For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పడక గదిలో అద్దం ఉండొచ్చా? లైంగిక కార్యక‌ల‌పాలు జ‌రిగే గ‌దిలో దేవుడి ఫోటో పెట్టొచ్చా? డబుల్ కాట్ ఉంటే

ఫెంగ్‌షుయ్ ప్రకారం పడకగదిలో అద్దాలను ఉంచకూడదు. అలా ఉంచితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట.బెడ్రూమ్ వాస్తు, పడక గది వాస్తు, ఇంటి వాస్తు.వాస్తుశాస్త్రం, ఇంటివాస్తు, పడకగది, బెడ్రూమ్

|

ఫెంగ్‌షుయ్ ప్రకారం పడకగదిలో అద్దాలను ఉంచకూడదు. అలా ఉంచితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట. ఒకవేళ వాటిని పడకగది నుంచి తీసేయడం కుదరని పక్షంలో ఏదైనా వస్త్రంతో దానిని మూతవేయాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

అలాగే పడకగదిలో డబుల్ కాట్‌లు ఉండకూడదు. ఒకే మంచం ఉండేలా చూసుకోవాలి. డబుల్ కాట్‌ను కలపడం చేయకూడదు. రెండు మంచాలను కలిపి దానిపై పరుపు వేయడం మంచిది కాదని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు.

దేవుడి ఫొటోలు

దేవుడి ఫొటోలు

అలాగే పడక గదిలో ఏ వస్తువులు పెట్టచ్చు, పెట్టకూడదు అనే విషయాలపై కూడా అవగాహన ఉండాలి. నిద్ర లేచిన వెంటనే చూసుకోవడానికి చిన్న దేవుడి ఫోటో పెట్టుకోవచ్చుగాని, పూజలు చేసే విగ్రహాలను పడక గదిలో పెట్టడం అనేది, శాస్త్రం ప్రకారం పెట్టకూడదు. పడ‌క‌గ‌దిలో పూజ‌లు నిషిద్దం అని, లైంగిక కార్యక‌ల‌పాలుజ‌రిగే గ‌దిలో దేవుని విగ్రహాలు పెట్టి పూజ చెయ్యకూడదు అని హిందూ ధ‌ర్మం చెబుతుంది.

ఆక్వేరియం

ఆక్వేరియం

పడక గదిలో ఆక్వేరియం, నీళ్ళకు సంబంధించిన పొటోలు ఉంచకూడదని, దీని వలన భార్యాభర్తల మధ్య గొడవ జరిగే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. తిరిగే చేపలు మీ బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి.

డ్రెసింగ్

డ్రెసింగ్

డ్రెసింగ్ పడకగదిలో తూర్పు ఆగ్నేయంలో మనం తూర్పు ముఖం పెట్టుకునే విధంగా లేదా గదికి ఉత్తర వాయవ్యంలో మనం ఉత్తర ముఖం చేసుకుని కూర్చునే విధంగా అమర్చుకోవాలి. అందుచేత మీ పడకగదిలో పైన చెప్పినట్లు డ్రెస్సింగ్ ఏర్పాటు చేసుకుంటే నిద్రించే మంచం గది వెడల్పును బట్టి అద్దానికి అడ్డురావు.

దక్షిణ భాగంలో

దక్షిణ భాగంలో

ఎందుకంటే దక్షిణ భాగంలో, పడమర భాగంలో మంచాలు వస్తాయి కాబట్టి. ఒకవేళ వచ్చినా దోషం లేదు. కారణం భార్యాభర్తలే ఆ గదిని వాడుకోవటంతో దోషాలుండవు. అందులో వారి రూపాలు కనబడినా అవి మనసుకు ప్రోత్సాహంగానే ఉంటాయి. కనుక ఇబ్బంది ఉండదు.

అద్దాలుంటే కర్టెన్లు వేయండి

అద్దాలుంటే కర్టెన్లు వేయండి

అయితే పడకగదిలో అద్దాలుండకుండా చూసుకోండి. ఒకవేళ డ్రెస్సింగ్ టేబుల్, కబోర్డులకు అద్దాలుంటే వాటికి కర్టెన్లు వేయడం మంచిది. ఇలా చేస్తే కుటుంబకలహాలు, దంపతుల మధ్య మనస్పర్ధలు ఏర్పడవని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇక మానసికంగా కుంగిపోవడాన్ని దూరం చేసుకోండి.

సానుకూల శక్తి

సానుకూల శక్తి

మీ పడక గదిలో సానుకూల శక్తి ప్రవహించేలా సర్దుకోవాలి. చక్కగా విశ్రాంతి పొందేందుకు సంసిద్ధంగా ఉండాలి.ఏ దిక్కు నుంచీ కూడా మీరు పడుకునే మంచం ప్రతిబింబించేలా గదిలో అద్దాన్ని పెట్టుకోరాదు. ఇది ప్రతికూల వైబ్రేషన్లను పెంచి వైవాహిక విచ్ఛిన్నానికి దారి తీసే అవకాశం ఉంటుంది.

టివి పెట్టుకోవడం

టివి పెట్టుకోవడం

అలాగే పడకగదిలో టివి పెట్టుకోవడం కూడా మంచిది కాదు. ఇది కూడా అద్దం లాగే ప్రతికూల వస్తువు.మంచాన్ని కిటికీకి కిందా తలుపుకు ఎదురుగా ఉండకుండా చూసుకోవాలి. మూడు వైపుల నుంచి దిగేందుకు వీలుగా మంచాన్ని వేసుకోవాలి.

తలుపు మూసే ఉంచాలి

తలుపు మూసే ఉంచాలి

పడకగదికి బాత్‌రూమ్‌ అటాచ్డ్‌గా ఉంటే ఎప్పుడూ దాని తలుపు మూసే ఉంచాలి. పడకగదిలో మొక్కలు పెట్టుకోవడం మంచిది కాదు. ఎదిగే మొక్కలుబెడ్‌రూంలో విశ్రాంతి వాతావరణంతో విబేధిస్తాయి.

మంచం కింద ఉండే అన్ని వస్తువులను తీసి వేయడం మంచిది. శక్తి నిరాటంకంగా ప్రవహించాలంటే ఆ ప్రదేశం పరిశుభ్రంగా, ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలి. ఇది వైవాహిక సంబంధాలకు మంచిది.

క్రిస్టల్స్‌ను తగిలించుకోవాలి

క్రిస్టల్స్‌ను తగిలించుకోవాలి

పడక గది కిటికీ పక్కన పింక్‌ లేదా హృదయాకారంలో ఉన్న క్రిస్టల్స్‌ను తగిలించుకోవాలి లేదా ఒక పింక్‌ క్వార్ట్‌జ్‌ క్రిస్టల్‌ను వెలుగు పడేలా బల్ల మీద ఉంచాలి. తద్వారా అది ప్రేమకు సంబంధించి సానుకూల శక్తిని పెంచుతుంది.

వ్యాయామం చేసే పరికరాలు, కంప్యూటర్‌, పనికి సంబంధించిన ఇతర సామాగ్రిని పడక గదిలో నుంచి వేరే గదికి తరలించాలి. వాటిని బెడ్‌రూంలో ఉంచడం వల్ల మీ మధ్య సంబంధాలు కూడా పనికి సంబంధించిన వాటిలానే అనిపిస్తాయి.

అలాగే సూది మొనలు కలిగిన ఫర్నిచర్‌ను బెడ్‌రూంలో ఉంచుకోకపోవడం మంచిది. ఇవి విషపు బాణాలలా పని చేస్తాయి. గుండ్రటి అంచులు కలిగిన ఫర్నిచర్‌ ఉత్తమం.

నవగ్రహ పూజ చేయించడం

నవగ్రహ పూజ చేయించడం

అలాగే ఇంట్లో మూడేళ్లకు ఒకసారి గణేశ పూజ లేదా నవగ్రహ పూజ చేయించడం ద్వారా ఆ గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యపరంగా సమస్యలుండవు. ఆర్థిక పరమైన ఇబ్బందులు వుండవని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా వాస్తు దోషాలేవైనా ఉంటే.. గణేశ, నవగ్రహ పూజలను చేయించడం ద్వారా తొలగిపోతాయి.

స్వస్తిక్ గుర్తు

స్వస్తిక్ గుర్తు

అలాగే ఇంట వాస్తు దోషాలు తొలగాలంటే శుక్రవారం పూట ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తు గల రంగవల్లికలు వేయించాలి. రంగోలీలు వేసేటప్పుడు స్వస్తిక్ గుర్తు వేసి.. ఎవరూ తొక్కనీయకుండా జాగ్రత్తపడాలి. ఇలా చేస్తే ఆ ఇంట వున్నవారు అనారోగ్యాల బారినపడరని వాస్తు నిపుణులు చెప్తున్నారు. మీ ఇంటి తలుపుల మీద స్వస్తిక్ ఇంకా ఓమ్ సింబల్స్‌ని ఉంచడం మంచిది

కోప సంబంధింత ఫోటోలు

కోప సంబంధింత ఫోటోలు

అయితే ఇంట్లో ఏడుస్తున్న యువతి, యుద్ద సన్నివేశాల చిత్రం, కోపంగా ఉన్న మనిషి, గుడ్ల గూబ ఇంకా డేగ ఇలాంటి పోస్టర్స్ ఉండకూడదట. వీటిలో ఏ ఒక్కటున్నా.. తీసేయడం మంచిదని ఫెంగ్‌షూయ్ నిపుణులు అంటున్నారు. గరుడ దేవుడు వుండే ఫోటోలను ఇంట్లో వుంచకూడదు. అలాగే ఓ బౌల్‌‍లో రాతి ఉప్పును వుంచి ఇంటికి నాలుగు మూలల్లో వుంచడం ద్వారా నెగటివ్ ఎనర్జీని పారద్రోలవచ్చు. పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రప్పించాలంటే.. టింక్లిన్ బెల్స్ ఉపయోగించాలి. అలాగే ఇంటికి మూలల్లో గంగాజలం వంటి పుణ్యతీర్థాలను వుంచి వారానికి ఓసారి మార్చి వేస్తుంటే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది.

పాజిటివ్ ఎనర్జీ

పాజిటివ్ ఎనర్జీ

అలాగే టింక్లింగ్ బెల్స్ ఇంటి ముందు వేలాడదీయడం ద్వారా నెగటివ్ ఎనర్జీ విచ్ఛీనమై.. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చినట్లవుతుంది. అందుకే రెండు మెటల్ బెల్స్‌ను ఇంటి ముందు ఉంచడం మంచిది. మందులను వంట గదిలో ఉంచడం వల్ల నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.

English summary

how to feng shui your bedroom

how to feng shui your bedroom
Story first published:Saturday, June 9, 2018, 10:54 [IST]
Desktop Bottom Promotion