్ లో పుట్టినవారికి ఓపల్ (OPAL)మరియు తొవరమల్లి (TOURMALINE):

10. అక్టోబర్ లో పుట్టినవారికి ఓపల్ (OPAL)మరియు తొవరమల్లి (TOURMALINE):

అందమైన రత్నాలైన ఓపల్ మరియు తొవరమల్లి అక్టోబర్ లో పుట్టినవారికి శ్రేష్ఠమైనవి. ఇవి ఒక వ్యక్తిలోని సృజనాత్మకత, ఆశ మరియు అమాయకత్వంకు అద్దం పడతాయి. ఇవి దుస్సంగత్యాన్ని మరియు అరిష్టాన్ని పారద్రోలుతాయి.

11. నవంబరులో పుట్టినవారికి పుష్పరాగము (YELLOW TOPAZ) మరియు సిట్రైన్:

11. నవంబరులో పుట్టినవారికి పుష్పరాగము (YELLOW TOPAZ) మరియు సిట్రైన్:

పుష్పరాగము మరియు సిట్రైన్ నవంబరులో జన్మించినవారిని ఉద్దేశించిన జాతిరాళ్లు. పుష్పరాగము మరియు సిట్రైన్, శారీరక శక్తిని సూచించడమే కాక మనస్సు మరియు శరీరానికి స్వస్థత చేకూరుస్తాయి. ఇది ధరించినవారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

12. డిసెంబరులో పుట్టినవారికి టర్కోయిస్ (TURQUOISE), నీలి టోపాజ్ (BLUE TOPAZ), మరియు టెంజనైట్ (TANZANITE) :

12. డిసెంబరులో పుట్టినవారికి టర్కోయిస్ (TURQUOISE), నీలి టోపాజ్ (BLUE TOPAZ), మరియు టెంజనైట్ (TANZANITE) :

టర్కోయిస్ ఒక మనోహరమైన రాయి. నీలి టోపాజ్ , మరియు టెంజనైట్ లతో పాటు టర్కోయిస్ ను డిసెంబర్ లో పుట్టిన వారు ధరించాలి. ఇవి తలనొప్పి మరియు ఇతర ఆరోగ్య అనారోగ్యాలను నివారిస్తాయని ప్రసిద్ధి చెందాయి. ఇవి ధరించినవారి శరీరంలోని రోగాలను గ్రహించుకుని, వారిని రోగవిముక్తులను చేసే శక్తి కలిగి ఉంటాయి.

English summary

Discover the hidden meaning of your birthstone

Discover the hidden meaning of your birthstone, Every living being on Earth is ruled by a planet or a star. Medieval astrologers as well as astrologers in antiquity knew which minerals
Desktop Bottom Promotion