Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఉడత వేధిస్తోందని పోలీసుస్టేషన్ కు వెళ్లాడో వ్యక్తి, ఉడతను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఎక్కడైనా మనిషి వెంట కుక్కలు వెంట పడడం చూసి ఉంటాం. ఇంకా ఏదైనా క్రూర జంతువు వెంటపడడం చూసి ఉంటాం. కానీ ఒక ఉడుత ఒక మనిషిని వెంటాడడం అనేది చాలా రేర్. ఉడత వేధిస్తోందని పోలీసుస్టేషన్ కు వెళ్లాడో వ్యక్తి
ఎక్కడైనా మనిషి వెంట కుక్కలు వెంట పడడం చూసి ఉంటాం. ఇంకా ఏదైనా క్రూర జంతువు వెంటపడడం చూసి ఉంటాం. కానీ ఒక ఉడుత ఒక మనిషిని వెంటాడడం అనేది చాలా రేర్. ఒక చిన్న ఉడుత మనిషి వెంట పడి అతన్ని చాలా రకాలుగా ఇబ్బందులుపెట్టింది.

వీధుల వెంట పరుగులు పెట్టించింది
అతన్ని వీధుల వెంట పరుగులు పెట్టించింది. దీంతో అతను హడలిపోయాడు. ఏం చేయాలో తెలియక తికమకపడ్డాడు. తనను ఆ ఉడుత ఏం చేస్తుందో అనే భయంతో నేరుగా పోలీస్ లకు ఫోన్ చేశాడు.

ఈ స్టోరీ విని ఆశ్చర్యపోయారు
తనను ఉడత వేధింపుల నుంచి రక్షించమని కోరాడు. పోలీసులు మొదట ఈ స్టోరీ విని ఆశ్చర్యపోయారు. తర్వాత అతను చెప్పేది నిజమని తెలిసి ఆ ఉడుత ఎక్కడుందో తమకు అడ్రస్ చెప్పమని అడిగారు. దీంతో పోలీసులను అడ్రస్ చెప్పాడు ఆ వ్యక్తి.

పుట్టి కొన్ని రోజులే అవుతుంది
సౌత్ వెస్ట్రన్ జర్మనీలోని కర్ల్ స్రుహే నగరంలో ఇది జరిగింది. చివరకు పోలీసులు ఆ ఉడుతను పట్టుకున్నారు. అయితే అది చిన్న ఉడుత పిల్ల. అది పుట్టి కూడా కొన్ని రోజులే అవుతుంది. ఇక వెంటాడి వెంటాడి అలసిన ఉడుత పిల్ల నిద్రపోతూ కనిపించింది పోలీసులకు.
తన తల్లిగా భావించి వెంటపడి ఉండవచ్చు
తర్వాత పోలీసులు ఆ బుల్లి ఉడతను జంతు సంరక్షక అధికారులకు ఇచ్చారు. అయితే అది పుట్టి కొన్ని రోజులే కావడం వల్ల ఆ వ్యక్తిని చూసి తన తల్లిగా భావించి వెంటపడి ఉండవచ్చని జంతు సంరక్షణ అధికారులు తెలిపారు. బాగా ఆకలితో ఉన్న ఆ ఉడుతకు ఆహారం అందించారు.



Click it and Unblock the Notifications