Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
100 మంది పురుషుల వివాహ జీవితాన్ని ఈవిడ ఇలా నిలబెట్టింది
100 మంది పురుషుల వివాహ జీవితాన్ని ఈవిడ ఇలా నిలబెట్టింది
నైతిక విలువలకు కట్టుబడి డబ్బును సంపాదించడం అంటే ఈకాలంలో కాస్త అరుదైన విషయమనే చెప్పాలి. డబ్బు సంపాదించే క్రమంలో భాగంగా ఎటువంటి అనైతిక చర్యలకైనా సిద్దపడేలా తయారవుతున్న వారే సమాజంలో ఎక్కువగా కనిపిస్తుంటారు. అత్యంత శోచనీయమైన విషయం.
ఇక్కడ మేము చెప్పబోతున్న కథనంలో తనకు తానే నిర్దేశించుకున్న వృత్తిలో భాగంగా 100 మంది పెళ్లైనవారితో డబ్బుకోసం నిద్రించిన ఒక యువతి కథ. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా, ఈవిడ ఆలోచన వింటే మీరు ఆశ్చర్యానికి గురికాక మానరు.
ఆమె ఖాతాదారుల భార్యలలో సగానికి పైగా వారి వ్యవహారం గురించి తెలుసు మరియు ఆమె "వ్యాపారo" కారణంగా చాలా వివాహ భాంధవ్యాలు కూడా నిలబడ్డాయని ఆమె చెప్పింది!

డబ్బు సంపాదించుటలో భాగంగా ఇలాంటి పిచ్చి మార్గాన్ని ఎంచుకున్న ఈ మహిళ గురించిన వివరాలు మీకోసం..
ఆమె ఒక సంపన్న కుటుంబానికి చెందిన భర్త చనిపోయిన మహిళ:
గ్వెనెత్ - లీ గత 10ఏళ్లలో 100కు పైగా వివాహితులైన మగవారితో అక్రమ వ్యవహారాలను కలిగి ఉన్న, సంపన్న కుటుంబానికి చెందిన వితంతు మహిళ. కొందరి వివాహ జీవితాన్ని కాపాడుటలో భాగంగా మోసం చేయడం కూడా మంచిదే అని వాదిస్తుంది. ఈవిడ చెప్పే ఒకే ఒక్క మాట " వీరి జీవితాలకు నేను మాత్రమే సంపూర్ణ పరిష్కారం." అని.
వారి భార్యలకు తన గురించి కూడా పూర్తిగా తెలుసు అని చెప్పింది :
గ్వెనెత్ లీ, 47 సంవత్సరాల వయసున్న మహిళ మరియు ఒక ఆర్థిక సలహాదారు (ఫైనాన్షియల్ కన్సల్టెంట్). వివాహితులైన ఈ పురుషుల భార్యలలో సగానికి సగం మందికి తన గురించి, తన వ్యవహారాల గురించి మొత్తం తెలుసని ఆమె చెప్పింది. అయినా కూడా వారు తెలిసీ తెలీనట్లు వ్యవహరిస్తున్నారని, దీనికి కారణం తమ వలన దొరకని ఆనందం, ఇలా అయినా తమ భర్తలు పొందగలుగుతున్నారని వారు సంతృప్తి చెందుతున్నారని తెలిపింది. మహిళలు లైంగిక చర్యలకు సిద్దపడక పోవడానికి అనేక కారణాలు ఉంటాయి, ఆ ప్రభావం తమ భర్తల మీద ఉండకూడదు, వారు సంతోషంగా ఉండాలి అన్న ఆలోచన అనేకమంది మహిళలది. కేవలం ఆ కారణం చేతనే, వారు తెలిసినా తెలియనట్లే వ్యవహరిస్తుంటారు. అని తెలిపింది.
తరువాత జరగబోయే పరిణామాల గురించి వారిని హెచ్చరిస్తుంది కూడా:
పురుషులు పర్యవసానాల గురించి తెలిసినా వారు ఆమెతో సంబంధం కలిగి ఉండుటకే సుముఖతను చూపుతుంటారు. కానీ తాను వీటిని అవకాశంగా తీసుకోబోననీ, వారి వివాహ జీవితం తన వలన నాశనం అవడం తనకు ఇష్టం లేదని అంటుంది., ఎందుకంటే ఈ వ్యవహారం జంటగా పర్యవసానంగా అంగీకరిస్తున్న తర్వాతనే తానూ చర్యలకు ఉపక్రమిస్తానని, తన దగ్గరకు వచ్చే వ్యక్తులు ఒక ఉమ్మడి అంగీకారం మీదనే ఉంటారని, కావున ఎటువంటి సమస్యలు రావని, పైగా భార్యా భర్తల మద్య కూడా మానసిక ఒప్పందం ఉన్న కారణాన, ప్రతికూల ప్రభావాలు తలెత్తవని తెలిపింది.
తన దగ్గరకు వచ్చే క్లైంట్ల పరిస్థితి :
పెళ్ళయి 15 ఏళ్ళు పైబడి ఉన్న వారిని, అది కూడా లైంగిక సుఖం లేని వ్యక్తులను మాత్రమే తాను క్లయింట్లుగా స్వీకరిస్తానని పేర్కొంది. ఈ పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉండటం ద్వారా, వారి వివాహిత జీవితాన్ని రక్షించడంలో ఆమె సహాయపడగలదని పేర్కొంది.
ఆమె లగ్జరీ లైఫ్!
గ్వెనెత్ లీ ఆమె విలాసాల గురించి మరియు ఆమె ఈ తరహా వ్యవహారాలతో ఆనందిస్తున్న ప్రోత్సాహకాల గురించి ఇలా చెప్తుంది : ఆమెకు £ 100,000-విలువ కంటే ఎక్కువ లగ్జరీ సెలవులు ఉన్నాయని, తన లగ్జరీ విషయాలను క్లయింట్లే చూసుకుంటారని, ఒక్కోసారి నగలు, డైమండ్లు కూడా కొనిస్తారని. వీరిలో ఒక స్టాక్ బ్రోకర్, ఒక నగల వ్యాపారి, ఒక టెక్నాలజీ ఫర్మ్ బాస్ ఇలా అనేకులు తన ప్రముఖ క్లయింట్లగా ఉన్నారని చెప్తుంది.
ఆమెకు ఎటువంటి విచారం లేదు!
ఇలాంటి వ్యవహారాలు నడుపుతూ, అనేక మంది పెళ్ళైన పురుషులతో సంబంధాలు ఉన్నా, నాకెటువంటి భాద, విచారం లేదు. వారు సంతోషం కోసం వస్తారు, నేను సంతోషాన్ని ఇచ్చి పంపిస్తాను. నా కారణంగా వారి కుటుంబంలో ఎటువంటి కలతలు లేకుండా చూస్తాను. తద్వారా వారి మిగిలిన జీవితం కూడా సంతోషంగా, ఆరోగ్యంగా గడపగలరు. నేనెందుకు భాధపడాలి అంటుంది.
ఇది నైతికంగా సరైనదే అని భావిస్తున్నారా? అయితే మీ వ్యాఖ్యలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.



Click it and Unblock the Notifications