For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ స్టార్‌ హోటళ్లలో హై ప్రొఫైల్ వ్యభిచారం, హీరోయిన్లతోనే చేయిస్తున్నారు, పట్టుబడ్డ హీరోయిన్లు

హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 5లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో ముంబైకి చెందిన భోజ్‌పురి నటితో జానీ వ్యభిచారం చేయిస్తున్నాడని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది.

|

హైదరాబాద్ లోని స్టార్‌ హోటళ్లలో వ్యభిచార దందా నడుస్తోంది. కొందరు నటీమణులను ట్రాప్‌ చేసి ఈ దందా సాగిస్తున్నారు. జనార్దన్‌రావు అలియాస్‌ జానీ ఈ దందా నిర్వహిస్తున్నారు. జనార్దన్ రావు ధనవంతులనే టార్గెట్‌ చేస్తాడు. ఇతనిది తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం. అసలు పేరు అంబుల జనార్దన్‌రావు. అయితే అందరూ జానీ అంటుంటారు.

స్టార్‌ హోటళ్లలో బస

స్టార్‌ హోటళ్లలో బస

అంబుల జనార్దన్‌రావు అందమైన సినీ తారలను ముంబై నుంచి రప్పిస్తాడు. స్టార్‌ హోటళ్లలో బస ఏర్పాటు చేస్తాడు. రోజుకు రూ.20వేల నుంచి రూ.50వేలు తీసుకొని నటీమణులతో వ్యభిచారం చేయిస్తాడు. ఈ దందాను ఇతను చాలా రోజులుగా కొనసాగిస్తున్నా తాజాగా పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే గతంలో కూడా ఒక హీరోయిన్ ఇలా వ్యభిచారం చేస్తూ పట్టుబడింది.

రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో భోజ్‌పురి నటితో

రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో భోజ్‌పురి నటితో

హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 5లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో ముంబైకి చెందిన భోజ్‌పురి నటితో జానీ వ్యభిచారం చేయిస్తున్నాడని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఆ హోటల్‌పై దాడి చేసిన పోలీసులు సినీ నటితో పాటు, జనార్దన్‌రావు, విటుడిని అదుపులోకి తీసుకున్నారు.

దీక్షా కుష్వాహాను రప్పించాడు

దీక్షా కుష్వాహాను రప్పించాడు

జనార్దన్‌రావు గత కొన్నేళ్లుగా.. ముంబై నుంచి సినీ నటీమణులను తీసుకువచ్చి ఖరీదైన హోటళ్లలో వ్యభిచారం చేయిస్తున్నాడు. తాజాగా ముంబై నుంచి భోజ్ పురికి చెందిన నటి దీక్షా కుష్వాహా(24)ను ఇక్కడికి రప్పించినట్లు తెలిసింది. ఆమె స్వస్థలం ఆగ్రా.

స్టార్‌ హోటళ్లలో దందా

స్టార్‌ హోటళ్లలో దందా

అలాగే గతేడాది డిసెంబర్‌లోనూ నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం బంజారాహిల్స్, పంజాగుట్ట పరిధుల్లో రెండు స్టార్‌ హోటళ్లపై ఏక కాలంలో దాడులు చేసింది. ఇద్దరు పాత్రధారుల్ని అరెస్టు చేసి తెలుగు సినీ, బెంగాలీ టీవీ రంగాలకు చెందిన ఇద్దరు నటీమణుల్ని రెస్క్యూ చేసింది. ఈ కేసులోనూ జానీ వాంటెడ్‌గా ఉన్నాడు. సినీ అవకాశాల పేరుతో వర్ధమాన తారలను ట్రాప్‌ చేసే జానీ... వారి ఫొటోలను వాట్సప్‌లో విటులకు షేర్‌ చేసి, స్టార్‌ హోటళ్లలో దందా నడిపించేవాడు.

2010 నుంచి స్టార్‌ హోటల్స్‌ లో దందా

2010 నుంచి స్టార్‌ హోటల్స్‌ లో దందా

జానీ సిటీలోని పద్మారావునగర్‌లో స్థిరపడ్డాడు. 2010 నుంచి స్టార్‌ హోటల్స్‌ అడ్డాగా నటీమణులతో వ్యభిచార దందా చేస్తూ మూడుసార్లు పోలీసులకు చిక్కాడు. ఇతడిపై బంజారాహిల్స్, పంజగుట్ట, చందానగర్‌ తదితర ఠాణాల్లోనూ కేసులు ఉన్నాయి. మరికొన్ని కేసుల్లోనూ మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన డి.వెంకట్‌రావు, మోనిష్‌లను సహాయకుడిగా ఏర్పాటు చేసుకొని స్టార్‌ హోటల్స్‌ కేంద్రంగా వ్యభిచార దందాలు నిర్వహించాడు.

వర్ధమాన హీరోయిన్లతో పాటు టీవీ ఆర్టిస్టులనూ రప్పిస్తాడు

వర్ధమాన హీరోయిన్లతో పాటు టీవీ ఆర్టిస్టులనూ రప్పిస్తాడు

డిసెంబర్‌లో మిగిలిన ఇద్దరూ దొరికినా జానీ మాత్రం చిక్కలేదు. తెలుగు, హిందీ, భోజ్‌పురి, బెంగాలీ సినీ రంగానికి చెందిన వర్ధమాన హీరోయిన్లతో పాటు కొందరు టీవీ ఆర్టిస్టులనూ ముంబై, కోల్‌కతాల నుంచి రప్పిస్తుంటాడు. సినిమాల్లో అవకాశాల పేరుతో ఇక్కడకు తీసుకొచ్చిన తర్వాత వారిని వ్యభిచార ఊబిలోకి దింపి తన సహాయకులతో కథ నడిపిస్తుంటాడు.

40–50 వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు

40–50 వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు

జానీతో పాటు అతడి అనుచరులు సైతం ఎవరికి వారుగా ‘కస్టమర్ల'తో కూడిన 40-50 వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైనా సినీ, టీవీ నటిని ఉచ్చులోకి దింపిన వెంటనే వారి ఫొటోలను వాట్సప్‌లో కస్టమర్లకు షేర్‌ చేస్తుంటారు. వారు చూపించిన ఆసక్తి మేరకు ఆయా బాధితురాళ్లను విమానాల్లో తరలిస్తుంటారు. అప్పటికే స్టార్‌ హోటళ్లలో రూమ్స్‌ సిద్ధం చేసే ఈ నిర్వాహకుడు, వాటి లాబీల్లో ఎదురు చూస్తుంటాడు.

డబ్బు తీసుకున్నాకే..

డబ్బు తీసుకున్నాకే..

కస్టమర్‌ వచ్చిన తర్వాత లాబీల్లోనే నగదు లావాదేవీలు పూర్తి చేస్తారు. అప్పటికే అమ్మాయిలను ఆయా గదుల్లో సిద్ధంగా ఉంచుతారు. డబ్బు తీసుకున్న వెంటనే కస్టమర్లకు వారు వెళ్లాల్సిన హోటల్‌లో ఫ్లోర్, గది నెంబర్‌ చెప్పి యాక్సెస్‌ కార్డిచ్చి పంపిస్తుంటారు. స్టార్‌ హోటల్స్‌లోకి పోలీసులు సహా ఎవరూ తేలిగ్గా ప్రవేశించే అవకాశం లేకపోవడంతో వాటినే అడ్డాలుగా చేసుకున్నారు. సాధారణంగా వీకెండ్స్‌లోనే వీరి దందాలు జోరుగా సాగుతుంటాయి.

శిక్షణ నిమిత్తం సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్‌కు

శిక్షణ నిమిత్తం సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్‌కు

ఇక విటుడు అమిత్‌ మహేంద్ర శర్మ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌. హర్యానాలోని గుర్గావ్‌కు చెందిన శర్మ ప్రస్తుతం అసోం కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్నారు. శిక్షణ నిమిత్తం సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్‌కు వచ్చారు. అయితే ముంబైకి చెందిన ఇతడి స్నేహితుడు సంతోష్‌ ద్వారా జనార్దన్‌ అనుచరుడు శ్రీరామ్‌ పరిచయం అయ్యాడు. అతడి ద్వారా జనార్దన్‌ నంబర్‌ తీసుకున్నాడు అమిత్. చివరకు పోలీసులకు చిక్కాడు.

గతంలోనూ

గతంలోనూ

ఇక హైదరాబాద్‌లో డిసెంబర్ ఒక హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్ రోడ్ నెం.1 లోని తాజ్ దక్కన్ స్టార్ హోటల్‌లో పోలీసులు దాడులు జరపగా జూన్‌ 1:43 సినిమా ఫేం రిచా సక్సేనా పట్టుబడింది. రిచా ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి ఈ దందా నిర్వహించింది.

పోలీసులే విటుల రూపంలో వెళ్లారు

పోలీసులే విటుల రూపంలో వెళ్లారు

ఈ వ్యవహారంపై నిఘా పెట్టిన నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు విటుల రూపంలో వెళ్లి సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. ఈ వ్యభిచార వ్యవహారంమంతా ఆన్‌లైన్‌ లోనే సాగేది. అప్పట్లో ఈ దాడుల్లో నటి రిచాతో పాటు, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మౌనిక కడాకియా, హోటల్ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary

High Profile Prostitution Racket Busted in Hyderabad, 24-year-old Actress Rescued

High Profile Prostitution Racket Busted in Hyderabad, 24-year-old Actress Rescued
Desktop Bottom Promotion