For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ చిన్నారి వయస్సు మూడేళ్లు, కానీ చాలా తెలివైనది, చనిపోయే తన నాన్నను బతికించింది

మోలి తల్లి డివోన్ వర్క్ చేసుకుంటూ ఉండగా ఆమెకు తన భర్త ఫోన్ నుంచి ఒక ఫేస్ టైమ్ కాల్ వచ్చింది. ఇక చిన్నారి మోలి అమ్మను చూసి బోరును ఏడ్చింది. నాన్న లేవట్లేదు అంటూ తండ్రిని చూపిస్తూ గట్టిగా ఏడ్చింది.

|

ఆ చిన్నారి వయస్సు మూడేళ్లే అయినా ఆమె ఆలోచనమాత్రం అమోఘం. ఆ వయస్సు పిల్లలకు ఏమీ తెలియదు. ఆడుకోవడం, ఏడవడం తప్ప వారికి మరో ప్రపంచం అంటూ ఏమీ ఉండదు. కానీ ఈ చిన్నారి మాత్రం చాలా తెలివైనది.

తండ్రి ప్రాణాల్నే కాపాడి అందరి మన్ననలు పొందుతోంది. వారిది యూఎస్ వర్జినియాలోని వించెస్టర్. ఆ చిన్నారి పేరు మోలీ మెక్కేబే. వయస్సు మూడేళ్లు. ఆ రోజు మోలీ తన చెల్లి, తన తండ్రి ట్రివోర్ మాక్స్ బే తో కలిసి ఇంట్లో ఆడుకుంటూ ఉంది.

సడెన్ గా ట్రివోర్ కిందపడిపోయాడు

మోలి తల్లి డివోన్ మాక్స్ బే వించెస్టర్ మెడికల్ సెంటర్ లో నర్స్ గా పని చేస్తుంది. దీంతో ఆమె ఉదయమే జాబ్ కు వెళ్లిపోయింది. ఆ తండ్రి తన ఇద్దరు కూతుర్లతో సరదాగా ఆడుకుంటూ గడిపాడు. ఇంతలో సడెన్ గా ట్రివోర్ కిందపడిపోయాడు. అయితే తన తండ్రి ఏదో తనతో గేమ్ ఆడుతున్నాడని ఆ చిన్నారి అనుకుంది.

లే నాన్నా

తండ్రి ఎంతకూ లేవకపోవడంతో ఆ చిన్నారికి భయం వేసింది. లే నాన్నా అని అన్నా కూడా తండ్రి లేవలేదు. ఎంత గట్టిగా ఏడ్చినా కూడా తండ్రి మాత్రం లేవలేదు. తన తండ్రికి ఏదో అయ్యిందని ఆ చిన్నారి భావించింది. వెంటనే తండ్రి ఫోన్ తీసుకుని తన తల్లికి వీడియో కాల్ చేసింది.

నాన్న లేవట్లేదు అంటూ ఏడ్చింది

మోలి తల్లి డివోన్ వర్క్ చేసుకుంటూ ఉండగా ఆమెకు తన భర్త ఫోన్ నుంచి ఒక ఫేస్ టైమ్ కాల్ వచ్చింది. ఇక చిన్నారి మోలి అమ్మను చూసి బోరును ఏడ్చింది. నాన్న లేవట్లేదు అంటూ తండ్రిని చూపిస్తూ గట్టిగా ఏడ్చింది. డివోన్ జరిగిన విషయాన్ని గుర్తించి వెంటనే 911కి ఫోన్ చేసింది. తర్వాత తన పక్కింటి వారికి ఫోన్ చేసి వెంటనే అతన్ని తను పని చేసే హాస్పిటల్ కు తీసుకొచ్చేలా చేసింది. కొన్ని పరీక్షలు చేసిన తర్వాత అతనికి బ్రెయిన్, హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చింది.

గుండెకు ఒక చిన్న రంధ్రం

అయితే ట్రివోర్ గుండెకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నాడని డాక్టర్లు తెలిపారు. చిన్నప్పుడు ఆయన గుండెకు ఒక చిన్న రంధ్రంకావడం, అది క్రమంగా పెరగడంతో దాని ప్రభావం మెదడుపై పడింది. అయితే డాక్టర్లు వెంటనే చికిత్స అందించి ట్రివోర్ ప్రాణాలను కాపాడారు.

మోలి వల్ల తండ్రి మళ్లీ ప్రాణం పోసుకున్నాడు

కాస్త లేటు అయ్యి ఉంటే అతన్ని ప్రాణాలకే ప్రమాదం ఉండేది. మోలి వల్ల అలా ఆమె తండ్రి మళ్లీ ప్రాణం పోసుకున్నాడు. అయితే మోలికి వీడియో కాల్ ఎలా చేయాలో తన తల్లే నేర్పింది. మోలి రెగ్యులర్ గా తన గ్రాండ్ పేరేంట్స్ తో వీడియో కాల్ లో మాట్లాడుతుంది. అదే ఆ చిన్నారి తండ్రిని కాపాడేలా చేసింది.

English summary

how a 3 year old molly mccabe saved her dads life by facetiming her mom

how a 3 year old molly mccabe saved her dads life by facetiming her mom
Desktop Bottom Promotion