For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సూప్, ఆహార పదార్ధాలలో మూత్ర విసర్జన చేసిన రెస్టారెంట్ ఓనర్ : సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్

  |

  సూప్, ఆహార పదార్ధాలలో మూత్ర విసర్జన చేసిన రెస్టారెంట్ ఓనర్ : సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్

  పోటీతత్వంతో కూడుకున్న వ్యాపారాలు మరియు పోటీ ప్రపంచం అనే అంశాలతో ప్రస్తుత ప్రపంచం నడుస్తూ ఉంది. వారి ప్రత్యర్థులను నాశనంచేసే ప్రక్రియలో భాగంగా అసూయతో కొన్ని విచిత్రమైన పనులకు పూనుకునే వ్యక్తులు కూడా ఉన్నారు ఈలోకంలో. కానీ ఆ విచిత్రమైన ఘటనలు బయటి ప్రపంచానికి తెలిసిన రోజున, అవాక్కవడం మన పని అవుతుంది.

  మరియు ఒకరి నాశనాన్ని మరియు ఓటమిని చూడడంలో అనేకమందికి తెలీని పైశాచిక ఆనందం ఉంటుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అలాగని అందరూ ఒకేలా ఉంటారు అనుకోవడం కూడా పొరపాటే. తులసి వనంలో గంజాయి మొక్కలవలె అక్కడక్కడ ఇటువంటి చెడు పోకడలు కలిగిన వ్యక్తులు కూడా తారసపడుతూ ఉంటారు. ఇక విషయానికి వస్తే చైనా స్థానిక మీడియాలో ప్రసారమైన ఒక నివేదిక ప్రకారం, ఒక రెస్టారెంట్ యజమాని, తన షాప్ లో తయారు చేసే ఒక సూప్ లో మరొక షాప్ ఓనర్ మూత్ర విసర్జన చేయడం చూసి హుతాశయుడయ్యాడు. నిజమండీ బాబూ.

  Disgusting Video Of Restaurant Owner Urinating In Rival’s Soup Goes Viral

  వినడానికే అసహ్యంగా ఉంది కదా, ఈ వ్యాసం కింద పొందుపరచబడిన వీడియోలో ఆ దారుణాన్ని మీరే చూడండి. అప్పుడు అసహ్యానికి పర్యాయ పదాలు, నానార్ధాలు అన్నీ మనసులో గిర్రున తిరుగుతాయి. మరియు ఆహారపదార్ధాలలో మరో పని కూడా చేశాడు ఈ మహానుభావుడు.

  ఈమధ్యనే కొన్ని ప్రదేశాలలో కోడి బిర్యాని అని కాకి బిర్యానీ, మటన్ పేరుతో పిల్లి మాంసాన్ని ఉపయోగించడం మనం చూస్తూనే ఉన్నాం. కుళ్ళిపోయిన మాంసాన్ని, ఇతర ఆహార పదార్ధాలను నెలల తరబడి శీతలీకరించి, పురుగు పట్టినా కూడా పారవేయకుండా సర్వ్ చేస్తున్న హోటళ్ళను, బయట దుకాణాలను మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. వాటన్నిటినీ మించిన దారుణం ఇది.

  ఇది చైనా లో జరిగింది:

  ఇది చైనా లో జరిగింది:

  ఏంటో కానీ ఈమద్య దారుణాలలో సగం చైనా నుండే దిగుమతి అవుతున్నట్లున్నాయి.

  చైనా దక్షిణ హైనాన్ ప్రావిన్స్ రాజధాని అయిన హైకావ్ లోని డాంగ్బే నూడుల్ షాప్ ఓనర్ ఈ దారుణానికి ప్రధాన సాక్షి.

  ఓనర్ వళ్ళు జలదరించింది :

  ఓనర్ వళ్ళు జలదరించింది :

  ఓనర్ చెప్పిన వివరాల ప్రకారం తమ ఆహార పదార్ధాలలో ఒకరకమైన దుర్వాసన రావడాన్ని గమనించిన ఈ డాంగ్బే నూడుల్స్ షాప్ ఓనర్, ఏదో జరుగుతుందని అనుమానించి ఎవరికీ అనుమానం రాకుండా సీసీటీవీ సర్వీలెన్స్ కెమరాలు ఏర్పాటు చేశాడు. తరువాత రోజు చూసిన ఫుటేజ్ లోని సంఘటనకు ఏం మాట్లాడాలో కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

  ఓనర్ జిగుప్సాకర సంఘటనకు సాక్ష్యమయ్యాడు:

  ఓనర్ జిగుప్సాకర సంఘటనకు సాక్ష్యమయ్యాడు:

  నివేదికల ప్రకారం, సీసీటీవీ ఫుటేజ్లో, డాంగ్బే రెస్టారెంట్ పక్క షాప్ ఓనర్, వీరి షాప్ కు వచ్చి, ఆహార పదార్ధాలు ఉన్న పాత్రల మూతలు తీసి మూత్ర విసర్జన చేయడంతో పాటు, తన ఒక బౌల్లో మలమూత్రాలను తీసుకుని వచ్చి మరొక పాత్రలో కలపడం వంటి చర్యలు కనిపించాయి.

  వీడియోలో బండారమంతా బయటపడింది:

  వీడియోలో బండారమంతా బయటపడింది:

  ఈ వీడియోలో, పాత్రలో మూత్రం విసర్జించడం, ఫాంటును పైకి లాగడం, వేరొక బౌల్లో మల మూత్రాలను తీసుకుని వచ్చి ఆహారపదార్ధాలలో గరిటెతో కలపడం వంటి చర్యలన్నీ కనిపించాయి. ప్రస్తుతం చైనాలో ఇది వైరల్.

   అసలెందుకిలా చేశాడు :

  అసలెందుకిలా చేశాడు :

  స్థానిక పోలీసుల కథనం ప్రకారం, ఈ రెస్టారెంట్ ఎదుగుదలను, సందర్శకుల రాకను తట్టుకోలేని క్రమంలోనే ఈ చర్యకు ఒడిగట్టినట్లు, మరియు ఈ విధంగానైనా ఆ షాప్ సందర్శకుల రాకను తగ్గించడం చేసి, తన వ్యాపారాభివృద్దికి తోడ్పడగలనని భావించానని పోలీసుల విచారణలో తెలిపాడు.

  అసూయ ఎంత దారుణానికి ఒడిగట్టేలా చేస్తుందో చూడండి. సాటిమనిషి ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు సమాజంలో అడుగడుగునా తారసపడుతూనే ఉంటారు, వారి నాశనం కోసం కనీసం ఒక్క మాటనైనా చెడుగా ప్రచారం చెయ్యాలని ఉవ్విళ్ళూరే తేనె పూసిన కత్తుల మద్య అనేక మంది బ్రతుకు బండిని ఈడుస్తున్నారు. కానీ ఇతను చేసిన ఈ పిచ్చి పని బయట పడడం వలన సమాజంలో తలెత్తుకోలేని స్థితికి చేరుకున్నాడు.

  ఈ ప్రపంచంలో ఎవడి లైఫ్ వాడిది. ఒకరితో మన జీవితాన్ని పోల్చి చూసుకోవడం వలనే సగం అసూయ కలగడానికి కారణం. "కంపేరిషన్ కిల్స్" అని ఊరికే అనరు పెద్దలు.

  ఈ వికృత చర్య గురించి మీ అభిప్రాయం ఏమిటి ? దిగువ వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. మరిన్ని క్రేజీ మరియు వైరల్ విషయాల నవీకరణల కోసం తరచుగా బోల్డ్స్కీ విభాగాన్ని తనిఖీ చేస్తుండండి.

  English summary

  Disgusting Video Of Restaurant Owner Urinating In Rival’s Soup Goes Viral

  A man in China took revenge with a rival restaurant owner, when he decided to bring down the image of the restaurant by peeing and mixing his excreta in the cooked beef soup! The entire act was caught on the CCTV. The man was handed over to the police and inquiry has been set in.Video Of Owner Urinating In Rival's Soup
  Story first published: Saturday, May 26, 2018, 16:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more