ఒక హెయిర్ డ్రెసెర్ కావాలని పురుషులకు ఎయిడ్స్ సోకేలా చేస్తున్నాడని తెలుసా?

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఏంటి వినగానే గుండెలో తుపాకీ పేలినట్లుందా? ప్రేమలో పడడం అనేది ఒకప్పుడు అత్యంత క్లిష్టమైన అంశం, కొందరికి ప్రేమను దక్కించుకోడానికి జీవితకాలం కూడా సరిపోయేది కాదు. కానీ ఇప్పుడు అనేకులకి “వన్ నైట్ స్టాండ్” అంశం గా మారిపోయింది. ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలీదు, ప్రేమ చిగురించింది అనేలోపే చీలికలు పాలికలైపోయి ఉంటుంది కూడా. ఇలాంటివి చూస్తుంటే ఎంతటి తీవ్ర పరిణామాలకు సంబంధాలు దారితీస్తున్నాయో అన్న అనుమానం కలగక మానదు.

ఒక్కసారి గుర్తుంచుకోండి, మీరు ప్రేమించిన వ్యక్తి అన్నిటా సరైనా వ్యక్తేనా అన్న గారెంటీ మీకుoడాలి, లేకుంటే ఎంత ప్రేమించినా ఏదో ఒక చోట స్తబ్ధత నెలకొనడం, తద్వారా సంబంధాలపై ప్రభావాలు చూపడం పరిపాటిగా మారుతాయి. కొందరు ప్రేమల సంగతి ఏమో కానీ, అలాంటి భావనలకోసం వ్యభిచారం లేదా, డేటింగ్ సైట్లను ఆశ్రయిస్తున్నారు కూడా.

ఇప్పుడు చెప్పబోయే కథ ఒక పురుషునికి చెందినది. ఇప్పటికి అతను 10మందికి ఎయిడ్స్ సోకేలా చేశాడు, అది కూడా పగతో చేశాడు అంటే భయంగొల్పక మానదు.

అతను ఎవరంటే :

అతను ఎవరంటే :

ఇతని పేరు డారిల్ రోయే, 26, వృత్తిపరంగా ఒక హెయిర్ డ్రెసర్(కేశాలంకరణ). అతను ఉద్దేశపూర్వకంగా 10మందికి ఎయిడ్స్ సోకేలా చేశాడని అభియోగం. ఇతనికి ఎయిడ్స్ నిర్ధారణ అయినప్పటికీ, ఇతను మందులు కూడా తీసుకోలేదు.

అతను మందులు తీసుకోవాలనుకోలేదు :

అతను మందులు తీసుకోవాలనుకోలేదు :

డారిల్ వైద్యులు సూచించిన మందులను తీసుకోవడానికి నిరాకరించాడు, అందువల్ల ఈ పరిస్థితిని స్వస్థపరిచే ప్రత్యామ్నాయ ఉపాయాల కోసం ఆన్లైన్లో శోధించాడు.

అతను ప్రత్యామ్నాయ చికిత్సకు పూనుకున్నాడు :

అతను ప్రత్యామ్నాయ చికిత్సకు పూనుకున్నాడు :

దైనందిక చర్యలలో భాగంగా తన మూత్రం తానే సేవించడం కారణంగా ఎయిడ్స్ నుండి బయటపడవచ్చని నమ్మాడు. మరియు వైద్యులు సూచించిన మందులను పూర్తిగా పక్కన పెట్టేశాడు. అతను ఆపిల్ సిడార్ వెనిగర్ మరియు ఆలివ్ ఆకు సారంతో తన జననేంద్రియ వార్ట్స్(మొటిమ వంటిది) మరియు హేర్ప్స్ కు కూడా చికిత్స చేస్కునేవాడు.

గే–డేటింగ్ మనుషులు పరిచయమయ్యారు :

గే–డేటింగ్ మనుషులు పరిచయమయ్యారు :

ఎయిడ్స్ అంతటా వ్యాప్తి చెందడానికి, డారిల్ ఒక డేటింగ్ సైట్ ద్వారా పురుషులను లక్ష్యంగా పెట్టుకొని, వారితో అసురక్షిత లైంగిక సంబంధం ఏర్పరచుకునేవాడు, ఇతని కడకు వచ్చే పురుషులకు తనను తాను క్లీన్ అన్నట్లుగా నమ్మబలికేవాడు. మోసపోయిన వారు ఎయిడ్స్ బారిన పడేవారు.

పైశాచిక ఆనందం :

పైశాచిక ఆనందం :

డారిల్ తనకు సైట్ ద్వారా పరిచయమైన వారితో లైంగిక సంబంధాన్ని కలిగిన తర్వాత, వారికి కొన్ని టెక్స్ట్ మెసేజెస్ పంపేవాడు. అవి ప్రధానంగా: "మీకు జ్వరం ఉంటుంది...,నాకు ఎయిడ్స్ ఉంది అంతే తేడా, ఊప్స్. మరొక టెక్స్ట్ మెసేజ్లో ఇలా వ్రాసాడు: "నేను కండోమ్ తొలగించాను, నువ్వు దొరికావ్." అని. ఉద్దేశ పూర్వకంగా వైరస్ ఎక్కించడమే కాకుండా, వారి జీవితాలతో సైతం ఆడుకుని పైశాచిక ఆనందాన్ని ప్రదర్శించిన ఇతని చర్యలకు నిశ్చేష్టులవడం జనాలవంతైంది.

ఉద్దేశపూర్వకంగానే కండోం తొలగించాడు :

ఉద్దేశపూర్వకంగానే కండోం తొలగించాడు :

నిజానికి గే సెక్స్ కై ఇతని కడకు వచ్చిన వారందరూ, కండోం వినియోగించాలని ఖచ్చితంగా సూచించేవారు. కానీ ఇతను కండోంకి చిల్లి పెట్టడం, వారికి తెలీకుండా కండోం తొలగించడం వంటి చర్యలకు పూనుకునేవాడు. తద్వారా వీరు ఎయిడ్స్ బారిన పడేలా చేయగలిగాడు.

తనకు ఎయిడ్స్ తగ్గిందని నమ్మాడు :

తనకు ఎయిడ్స్ తగ్గిందని నమ్మాడు :

పోలీసులకు పట్టుబడిన తరుణంలో, తాను అవలంబిస్తున్న ప్రత్యామ్నాయ మూత్ర చికిత్స ద్వారా తనకు ఎయిడ్స్ నయమైందని, తనకు ఇప్పుడు పూర్తిగా ఎయిడ్స్ లేదని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇలాంటివి ఎవరు నమ్ముతారు చెప్పండి.

ప్రస్తుతం, అతడు అరెస్ట్ అయ్యాడు :

ప్రస్తుతం, అతడు అరెస్ట్ అయ్యాడు :

అతని వలన, వ్యాధి సంక్రమణకు గురైన వారు ముందుకొచ్చి చేసిన ఫిర్యాదుమేరకు పోలీసులు ఇతనిని అరెస్ట్ చేశారు.

ఈ వ్యాసం ప్రకారం మేము చెప్పదలచుకుంది ఏంటంటే, అనాలోచితంగా డేటింగ్ సైట్ల వైపు, లేదా వ్యభిచారాల వైపుకు వెళ్ళడం కారణంగా తెలీకుండానే ఇలాంటి రోగాల బారిన పడి జీవితాలు దుర్భరమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు బండి సరిగ్గా నడిపే వారే అయ్యుండొచ్చు, కానీ అవతలి వాడు కూడా సరిగ్గా ఉండాలి, లేని పక్షాన యాక్సిడెంట్లు అవుతాయి. అవతలి మనిషి తాగి ఉండొచ్చు, మానసికరోగై ఉండచ్చు, ఆ బండి బ్రేక్స్ ఫెయిల్ అయి ఉండొచ్చు. ఏది ఏమైనా చివరికి నాశనమయ్యేది ఎవరి జీవితం ? అదేవిధంగా తెలియని వారితో సంబధాలు మీ జీవితాన్ని తునాతునకలు చేస్తాయని వేరే చెప్పనవసరం లేదు. కావున ఇలాంటివాటికి దూరంగా ఉండడమే మేలు. కోరి ప్రమాదాలు తెచ్చుకోవడం ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి.

ఈ వ్యాసం గురించిన మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలుపండి.

English summary

Hairdresser Who Infected Men With HIV

Daryll Rowe, 26, is alleged to have deliberately infected 10 men with HIV. He is a hairdresser by profession. Apparently, he believed that drinking his own urine helped him to treat the virus and thus avoided taking prescription drugs. He had also been treating his own genital warts and herpes with apple cider vinegar and olive leaf extract.
Story first published: Wednesday, May 16, 2018, 12:00 [IST]