For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీడు మగాడ్రా బుజ్జీ : అగ్రకులాలపై పోరాడి బారాత్ చేసుకున్న దళితుడు, వందలాది మంది పోలీసుల సంరక్షణ

సంజయ్ ఒక దళితుడు. అతనిది ఉత్తరప్రదేశ్‌ లోని హత్రాజ్‌ జిల్లా బసాయ్‌ గ్రామం. లా చేస్తున్నాడు. అయితే ఆరు నెలల కింద సంజయ్ కి పెళ్లి నిశ్చయమైంది.అగ్రకులాలపై పోరాడి బారాత్ చేసుకున్న దళితుడు.

|

వివాహం అంటే అందరికీ గుర్తొచ్చేది బారాత్. పెళ్లి ఎలా చేసుకున్నా ఫర్వాలేదు కానీ బారాత్ మాత్రం అట్టహాసంగా చేసుకోవాలనుకుంటారు అందరూ. అయితే కొన్ని ప్రాంతాల్లో అగ్ర వర్ణాలకు భయపడి ఇలాంటి వేడుకలు చేసుకునే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా దళితులు ఇలాంటి బారాత్ లు చేసుకుంటే అంతే సంగతి.

బారాత్ జరగకుండా దాడులు

బారాత్ జరగకుండా దాడులు

ఒకవేళ ధైర్యం చేసి ఎవరైనా తమ పెళ్లి వేడుకలో బరాత్ పెట్టుకుంటే ఆ వేడుక జరగకుండా దాడులు కూడా చేస్తారు. ఇలాంటి ఘటనలు ఉత్తరప్రదేశ్ లో తరుచూ జరుగుతుంటాయి. అయితే ఒక దళితుడు మాత్రం తన పెళ్లిలో కచ్చితంగా బరాత్ ఉండాలనుకున్నాడు. ఎలా అయినా సరే పెళ్లి వేడుకలో ధూం.. ధాం చేయాలనుకున్నాడు. దాంతో కోర్టుకు వెళ్లాడు ఆ దళితుడు.

అగ్ర వర్గాల వారి పెళ్లిళ్లలోనే బారాత్ లు

అగ్ర వర్గాల వారి పెళ్లిళ్లలోనే బారాత్ లు

నెలల తరబడి న్యాయ పోరాటం చేశాడు. మొత్తానికి తాను అనుకున్నది సాధించాడు. ఎనభై ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో ఇక దళితుడు ఇలా తన పెళ్లి వేడుకను వైభవంగా చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌ అంటేనే కుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ప్రాంతం. యూపీలో కేవలం అగ్ర వర్గాల వారి పెళ్లిళ్లలోనే బారాత్ లు జరుగుతాయి. ఇక దళితులంటే చాలా చిన్న చూపు ఉంది అక్కడ.

అందరికీ తెలిసేలా బారాత్

అందరికీ తెలిసేలా బారాత్

సంజయ్ ఒక దళితుడు. అతనిది ఉత్తరప్రదేశ్‌ లోని హత్రాజ్‌ జిల్లా బసాయ్‌ గ్రామం. లా చేస్తున్నాడు. అయితే ఆరు నెలల కింద సంజయ్ కి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి కూతురు ఊరు కస్గంజ్‌ జిల్లా నిజామ్‌పూర్‌. పెళ్లి పూర్తయిన తర్వాత సంజయ్ అందరికీ తెలిసేలా బారాత్ చేసుకోవాలనుకున్నాడు.

అలహాబాద్‌ హైకోర్టు కు వెళ్లాడు

అలహాబాద్‌ హైకోర్టు కు వెళ్లాడు

కానీ సంజయ్ ని తమ ఇళ్ల మీదుగా నుంచి వెళ్లనివ్వమని బారాత్ నిర్వహించడానికి వీలులేదని కొందరు ఠాకూర్‌ లు చెప్పారు. దీంతో సంజయ్‌ ఎలా అయినా సరే తన కలను నెరవేర్చుకోవాలనుకున్నాడు. ఆరు నెలల కిందనే అలహాబాద్‌ హైకోర్టు కు వెళ్లాడు. తన సమస్యపై కేసు ఫైల్ చేశాడు.

సీఎంకు ఫిర్యాదు

సీఎంకు ఫిర్యాదు

అలాగే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంతి యోగి ఆదిత్యనాథ్‌ కు కూడా చాలా సార్లు ఫిర్యాదు చేశాడు సంజయ్. మొదట ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత సంజయ్ వాదనను విన్నారు. మొత్తానికి అధికారులంతా స్పందించారు.

గ్రామంలోని ఠాకూర్‌ లతో అధికారులు చర్చలు చేపట్టారు.

పెద్దలంతా ఒకే అన్నారు

చివరకు బారాత్‌ చేసుకునేందుకు ఊర్లోని పెద్దలంతా అంగీకరించారు. పోలీసులు గ్రామంలోని పెద్దలతో సంతకాలు కూడా తీసుకున్నారు. అయితే గ్రామంలో చాలా రోజుల తర్వాత జరుగుతున్న దళితుడి బారాత్ పోలీసులు అర్లర్లు జరుగుతాయోమోననే భయంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

350 మందికి పైగా పోలీసులు

350 మందికి పైగా పోలీసులు

10 మంది ఇన్ స్పెక్టర్స్, ఇరవై రెండు మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్స్, ముప్పై ఐదు మంది హెడ్‌ కానిస్టేబుల్స్ తో పాటు 100 మంది కానిస్టేబుల్స్ తో భారీగా బందోబస్తు నిర్వహించారు. మొత్తం 350 మందికి పైగా పోలీసులు చేరుకున్నారు. సాధారణంగా ఏ అధికారి పర్యటనకో లేదంటే ప్రజాప్రతినిధుల పర్యటనలకు ఇలాంటి ఏర్పాట్లు చేస్తారు.

మొదటి దళితుడిని కావడం సంతోషం

మొదటి దళితుడిని కావడం సంతోషం

మొత్తం ముప్పై కార్ల తో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఇప్పటికీ కొంతమంది దళితులకు రెస్పెక్ట్ ఇవ్వకూడదని అనుకుంటున్నారని ఇది మంచి పద్ధతి కాదని సంజయ్ అన్నాడు. ఇక తన గ్రామంలో చాలా ఏళ్ల తర్వాత బారాత్‌ నిర్వహించిన మొదటి దళితుడిని కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలా మొత్తానికి సంజయ్‌ వైభవంగా బారాత్ నిర్వహించకున్నాడు.

English summary

epic wedding 350 cops turn baaratis for dalit groom in up

epic wedding 350 cops turn baaratis for dalit groom in up
Story first published:Tuesday, July 17, 2018, 12:13 [IST]
Desktop Bottom Promotion