Latest Updates
-
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్‌షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు!
హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్... అందరూ బాడీలు చూపిస్తున్నారు.. అదరగొడుతున్నారు.. మోదీ చూపించనున్నారు
ఇప్పుడు దేశం మొత్తం హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్ అనే విషయంలో బిజీగా ఉంది. హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్ #HumFitTohIndiaFit అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
గతంలో సోషల్ మీడియాలో ఐస్ బకెట్ చాలెంజ్, ప్యాడ్‌మాన్ చాలెంజ్‌లు తెగ వైరల్ అయ్యాయి. నెటిజన్లంతా ఈ చాలెంజ్‌లను స్వీకరిస్తూ ఓ ట్రెండ్ సెట్ చేశారు. ఇలాంటి ఛాలెంజన్లను సెలబ్రెటీలు స్టార్ట్ చేస్తే ఈజీగా ప్రజల్లోకి వెళ్తాయి.
అయితే ఇలాంటి తరహాలోనే మరో కొత్త చాలెంజ్ తెరపైకి వచ్చింది. ఈసారి కొత్త చాలెంజ్‌ను తీసుకొచ్చింది మన కేంద్ర కీడా శాఖ మంత్రే. ఈయన ఒలింపిక్ విజేతని మన అందరికీ తెలుసు.
హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్
దీంతో ఇప్పుడు దేశం మొత్తం హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్ అనే విషయంలో బిజీగా ఉంది. హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్ #HumFitTohIndiaFit అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఐస్ బకెట్‌లాగా భారతీయులు ధృడంగా ఉండాలంటూ కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ ‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్' అనే పేరుతో ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. .
మోదీ అభిలాష
భారతీయులు అంతా ఫిట్‌గా ఉండాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ అభిలాష అని అందుకే ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను ప్రారంభించానని ఆయన ట్వీట్ చేశారు. అలాగే ఆయన స్వయంగా పుషప్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.
స్పూర్తి పొందుతాను
ఇక వీడియోలో కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ ఏం చెప్పాడంటే.. ఫిట్‌నెస్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి తాను స్పూర్తి పొందినట్లు తెలుపుతూ.. ఈ ఒలింపిక్ విజేత పది పుషప్స్ చేశాడు. ‘‘ ప్రధాని మోదీని చూసినప్పుడల్లా స్పూర్తి పొందుతాను. ఆయన చాలా శక్తివంతుడు. రోజంతా పనిచేస్తునే ఉంటారు. భారత ప్రజలు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని ఆయన ఎప్పుడు పరితపిస్తుంటారు. ఫిట్‌నెస్‌పై ప్రధాని మాట్లాడిన కొన్ని మాటలు నన్ను ఆలోచింపజేశాయి.'' అని తెలిపారు.
నెటిజన్లు స్పందిస్తున్నారు
ఇక ఈ చాలెంజ్‌కు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. తమ వర్కౌట్స్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. సినీ, రాజకీయ సెలబ్రిటీలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు.
సవాలు విసిరారు
కాగా హృతిక్ రోషన్, విరాట్ కోహ్లీ, సైనా నెహ్వాల్‌లకు కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ సవాలు విసిరారు. రాథోడ్ ఛాలెంజ్‌ను సైనా, హృతిక్ స్వీకరించి వారు కూడా కసరత్తులు చేసే వీడియోలను పోస్ట్ చేశారు.
సైనా నెహ్వాల్ జిమ్ లో బరువులు ఎత్తుతూ..
రాథోడ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన హృతిక్ రోషన్.. రోజూ ఇలా ఆఫీస్‌కెళ్తానంటూ సైకిల్‌పై వెళ్తున్న వీడియో తీసి ట్వీట్ చేశాడు. సైనా నెహ్వాల్ జిమ్‌లో బరువులెత్తుతున్న వీడియోను ట్వీట్ చేసి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ సవాల్‌కు బదులిచ్చింది. తనకు ఈ సవాల్ విసిరినందుకు మంత్రికి థ్యాంక్స్ చెప్పింది.
పీవీ సింధుకు సవాల్
ఇక సైనా ఫిట్‌నెస్ కసరత్తులు చేసే వీడియోను సోషల్‌మీడియాలో పంచుకుంటూ నటుడు దగ్గుబాటి రానాతో పాటు క్రీడాకారులు పి.వి సింధు, గౌతమ్ గంభీర్‌లకు ఛాలెంజ్ విసిరింది. సింధు ఫిట్‌నెస్ ఛాలెంజ్‌తో అక్కినేని అఖిల్ కూడా తన కసరత్తులు చూపించారు.
అఖిల్ జిమ్‌లో బాడీని చూపిస్తూ
అఖిల్ జిమ్‌లో తన బాడీని చూపిస్తూ చేసిన కసరత్తులకు సంబంధించిన వీడియో కూడా బాగానే వైరల్ అయ్యింది. అఖిల్ తన తండ్రితో పాటు వరుణ్ ధావన్, నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్‌లకు సవాలు చేశాడు.
ప్రధాని ఒకే అన్నారు
ఇక టీమిండియా కెప్టెన్ విసిరిన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌కు ప్రధాని ఒకే అన్నారు. విరాట్.. మీరు విసిరిన సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా. త్వరలోనే నా ఫిట్‌నెస్ ఛాలెంజ్ వీడియోను షేర్ చేస్తాను. చూడు అంటూ కోహ్లి ట్వీట్‌కు ప్రధాని బదులిచ్చారు. జిమ్‌లో 20 స్పైడర్ ప్లాంక్స్ చేసిన వీడియోను విరాట్ ట్వీట్ చేశారు.
అనుష్క శర్మకు సవాలు
అలాగే మీ ఫిట్‌నెస్ నిరూపించుకోండంటూ.. తన భార్య అనుష్క శర్మతో పాటు మహేంద్ర సింగ్ ధోనీ, ప్రధాని నరేంద్ర మోదీలకు విరాట్ సవాల్ విసిరాడు. అయితే ఆరోగ్యమూ మహాభాగ్యం. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇక అనుష్కశర్మ కూడా కోహ్లీ సవాల్ ను స్వీకరించి వర్క్ అవుట్స్ చేసింది.
నాగ చైతన్య
కానీ ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్లేయర్స్, సెలబ్రిటీలు, సినీ స్టార్లు మాత్రం ఫిట్ నెస్ పై బాగానే ఇంట్రస్ట్ చూపిస్తారు. కానీ సామాన్య జనం కూడా ఫిట్ నెస్ పై శ్రద్ధ పెడితే దేశం మొత్తం మీద అందరూ ఫిట్ గా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. ఇక నాగచైతన్య కూడా వర్క్ అవుట్స్ తో అల్లాడించేశారు.
బాగానే ట్రెండింగ్ లో ఉంది
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫిట్ నెస్ ఛాలెంజ్ బాగానే ట్రెండింగ్ లో ఉంది. ఈ ఛాలెంజ్ వైరల్ గా మారింది. సెలబ్రిటీల పుణ్యమా అని.. ట్విట్టర్ లో ఇప్పుడిది ట్రెండింగ్ అవుతోంది. సామాన్యులు కూడా సెలబ్రిటీల దారిలో ఫిట్ నెస్ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నారు. హమ్ ఫిట్ తో ఇండియా హిట్ అంటున్నారు.
ఇన్‌స్పిరేషన్
అందరూ ఇదే బాటలో నడిస్తే ఇండియా అంతా ఫిట్ గా ఉంటుంది. మొత్తానికి కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ చాలామందికి ఇప్పుడు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. సామాన్యులే కాదు సెలబ్స్ కూడా రాజ్యవర్ధన్ పిలుపుకు స్పందిస్తూ వర్కవుట్స్ ఫొటోలు, వీడియోలు తెగ పోస్ట్ చేసేస్తున్నారు. సల్మాన్ ఖాన్ పుషప్స్ కూడా హైలెట్.



Click it and Unblock the Notifications