For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఆడవాళ్ల గురించి కొన్ని హాస్యాస్పద సంగతులుః మహిళా దినోత్సవ ప్రత్యేకం

  |

  అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆడవారి కోసం ప్రత్యేకంగా అంకితమివ్వబడిన ఒక రోజు. ఆ రోజు అన్ని రంగాలకి చెందిన స్త్రీలు ఒకచోట చేరి స్త్రీత్వాన్ని పండగలా జరుపుకుంటారు. మగవారి ప్రకారం, ఆడవాళ్ళను అర్థం చేసుకోవటం చాలా కష్టం. మగవారు స్త్రీలను అస్సలు అర్థం చేసుకోలేమని అనుకుంటారు, అలాగే ఆడవాళ్ళు కూడా అదే అనుకుంటారు. మగవాళ్ళు స్త్రీలు తరచూ వారికేం కావాలో తెలుసుకోటంలో అయోమయపడతారని అనుకుంటారు. ఇలాంటి విషయాలు పురాతనకాలం నుండి అందరికీ తెలిసినవే.కానీ ఇక్కడ ఆడవారి గురించి కొన్ని హాస్యాస్పద విషయాలున్నాయి, తెలుసుకోండి.

  ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సమీపిస్తోంది కాబట్టి మేము ఆడవారి గురించి కొన్ని ఆసక్తికర హాస్యాస్పద విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాం. ఈ విషయాలను చాలామంది ముఖ్యంగా మగవారు నవ్వు తెప్పించేవి అనుకుంటారు. మేము ఎవరినీ కించపర్చాలనుకోవట్లేదు. అందుకని తోటి మహిళల్లారా, బాధపడవద్దు!!!

  funny facts women

  ఆడవారి గురించి హాస్యాస్పదమైన సంగతులు

  ఆడవారి గురించి హాస్యాస్పదమైన సంగతులుః మహిళా దినోత్సవ ప్రత్యేకం

  వారికి ఎప్పుడూ వేసుకోటానికి సరైన బట్టలు ఉండవుః వార్డ్ రోబ్ మొత్తం బట్టలతో నిండుగా వున్నా, ఆడవాళ్ళు బీరువా తెరచి 10 నిమిషాలన్నా ,"నేను ఏం వేసుకోవాలి" లేదా "నేను వేసుకోటానికి సరైన బట్టలే లేవు!" అని ఆలోచిస్తారు. మగవారి బీరువాలతో పోలిస్తే, ఆడవారికి ఎక్కువ బట్టలు ఉంటాయి కానీ ఎప్పుడూ ఏం వేసుకోవాలనో, అసలేం లేవనో అయోమయపడతారు!

  ఆడవాళ్ళు ఎప్పుడూ డైట్ నే పాటిస్తారుః

  ఇదొక హాస్యాస్పద సంగతి. ఆడవాళ్లని ఎప్పుడైనా ఏదన్నా తినమని అడగగానే, మీకు ఒకే జవాబు వస్తుంది, "నేను డైట్లో ఉన్నాను." అసలు సంగతి ఏంటంటే ఆమె వేయించిన ఆహారపదార్థాలు, నోరూరించే బర్గర్లు కూడా తింటుంది, కానీ డైట్లోనే ఉంటుంది.

  ఆడవాళ్ళు రహస్యాలను దాచలేరు;

  ఏం జరిగినా సరే, ఆడవాళ్ళు ఏ రహస్యాన్ని దాచలేరు. మీరు ఎవరికీ చెప్పొద్దని ఒక విషయం చెప్తే, వారికి మరింతగా దాన్ని పంచుకోవాలనిపిస్తుంది. అందుకే కావాలనో, లేదా పొరపాటునో చెప్పేస్తారు. అందుకని ఈ సంగతి చదివాక మీరు ఆమె రహస్యం దాచి వుంచుతుందనుకుని మాత్రం ఏం చెప్పవద్దు.

  "నేను ఎలా వున్నాను?" కి నిజాయితీగా జవాబే లేదు;

  మొదట ఆడవాళ్ళు రెడీ అవ్వటానికే చాలా సమయం తీసుకుంటారు, తర్వాత వచ్చి ఎప్పుడూ "నేనెలా ఉన్నాను?" అని తప్పక అడుగుతారు. మగవారికి దీనికి జవాబు ఏం చెప్పాలా అని అయోమయంలో పడతారు. బాలేదని చెప్తే మరింత లేటు అవుతుంది, అందుకని అబద్ధం చెప్పటం మంచిది. మరోవైపు ఆడవాళ్ళు తమ మనస్సులో ఏమనుకుంటారో అదే వినాలని ఆశపడతారు!

  ఆడవారికి షాపింగ్ చేయటానికి వంక కావాలంతే;

  భూమ్మీద ఏ స్త్రీకైనా ఫేవరెట్ హాబీలలో ఒకటి షాపింగ్. వారికి కొత్త బట్టలు, షూలు,నగలు వంటివి కొనుక్కోటానికి వంక కావాలంతే.

  గాసిప్స్ లేకుండా ఆడవారు బ్రతకలేరు;

  ఈ సంగతి అందరికీ తెలిసినదే! చాలామంది స్త్రీలు "నాకు గాసిప్స్ అంటే అసహ్యం" అని చెప్పినా, అది వారి సహజ స్వభావం,వదిలించుకుందామన్నా వదిలించుకోలేరు.

  ఒక నిమిషానికి మించి మౌనంగా ఉండలేరు; ఒక అమ్మాయిని ఒక నిమిషం కన్నా ఎక్కువగా మౌనంగా ఉంచగలిగారంతే మీకు నోబెల్ బహుమతిని ఇవ్వచ్చు!

  ఆడవారికి సెక్స్ కన్నా హత్తుకోవటం ఇష్టపడతారు;

  మగవారికి మనస్సులో సెక్స్ ఉంటే, ఆడవాళ్ళకి కౌగిలించుకుని పడుకోవాలనుంటుంది.

  ఇవే ఆడవాళ్ళ గురించి కొన్ని హాస్యాస్పద సంగతులు. మీకు ఇంకేమన్నా విషయాలు తెలుసా? మాతో ఈ మహిళా దినోత్సవం నాడు పంచుకుని ఈ రోజును మరింత ప్రత్యేకం చేయండి!

  English summary

  Funny Facts Women | Facts About Women | Womens Day

  International Women's Day is a special day dedicated to women. On this day, women from all walks of life come together to celebrate womanhood. According to men, it is very difficult to read a woman. Men feel that they can never understand women and vice versa. They feel that women are often confused on what they want. These facts about women might be known and repeated since ages. However, there are some funny facts about women that you must know.
  Story first published: Wednesday, March 7, 2018, 8:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more