For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివిధ రాశులపై చంద్రగ్రహణ ప్రభావం మరియు పరిహారాలు

వివిధ రాశులపై చంద్రగ్రహణ ప్రభావం మరియు పరిహారాలు

|

ఈ శతాబ్దంలోనే అతిపెద్ద చంద్ర గ్రహణం జులై 27, 2018 న సంభవిస్తుంది. ఇది ఈ సంవత్సరంలో వచ్చిన గ్రహణాల్లో రెండవ అతి పెద్ద గ్రహణం. అదే రోజున, భారతదేశంలో గురు పూర్ణిమను జరుపుకుంటారు. జూలై 27 న రాత్రి 11:54 గంటల నుండి ,జూలై 28 న తెల్లవారు జామున 3:55 గంటల వరకు ఉంటుంది.

ఈ గ్రహణం శని యొక్క ఇంట్లో, మకరరాశిలో సంభవిస్తున్నందున, శని మరియు చంద్రుడు రెండింటి యొక్క ప్రభావం కనిపిస్తుంది. ధనుస్సు, మకరం మరియు వృశ్చిక రాశివారు ఏలినాటి శని కాలంలో సాగుతున్నారు.

Effects of Lunar Eclipse on Zodiac Signs and Remedy

ఏలినాటి శని అనగా, శని ప్రభావం ఉండే ఏడు సంవత్సరాల వ్యవధి. ఈ వ్యవధిమొత్తంలో, శనిగ్రహం ఒక రాశిచక్రంలో ఉంటుంది. చంద్రగ్రహణం మరియు ఏలినాటి శని రెండూ శని ప్రభావం వలన సంభవిస్తున్నందున, ఈ రాశుల వారికి ప్రతికూల ప్రభావం కలుగుతుంది.

అయినప్పటికీ, జూలై 27 న సూతక కాలం (గ్రహణం కారణంగా ఏర్పడిన దురదృష్టకరమైన సమయం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. సూతక కాలం ఒక గ్రహణం సంభవించే సమయాన్ని సూచిస్తుంది. ఇది కొన్ని విషయాలలో అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. సూతక కాలం ప్రారంభమైనప్పటి నుండి, గ్రహణం యొక్క ప్రతికూల శక్తి క్రియాశీలకంగా మారుతుందని చెప్పబడుతుంది. గ్రహణం యొక్క ప్రభావం108 రోజుల పాటు నిలిచి ఉంటుందని నమ్ముతారు. ఇప్పుడు మనం, వివిధ రాశుల వారిపై ఈ గ్రహణం యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం.

మేషం:

మేషం:

చంద్ర గ్రహణం, ఈ రాశివారికి అత్యంత శుభకరమైన సమయాన్ని తీసుకువస్తుంది. ఈ జూలై 27న వచ్చే గ్రహణం, ఈ రాశివారికి ఆర్ధిక లాభాలతో పాటుగా వృత్తిపరంగా కూడా నూతన మరియు మెరుగైన అవకాశాలను తీసుకువస్తుంది.

వృషభం:

వృషభం:

ఈ గ్రహణం సమయం వృత్తిపరంగా, వృషభ రాశివారికి మెరుగైన అవకాశాన్ని సూచిస్తుంది. . అలాంటి సమయాల్లో, హనుమాన్ చాలీసా వల్లెవేయటం వలన అద్భుతాలు జరుగుతాయి.

మిథునం:

మిథునం:

ఆరోగ్యపరంగా ఈ రాశివారికి, కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవచ్చు. వీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయినప్పటికీ , ఈ గ్రహణం కూడా ఈ రాశివారికి కూడా ఆర్థిక లాభాలు తీసుకువస్తుంది.

కర్కాటకం:

కర్కాటకం:

ఈ రాశికి అధిపతి చంద్రుడని మనకు తెలిసినదే! చంద్రుడు కూడా గ్రహణం గుండా వెళుతున్నందున, కర్కాటక రాశివారికి కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. వీరు తమ భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి.

సింహం:

సింహం:

సింహరాశి వారికి స్వతహాగా, ఏ విషయాన్నైనా తేలికగా తీసుకునే వైఖరి ఉంటుంది కనుక, ఎంత కష్టంతో కూడుకున్న పరిస్థితులనైనా సులభంగా ఎదుర్కుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు తలెత్తినప్పటికీ, వీరు శుభవార్తలను వినేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. కనుక, ఈ గ్రహణం సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు తెస్తుంది.

కన్య:

కన్య:

ఈ రాశికి చెందిన వ్యక్తులు, శివునికి సంబంధించిన మంత్రాలను పఠించి, ప్రార్థనలు చేయాలి. పరమశివుని దీవెనలు పొందితే, అదృష్టం ఆకర్షించడానికి అనువుగా ఉంటుంది.

తుల:

తుల:

ఈ గ్రహణం తులారాశి వారికి శుభవార్త మోసుకువస్తుంది. ఆస్తి మరియు వ్యాపారం సంబంధిత విషయాల్లో లాభాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

వృశ్చికం:

వృశ్చికం:

ఈ రాశివారికి ఈ గ్రహణం మిశ్రమ ఫలితాలను తెచ్చినా, రాబోయే కాలంలో మంచి అవకాశాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ధనుస్సు:

ధనుస్సు:

ఈ రాశికి చెందిన వ్యక్తులు, కుటుంబ సంబంధిత మరియు ఆర్థిక సంబంధిత సమస్యల కారణంగా కొన్ని ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది.

మకరం:

మకరం:

ఈ గ్రహణం వీరిలో ఆందోళన పెరిగే అవకాశాలను సూచిస్తుంది. ఈ రాశిలోనే చంద్ర గ్రహణం వస్తుంది కనుక, ఈ రాశికి చెందినవారికి ఆర్ధిక మరియు మానసిక చింతలు ప్రధానంగా సంభవించే అవకాశాలు సూచించబడ్డాయి.

కుంభం:

కుంభం:

ఈ రాశివారికి, గ్రహణం రోజున భౌతిక మరియు మానసిక చింతలుంటాయని సూచించబడ్డాయి. కనుక, వీరి విషయంలో ప్రతికూల ప్రభావాలు ఉన్నాయని చెప్పవచ్చు.

మీనం:

మీనం:

ఈ రాశికి చెందిన వ్యక్తులు, ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికి, ఈ రాశివారిపై గ్రహణ ప్రభావాలు తక్కువగా ఉంటాయి.


English summary

Effects of Lunar Eclipse on Zodiac Signs and Remedy

Lunar eclipse, occurring on July 27, 2018, will be the second big eclipse of the year, and the longest of the century. Astrology experts say, good opportunities will come for Sagittarius, Aquarius, Capricorns, negative effects for Aries, Leos and Scorpions. Read on to see what treasures it is going to open before you based on your zodiac
Desktop Bottom Promotion