For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వీడన్ లో “స్లీపింగ్ బ్యూటీ” రోగం గురించి విన్నారా ఎప్పుడైనా ?

|

ఈ ప్రపంచంలో వికారమైన పరిస్థితులు, రోగాలు, వింతలు అనేకం ఉన్నాయి. కానీ కొన్ని ఆశ్చర్యగొలిపేవిలా ఉంటాయి. ఇక్కడ చెప్పబోయే వింత కూడా అలాంటిదే.

కొంతమంది పిల్లలు లేదా యువత రెజిగ్నేషన్ సిండ్రోం ( సమాజం నుండి తాత్కాలిక విరమణ)అనే వ్యాధికి గురయ్యామన్న భావనలో ఉంటుంటారు, దీనిని అప్గివెన్హెట్స్ సిండ్రోం (నిద్రలోనే మల మూత్ర విసర్జనలు చేసే పరిస్థితి) అని కూడా పిలుస్తారు.

ఇది నిజంగానే అత్యంత వికారమైన పరిస్థితి, ఈ పరిస్థితికి గురైన పిల్లలు ఒక్కసారి నిద్రపోతే ఇక మేలుకోరు. ఒక్కోసారి ఆ నిద్ర గంటల వ్యవధిలో ఉంటే, కొన్ని సందర్భాలలో మాత్రం రోజులు, నెలలు, సంవత్సరాలుగా కూడా మారుతూ ఉంటాయి. ఇది వారి కుటుంబీకులకు చెప్పుకోలేని నరకాలనే మిగులుస్తుంటాయి.

Heard About The Strange Sleeping Beauty Illness In Sweden?,

దీని గురించిన అనేక చర్చలు కూడా జరిగాయి, తద్వారా దీనిని రెజిగ్నేషన్ సిండ్రోంగా కూడా వ్యవహరిస్తూ వచ్చారు. ఇక్కడ ఈ పరిస్థితికి గురయిన పిల్లలను ఉదాసీనత కలిగిన వారిగా గుర్తించి వారి మానసిక పరిస్థితులను సరిదిద్దే క్రమంలో భాగంగా మానసిక చికిత్సాలయంలో (అసిలిం) లో చేర్చేవారు. ఒక్క స్వీడన్ ప్రభుత్వంలోనే ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. బహిష్కరించబడిన లేదా, మానసిక వికలాంగులను చేరదీసి జాగ్రత్త తీసుకునే చర్యలు చేసేలా చట్టాలు ఉన్నాయి. కానీ అసిలింగా పిలవబడే ఈ ప్రదేశాలలో, వీరిని సైన్స్ ప్రయోగాలకు వినియోగించేవారని అనేక కథనాల్లో కూడా వచ్చాయి. ఇవి నిజమో , అబద్దమో కూడా ఎవరికీ తెలీదు. వీటి పేరు మీద సినిమాలు కూడా వచ్చాయి.

వందల మంది పిల్లలు ఈ పరిస్థితుల్లో:

ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని వందలమంది పిల్లలు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఈ సంఖ్య కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. 400 మంది పిల్లల కన్నా ఎక్కువ మంది 2000, 2005 వ సంవత్సరంలో ఇలాంటి రెజిగ్నేషన్ సిండ్రోం పరిస్థితులను ఎక్కువగా ఎదుర్కొనినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా 8 నుండి 15 సంవత్సరాల వయసు పిల్లలే ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం ఎంతో భాదాకరమైన విషయం.

పిల్లలు ఎదుర్కొనే పరిస్థితులు ఇలా ఉంటున్నాయి:

ముఖ్యంగా ఈ పరిస్థితికి లోనయిన పిల్లలు, తీవ్రమైన కోమా పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ జీవితానికి చరమాంకంలో చావుకు దగ్గరగా ఉండునట్లుగా ఉంటారు. ఏమీ తినరు, మాట్లాడారు, కనీసం కళ్ళు కూడా తెరవరు . కాని బ్రతికి ఉంటారు. డ్రిప్ – ట్యూబ్స్ ఉపయోగించి ఆహారాన్ని అందించడం ద్వారా వీళ్ళను బ్రతికించవచ్చు. అనేక మంది పిల్లల కథనం ప్రకారం ఒక్కొక్కరు 2 సంవత్సరాలకు పైగా పడకకు అంకితమైనట్లుగా తెలుపుతున్నారు.

బహిష్కరణకు గురైన కుటుంబాలలోనే ఇలా ....

ఈ అరుదైన, వింతైన సమస్యగురించి పరిశోధనలు చేసిన అనేకమంది పరిశోధకులు, వైద్యులు ఇలాంటి పరిస్తితులు తూర్పు ఐరోపా ప్రాంతాలలోనే ఎక్కువగా కనిపిస్తున్నట్లు తేల్చారు. అది కూడా ఎక్కువ పవిత్ర సమాజాలుగా గుర్తించిన ప్రాంతాలలోనే ఇలా జరగడం గమనార్హం. సమాజం చేత నిర్దేశించబడిన కొన్ని అసాఘిక నిబంధనలను సహించలేక, ఎదుర్కొనలేక తమ కుటుంబాలను వాటినుండి కాపాడుకోలేమన్న భావనకు గురైన వారు, ఇలాంటి మానసిక పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అని తేల్చారు.

మరి పసి పిల్లలే ఎందుకు?

ఎక్కువమంది సామాజిక బహిష్కరణకు గురైన కుటుంబాలలోని పిల్లలే ఇలాంటి పరిస్థితులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఒక అవగాహనకు వచ్చిన పిల్లలు, తమ కుటుంబాలు బహిష్కరణకు గురయ్యాయి అని తెలుసుకున్న నేపద్యంలో, ఎవరినీ అడగలేక, సమస్య పరిష్కారానికి మార్గాలు లేక లోలోపల చిత్ర వధను అనుభవిస్తూ, క్రమంగా ఇలాంటి పరిస్థితులకు గురవుతున్నారు అని తేలింది. ఇలాంటి పరిస్థితులకు గురవుతున్న పిల్లలు మాట్లాడడం తగ్గించడం, సామాజిక విషయాల నుండి నెమ్మదిగా దూరమవడం వంటి పనులు చేస్తుంటారు. నెమ్మదిగా ప్రపంచం నుండి దూరం అవ్వాలని వీరి ప్రయత్నంగా ఉంటుంది.

కానీ మరో పక్క ఇలాంటి పిల్లలను లక్ష్యంగా చేసుకుని, వీరిని డ్రగ్స్ కు బానిసలుగా చేసి, తద్వారా మానసిక చికిత్సాలయమునకు చేరుస్తూ, పసిపిల్లలను ప్రయోగాలకు కూడా వినియోగించేవారని అనేకమంది తమ పరిశోధనల్లో భాగంగా తెలిపారు. కానీ వీటిపై ఖచ్చితత్వంతో కూడిన ఆధారాలను మాత్రం సంపాదించలేక పోయారు. వీటికి ప్రభుత్వమే అండగా ఉందని కొందరి అభిప్రాయం కూడా.

వైద్యులు తేల్చిన విషయం:

పరిశోధకులు మరియు వైద్యుల కథనం ప్రకారం, మెదడులో ఆలోచనా శక్తి కలిగిన భాగం పూర్తిగా పనిచేయడం ఆగిపోవడం మూలంగా, అనగా సెరిబెల్లం పని చేయడం ఆగిపోవడం మూలంగా పిల్లలు ఈ పరిస్థితికి లోనవుతున్నారు. తద్వారా వీరికి ఆహారాన్ని ట్యూబ్స్ ద్వారా అందిస్తూ, మలమూత్ర విసర్జనలకు నాపీస్ వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ఇలాంటి పరిస్థితుల కారణంగా మరణాలు మాత్రం సంభవించలేదని చెప్తున్నారు. కానీ ఎంతవరకు నిజమో ఎవ్వరికీ తెలియదు.

మీరు ఇంకేదైనా వింతైన సంఘటనల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా లేదా, మీకేదైనా వింత సంఘటనల గురించిన వివరాలు తెలుసా, అయితే క్రింది కామెంట్ సెక్షన్లో తెలపండి.

అలాగే, ఇటువంటి అరుదైన ఘటనల గురించిన వివరాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాము. కావున మా పేజీని తరచూ తనిఖీ చేస్తుండండి.

English summary

Heard About The Strange 'Sleeping Beauty' Illness In Sweden?

In this article, we are revealing some of the interesting facts about one such strange condition in which kids are believed to suffer from "Resignation Syndrome", which is also known as "uppgivenhetssyndrom."
Story first published:Saturday, April 21, 2018, 15:20 [IST]
Desktop Bottom Promotion