For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసుపత్రిలో చేరిన చేపలు, పేషెంట్స్ తో ఆడుకుంటున్నాయి, ప్రభుత్వాన్ని ఎక్కేస్తున్నారు

పాట్నాలోని నలంద మెడికల్ కాలేజీ హాస్పిటల్ నిండా వరదనీరు చేరింది. హాస్పిటల్ అంతా కూడా ఒక చిన్నపాటి చెరువులాగా మారిపోయింది. అంతేకాదు ఆ నీటిలోకి చేపలు కూడా వచ్చాయి. చేపలు చక్కగా ఈదుతూ ఆడుకుంటున్నాయి.

|

వర్షాలు అప్పుడప్పుడు అందరినీ అతలాకుతులం చేస్తుంటాయి. ఎడతెరిపి లేకుండా వానలు కురిస్తే చాలా ఇబ్బందులు వస్తాయనే విషయం మన అందరికీ తెలిసిందే. కొన్నిరోజుల క్రితం బిహార్ ను వర్షాలు అతలాకుతలం చేశాయి.

ఆ భారీ వర్షాలకు బిహర్ రాజధాని పాట్నా అంతా కూడా వరదనీరు చేరింది. అడుగు తీసి అడుగు వేయలేనంతగా పరిస్థితి మారిపోయింది. అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. ఇక ఈ వరద నీరు హాస్పిటల్ లోకి కూడా వెళ్లింది. దీంతో అక్కడ రోగులు పడరాని పాట్లు పడ్డారు.

హాస్పిటల్ నిండా వరదనీరు

హాస్పిటల్ నిండా వరదనీరు

పాట్నాలోని నలంద మెడికల్ కాలేజీ హాస్పిటల్ నిండా వరదనీరు చేరింది. హాస్పిటల్ అంతా కూడా ఒక చిన్నపాటి చెరువులాగా మారిపోయింది. అంతేకాదు ఆ నీటిలోకి చేపలు కూడా వచ్చాయి. చేపలు చక్కగా ఈదుతూ ఆడుకుంటున్నాయి.

దీంతో రోగులంతా చాలా ఇబ్బందులుపడుతున్నారు. ఇక ఈ నలంద ఆస్పత్రి బిహార్ మొత్తంలోనే పెద్ద హాస్పిటల్ కావడంతో జనాలంతా అక్కడికి వస్తుంటారు. పేషెంట్స్ బెడ్ల కిందికి ఐసీయూ వార్డ్ ల్లోకి కూడా వరద నీరు చేరింది. దీంతో బెడ్స్ దిగలేని పరిస్థితుల్లో రోగులున్నారు.

ప్రజాప్రతినిధుల ఇళ్లు కూడా నీటితో నిండిపోయాయి

నీళ్లు ఫుల్ గా ఉండడంతో రోగులకు వైద్యం ఎలా అందించాలో తెలియక సతమతం అవుతున్నారు డాక్లర్లు. ఆసుపత్రే కాదు కొందరు ప్రజాప్రతినిధుల ఇళ్లు కూడా ఇలా నీటితో నిండిపోయాయి. డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీ ఇంట బయటంతా ఫుల్ గా నీళ్లు ఉన్నాయి. ఆ ఇంట్లో వారు అడుగు బయటకు పెట్టాలంటే అల్లాడిపోతున్నారు.

ఆక్వేరియాల్లా మారుతున్నాయి

ఆక్వేరియాల్లా మారుతున్నాయి

ఇక దొరికిందిరా ఛాన్స్ అని బిహార్ ప్రభుత్వాన్ని ఆడుకుంటున్నారు ప్రతి పక్ష నేతలు. తేజస్వీ యాదవ్‌ సీఎంపై మండిపడ్డారు. ఏం చేస్తుందయ్యా.. మీ ప్రభుత్వం హాస్పిటల్స్ అన్నీ కూడా ఆక్వేరియాల్లా మారుతున్నాయి. ఎక్కడైనా హాస్పిటల్స్ లో రోగులుండాలి కానీ బిహార్ లో మాత్రం ఆసుపత్రుల్లో చేపలు తిరుగుతున్నాయంటూ చురకలు అంటిస్తున్నారు ప్రతి పక్షనేతలు.

చేపలు తిరగడం ప్రభుత్వం గొప్పదనం అని చెప్పవద్దు

చేపలు తిరగడం ప్రభుత్వం గొప్పదనం అని చెప్పవద్దు

ఇలా చేపలు తిరగడం కూడా మా ప్రభుత్వం గొప్పదనం అని మాత్రం చెప్పవద్దు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఆసుపత్రిలో రోగులు పడుతున్న ఇబ్బందులు, నీటిలో చేపలు తిరుగుతన్ను ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. అయితే వెంటనే ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గం చూపకపోతే ఆసుపత్రి చేపలా చెరువు అయిపోతుందని అందరూ అంటున్నారు.

English summary

fish swim in flood water in the campus of patnas nalanda medical college hospital

fish swim in flood water in the campus of patnas nalanda medical college hospital
Story first published:Wednesday, August 1, 2018, 16:11 [IST]
Desktop Bottom Promotion