For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ షూ సైజు కూడా మీ వ్యక్తిత్వాన్ని నిర్వచించగలదా ?

|

షూ సైజు కూడా వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది అంటే, ఆశ్చర్యంగా ఉందా?

మీరు కూర్చునే విధానం నుండి మీ బొటనవేలు పరిమాణం వరకు మీ వ్యక్తిత్వాన్ని తెలిపే అంశాలు అనేకం ఉన్నాయి ఈ లోకంలో. అనేక మానసిక పరీక్షల దృష్ట్యా, వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పూర్తిగా బహిర్గతం చేయవచ్చని సూచిస్తున్నారు.

ఇక్కడ, ఈ వ్యాసంలో, వారి అడుగు పరిమాణాన్ని పరీక్షించడం ద్వారా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేసే విధానం గురించిన వివరాలను మీకు తెలియజేస్తున్నాము.

మనస్తత్వ పరీక్షల ప్రకారం, మన భౌతిక లక్షణాలను చూడటం ద్వారా మన వ్యక్తిత్వాన్ని నిర్వచించవచ్చు.

వ్యక్తుల వ్యక్తిత్వాన్ని వివరించడంలో భాగంగా ఈ వ్యాసం మీకు సహాయం చేస్తుంది, మరియు వారి లక్షణాలను, జీవన శైలి, వ్యక్తిత్వ వికాస పోకడలను కూడా వారి షూ పరిమాణాన్ని చూడటం ద్వారా నిర్వచించవచ్చు. ఈ అంచనాలు పూర్తిగా ఒక పరిశోధనపై ఆధారపడినవి, అనేక సందర్భాలలో ఇది నిజమని తేలింది కూడా! ఈ అంచనాలు అమెరికన్ షూ పరిమాణంపై ఆధారపడి ఉంటాయి.

మొదట మీ షూ పరిమాణం ఏమిటో తెలుసుకోండి!

క్రమంగా షూ సైజు ఎలా మీ వ్యక్తిత్వాన్ని నిర్వచించగలదో చూడండి.

షూ పరిమాణం 5 లేదా అంతకన్నా తక్కువగా ఉంటే?

షూ పరిమాణం 5 లేదా అంతకన్నా తక్కువగా ఉంటే?

మీ షూ పరిమాణం 5 లేదా అంతకన్నా తక్కువగా ఉంటే, ఒక వ్యక్తిగా మీరు సహృదయులుగా, ప్రకృతి ప్రేమికులుగా ఉంటారు మరియు మీ చుట్టూతా ప్రజలు ఉండడం మీకు సంతోషాన్నిస్తుంది. ఇతరులకు సహాయం చేయడంలో అన్నిటా ముందు ఉంటారు. ముఖ్యంగా మీ ప్రియమైన వారు కష్టాల్లో ఉంటే వెన్నంటే ఉండే స్వభావం మీది.

షూ సైజు 6?

షూ సైజు 6?

షూ పరిమాణం 6 గా ఉన్న వ్యక్తులు అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు మరియు హాపీ మాన్ వలె అందరితో మెలుగుతారని నమ్ముతారు. ఎక్కడికెళ్ళినా వీరికంటూ ఒక పరివారం ఏర్పడుతుంది, మరియు స్నేహసంబంధాలను అధికంగా కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరి హృదయంలోనూ వీరికంటూ ఒక స్థానం ఉంటుంది. అడవిలో వదిలేసినా, జంతువులతో కూడా స్నేహం చేసే సున్నిత హ్రుదయులుగా ఉంటారు. వీరు స్నేహపూర్వకమైన వ్యక్తులుగానే కాకుండా, అనువర్తన యోగ్యమైన మరియు ఉదార స్వభావాన్ని కలిగి ఉంటారు.

షూ సైజు 7?

షూ సైజు 7?

షూ పరిమాణం 7 గా ఉన్న వ్యక్తులు ఎక్కువ కృషి, మరియు పట్టుదల కలిగి ఉంటారు. వారు జ్ఞానం గల వ్యక్తులుగా, మరియు వారు, వారి విలువను ఖచ్చితంగా తెలుసుకున్న వారై ఉంటారు. మరోవైపు, ఇది మీ వలన కాదు అని చెప్తే అసలు సహించలేరు, మరియు ఆ పని పూర్తిచేసే దాకా నిద్రాహారాలను కూడా త్యజించే తత్వాన్ని కలిగి ఉంటారు.

షూ సైజు 8?

షూ సైజు 8?

షూ పరిమాణం 8 గా కలిగిన వ్యక్తులు జీవితాన్ని కొంచెం గంభీరంగా గడుపుతారని భావిస్తారు, కానీ అదే సమయంలో, వారు ఎలా వ్యవహరించాలో నిరంతరం తెలుసుకుంటూ ఉంటారు. వారు అధికంగా సవాళ్లను చేపట్టడం మరియు ఎటువంటి అడ్డంకులున్నా అదరక బెదరక ముందుకు సాగే తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా, తమ లక్ష్యసాధనలో నిరంతరం ఏదో ఒక సవాలు ఉండేలా ఆలోచనలు చేస్తుంటారు . మొత్తంమీద, సవాళ్లు లేని జీవితం ఈ వ్యక్తులకు కాస్త బోరింగ్ గా ఉంటుంది.

షూ సైజు 9?

షూ సైజు 9?

షూ సైజు 9 గా కలిగిన వ్యక్తులు అధికమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారని నమ్ముతారు, మరియు వారు ఎటువంటి విషయంలో అయినా స్పష్టతను కలిగి ఉంటారు. విమర్శలకు సైతం అదరక బెదరక ముందుకు అడుగులేసే వ్యక్తిత్వం వీరి సొంతం. ఇవే కాకుండా, వారు తమ పని తాము చూసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోని ఉత్తమ లక్షణాలను కలిగి ఉంటారు.

షూ సైజు 10?

షూ సైజు 10?

అమెరికాలో, షూ పరిమాణం 10 గా ఉండడం అనేది పురుషుల సగటు షూ పరిమాణంగా నమ్ముతారు. మరియు అది అత్యంత సాధారణమైన అంశంగా భావిస్తారు. ఈ వ్యక్తులు ఒకరి నియంత్రణలో ఉండుటను ఎన్నటికీ సహించలేరు. స్వేచ్చా స్వాతంత్ర్యాలకు అధిక విలువనిస్తూ, బానిస బ్రతుకులకు స్వస్తి పలకాలనే ఆలోచనలు కలిగి ఉంటారు. మరొక వైపు, ఇతరుల అభిప్రాయాలకు కూడా అత్యంత విలువనిచ్చేవారిగా ఉంటారు. ఎప్పటికీ ఉన్నత లక్షణాలను కలిగి ఉండాలన్న ఆలోచనలు చేస్తుంటారు.

షూ సైజు 11?

షూ సైజు 11?

షూ పరిమాణం 11 గా కలిగిన వ్యక్తులు ఎక్కువగా సవాళ్లను చేపట్టాలని కోరుకుంటూ ఉంటారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా వెనుతిరగక లక్ష్య సాధన పట్ల అడుగులువేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. పార్టీలు, లేట్ నైట్ పార్టీలు మొదలైన వాటి పట్ల ఆసక్తి కనపరుస్తున్నా, లక్ష్యాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విస్మరించని నైజాన్ని ప్రదర్శిస్తుంటారు.

షూ సైజు 12?

షూ సైజు 12?

షూ సైజు 12గా కలిగిన వ్యక్తులు, ఎక్కువగా ఎటువంటి అసౌకర్య పరిస్థితులను కూడా అంగీకరించలేని వారిగా ఉంటారు. మరియు ముక్కుసూటి తత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ వ్యక్తులు తక్కువ సంఖ్యలో మిత్రులను కలిగి ఉంటారు, కానీ కొద్దిమందితో స్నేహం అయినా, స్నేహం పట్ల నిబద్దతను కలిగి ఉంటారు. ప్రకృతి ప్రేమికులుగా ఉన్న వీరు, ఆనందాల కోసం కొత్త ప్రదేశాలకు వెళ్ళాలన్న తపనని కలిగి ఉంటారు. ముఖ్యంగా తమ ప్రియమైన వారికి అధిక విలువనిచ్చే వీరు, వారి మాటలకు గౌరవమిస్తూ వారి ఉనికిని ప్రోత్సహిస్తుంటారు. క్రమంగా వీరిని తెలీకుండానే ఎక్కువమంది అభిమానిస్తూ ఉంటారు.

షూ సైజు 13 లేక అంతకన్నా ఎక్కువగా ఉందా?

షూ సైజు 13 లేక అంతకన్నా ఎక్కువగా ఉందా?

షూ పరిమాణం 13 గా కలిగి ఉన్న వ్యక్తులు, క్లాసీగా ఉంటూ అధునాతన భావజాలాలను ప్రదర్శిస్తూ ఉంటారు. కాకపోతే సలహాలు, సూచనలకోసం ఇతరులపై అధికంగా ఆధారపడే వీరు, లక్ష్య సాధనలో కూడా వారి సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తమ ప్రియమైన వారిని లక్ష్య సాధనలో భాగస్వామిగా చేయాలన్న ఆలోచనను చేస్తుంటారు. ఈ వ్యక్తులు తమ ప్రియమైన వారి పట్ల విశ్వసనీయంగా ఉంటారు, మరియు ఇతరుల కోసం వారి అభిప్రాయాలను ఎన్నటికీ మార్చుకోని వారిగా ఉంటారు. కోపావేశాలు, భావోద్వేగాల గని వీరి మనసు. ప్రతి చిన్న విషయాన్ని కూడా తీవ్రంగా ఆలోచిస్తూ, ఒక్కోసారి తమ ఉనికినే ప్రశ్నార్ధకం చేసుకునే స్థాయిలకు వెళ్తుంటారు.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు, జీవనశైలి, ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Do You Know That Your Shoe Size Can Reveal About Your Personality

According to psychological revelations, it is believed that your shoe size can reveal a lot about your personality! All the different sizes have their personality, and it describes the individuality of a person. Each size has its own definition and this has been revealed in a research done to study personalities.
Story first published: Thursday, July 19, 2018, 10:10 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more