For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్కడి అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండానే ఏళ్ల తరబడి సహజీవనం చేస్తారు

రాజస్థాన్ లోని గరాసియా అనే తెగలో చాలా మంది ఆడవారు స్వతంత్రంగా బతుకుతారు. వారికి నచ్చిన అబ్బాయితో పెళ్లి చేసుకోకుండానే కాపురం చేస్తారు. అక్కడి అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండానే ఏళ్ల తరబడి సహజీవనం చేస్తారు

|

లివ్ ఇన్ రిలేషన్ అనే దాని గురించి మనకు తెలుసు. బాగా డబ్బున్న వాళ్లు, సెలబ్రిటీలు ఇలా చేస్తుంటారని మనం అనుకుంటూ ఉంటాం. అయితే కొన్ని రకాల తెగలవారు, వెనుకబడిన జాతుల వారు కూడా సహజీవనంకొనసాగిస్తున్నారు.

గరాసియా తెగ ఆడవారు

గరాసియా తెగ ఆడవారు

రాజస్థాన్ లోని గరాసియా అనే తెగలో చాలా మంది ఆడవారు స్వతంత్రంగా బతుకుతారు. వారికి నచ్చిన అబ్బాయితో పెళ్లి చేసుకోకుండానే కాపురం చేస్తారు. వాస్తవానికి వివాహం విషయంలో మనదేశంలో అమ్మాయిలకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. కానీ గరాసియా తెగలో మాత్రం అమ్మాయిలకు చాలా హక్కులుంటాయి.

కట్నాలు అనే మాట ఉండదు

కట్నాలు అనే మాట ఉండదు

గరాసియా తెగలో ఈ సంప్రదాయం దాదాపు వెయ్యేళ్లకు పైగా కొనసాగుతుంది. రాజస్తాన్ కొన్ని ప్రాంతాల్లో ఈ గరాసియా తెగ వారు నివసిస్తున్నారు. ఈ తెగలో కట్నాలు అనే మాట ఉండదు. అంతేకాదు గరాసియా తెగ అమ్మాయిలు పెళ్లి ఈడుకి రాగానే తమకు నచ్చిన అబ్బాయితో లివ్ రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారు.

నెలనెలా కొంత డబ్బు చెల్లిస్తూ

నెలనెలా కొంత డబ్బు చెల్లిస్తూ

పెళ్లి చేసుకోకుండా సహజీవనం మొదలుపెట్టి పిల్లల్ని కంటారు. అయితే అబ్బాయి ఏ అమ్మాయితో అయితే సహజీవనం చేస్తుంటాడో ఆ అమ్మాయికి నెలనెలా కొంత డబ్బు చెల్లిస్తూ ఉండాలి. ఒక అమ్మాయితో సహజీవనం చేసే అబ్బాయి మరో ఏ అమ్మాయితో కూడా సహజీవనం చెయ్యకూడదు.

వారిద్దరే సహజీవనంలో ఉంటారు

వారిద్దరే సహజీవనంలో ఉంటారు

అలా జీవితాంతం వారిద్దరే సహజీవనంలో ఉంటారు. పిల్లలు పుట్టినా మనవళ్లు పుట్టినా కూడా వారిద్దరి లివ్ ఇన్ రిలేషన్ షిప్ కొనసాగుతుంది. అలా దాదాపు 60 ఏళ్ల పాటు సహజీవనం చేశాకా ముసలితనంలో ఆ జంట పెళ్లి చేసుకుంటుంది. ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకం వల్ల ఇలాంటి బంధాలు చాలా బలంగా ఉంటున్నాయి.

అరవై, డెబ్బై ఏళ్లప్పుడు పెళ్లిళ్లు

అరవై, డెబ్బై ఏళ్లప్పుడు పెళ్లిళ్లు

గరసియా అనే తెగకు చెందిన వారు ఎక్కువగా రాజస్తాన్ లోని పాలీ, ఉదయ్ పూర్ తో పాటు సిరొహి ప్రాంతాల్లో ఉన్నారు. నానియ గరసియా అనే వ్యక్తి చాలా సంత్సరాల పాటు కాళి అనే ఆమెతో సహజీవనం చేసి పెళ్లి చేసుకున్నాడు. నానియకు 70 సంవత్సరాల వయస్సు ఉంటే కాళికి 60 ఏళ్లు ఉన్నాయి. వారిద్దరూ ఈ వయస్సులో పెళ్లి చేసుకున్నారు. ఇది మనకు కాస్త ఆశ్చర్యంగా ఉన్నా గరసియా తెగలో ఇది కామన్.

 అమ్మాయికి అయ్యే ఖర్చులను మొత్తం

అమ్మాయికి అయ్యే ఖర్చులను మొత్తం

వీరిద్దరికీ ముగ్గురు కొడుకులున్నారు. ఆ ముగ్గురు కూడా మరో ముగ్గురు అమ్మాయిలతో సహజీవనం చేస్తున్నారు. వారికి కూడా పిల్లలున్నారు. ఈ తెగలో ఈ సంప్రదాయం తరతరాలుగా వస్తోంది. ఇద్దరూ కలిసి సహజీవనం ప్రారంభించే ముందు అమ్మాయికి అయ్యే ఖర్చులను మొత్తం కూడా తానే భరిస్తానని అబ్బాయి ఒప్పుకుంటాడు.

సిన్సియర్ లివ్ ఇన్ రిలేషన్ షిప్

సిన్సియర్ లివ్ ఇన్ రిలేషన్ షిప్

ముందుగానే కొంత డబ్బు చెల్లిస్తాడు. మొత్తానికి వీరి మధ్య సాగే లివ్ ఇన్ రిలేషన్ షిప్ చాలా సిన్సియర్ ఉంటుందని అర్థం చేసుకోవొచ్చు. బయట జనాల మాదిరిగా ఏడాదొకరితో వీరు లివ్ ఇన్ రిలేషన్ షిప్ కొనసాగించరు.

English summary

garasia tribe in rajasthan has allowed live in relationships outside wedlock

garasia tribe in rajasthan has allowed live in relationships outside wedlock
Story first published:Thursday, August 2, 2018, 14:05 [IST]
Desktop Bottom Promotion