For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేను మీడియాలో పని చేస్తున్నా.. ఆ పెద్దాయన వక్రబుద్ది నాకిప్పటికీ అర్థం కావడం లేదు - My Story # 111

మరో రోజూ నా టీమ్ లో పని చేసే వ్యక్తులపై విరుచుకపడతాడు. ఇంకో రోజూ అక్రమ సంబంధాలు అంటగడతాడు. అసలు నీకు సిగ్గుందా? అని ప్రశ్నించి.. ముఖంపై ఉమ్మి వేయాలని అనిపిస్తూ ఉంటుంది.

|

నా వయస్సు 24 సంవత్సరాలు. నా పేరు ప్రియాంక. వయస్సు తక్కువైనా నాకు జీవితం నేర్పిన పాఠాలు మాత్రం చాలానే ఉన్నాయి. నేను పుట్టినప్పుడు మా అమ్మనాన్న ఊరిలో ఒక పెద్ద వేడుకే చేశారు. పుట్టడం, పెరగడం, జీవితాంతం కష్టాలు అనుభవించడం, చావడం ఇదేనా జీవితం? అని నన్ను నేను చాలా సార్లు ప్రశ్నించుకుంటాను.

మరో దౌర్భాగ్యం ఏమీ ఉండదు

మరో దౌర్భాగ్యం ఏమీ ఉండదు

ఈ సమాజంలో బతకడం కంటే మరో దౌర్భాగ్యం ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరూ ఎదుటి వారి జీవితంలో తొంగి చూడాలనుకునేవారే తప్ప.. ఎవరి జీవితం వారు చూసుకునే వాళ్లు ఈ సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారనుకుంటున్నాను.

గొప్పగొప్ప మాటలు

గొప్పగొప్ప మాటలు

మన బతుకేదో మనం బతుకుతుంటాం. మన పాట్లు ఏవో మనం పడుతుంటాం. బాగా బతకలేపోతే ఎగతాళి చేస్తారు. బాగా బతుకుతుంటే ఓర్వలేరు ఈ జనం. అందరూ చూడడానికి గొప్పగొప్ప మాటలు చెబుతుంటారు. కానీ మనస్సు నిండా కుళ్లుకుంతంత్రాలే ఉంటాయి.

మీడియాలో

మీడియాలో

నా జీవితంలో ఎదురైనా చాలా మంది అలాంటి కోవకు చెందిన వారే ఉన్నారు. నేను జర్నలిజంలో పీహెచ్ డీ చేశాను. అలా చేసిన సో కాల్డ్ పెద్దమనుషులంతా గొప్ప జర్నలిస్ట్ లంటే నేను ఒప్పుకోను. ఒక మీడియాలో పని చేస్తున్నాను. ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు వరకు రోజూ ఆఫీస్ కు వచ్చి అక్కడ అప్పగించిన వర్క్ ను బాధ్యతగా పూర్తి చేయడమే నా బాధ్యత.

చాలా దరిద్రంగా ఉంటాయి

చాలా దరిద్రంగా ఉంటాయి

ప్రపంచమంతా రోజూ జరిగే విషయాలను అందరికీ కళ్లకు కట్టినట్లుగా చూపించే మీడియాలో పని చేసే వారి బతుకులు చాలా దరిద్రంగా ఉంటాయి. అందరివీ అలాగే ఎందుకుంటాయ్.. అయినా నువ్వు ఎవరూ అలా జడ్జిమెంట్ చెయ్యడానికి అని మీరు అనుకోవొచ్చు.. మీ అభిప్రాయాన్ని నేను అంగీకరిస్తాను.

పతనం కోరుకునే వ్యక్తులకు

పతనం కోరుకునే వ్యక్తులకు

మీడియాలో పని చేసే కొందరికి మాత్రం మినాహాయింపు ఉంటుంది. భజనలు చేసేవారికి, తమ తప్పులు తప్ప.. మిగతావారందరి తప్పులు మరీ వెతికి చూపించే మహానుభావులకు.. ఎప్పుడూ అవతలి వ్యక్తి పతనం కోరుకునే వ్యక్తులకు మాత్రం మీడియాలో మంచి భవిష్యత్తే ఉంటుంది.

నువ్వు ఎవడ్రా?

నువ్వు ఎవడ్రా?

కానీ నాది ఆ స్వభావం కాదే. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే గుణం. ఎవరైతే నాకేంటి.. నేను నా పనిని బాధ్యతగా నిర్వహిస్తున్నా.. ప్రశ్నించడానికి నువ్వు ఎవడ్రా? అనే తెగించే గుణం నాది. రోజూ ఎవరో ఒకరు నన్ను కెలుకుతూనే ఉంటారు. బురద జల్లే ప్రయత్నం చేస్తూనే ఉంటారు.

ఇప్పటికీ మరియు, నుండి, యొక్క

ఇప్పటికీ మరియు, నుండి, యొక్క

తెలుగులో సరిగ్గా అ,ఆలు రాయలేని వారూ కూడా మీడియాలో కొనసాగుతున్నారు. ఇప్పటికీ మరియు, నుండి, యొక్క పదాలు ఉపయోగించే వారే చాలా ఉన్నత స్థానాల్లో తెలుగు జర్నలిజంలో చలామణి అవుతున్నారు. అలాంటి వ్యక్తులు కూడా నన్ను తప్పు పడుతుంటే నవ్వు వస్తుంటుంది.

మగమహారాజులు

మగమహారాజులు

వీళ్లా.. నా గురించి.. నా పని గురించి మాట్లాడేది అని నవ్వుకుంటాను. చిన్న వయస్సుల్లోనే నేను ఒక స్థాయికి ఎదిగాను. తక్కువ సమయంలో అక్షరాలతో నా ప్రతిభచూపాను. దాన్ని జీర్ణించుకోలేని మగమహారాజులు చాలా మంది నన్ను దెబ్బతియ్యడానికి రోజూ ప్రయత్నిస్తుంటారు.

భలే లెక్చర్స్

భలే లెక్చర్స్

ఒక పెద్దాయన.. ఆయనగారూ ఒక ఉన్నతమైన హోదాలో పని చేస్తుంటారు. అందరూ చూడడానికి భలే లెక్చర్స్ ఇస్తుంటారు. ఆయనగారి ఫేస్ బుక్ వాల్ పై కూడా అన్నీ సమాజానికి సంబంధించిన పోస్ట్ ఉంటాయి.

ఈ అమ్మాయి ఇలా ఎదిగిపోతుంది

ఈ అమ్మాయి ఇలా ఎదిగిపోతుంది

కానీ నేనంటే ఆయనకు గిట్టదేమో. లేదంటే ఇంత తక్కువ వయస్సులో ఈ అమ్మాయి ఇలా ఎదిగిపోతుందేమో అని భయపడుతున్నాడో! ఆయనకు తోడుగా ఇంకొందరు జత అయ్యి నన్ను టార్గెట్ చేశారు.

నవ్వుకుంటూ ఉంటాను

నవ్వుకుంటూ ఉంటాను

తనకు ఓ ఆడపిల్ల ఉంది. ఇలా ఒక అమ్మాయిని టార్గెట్ చేసి ఇబ్బందులుపెడుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నానంటే .. నేను ఆ పెద్దాయనకంటే గొప్పదాన్ని కావడం వల్లే ఆయనకు నాపై ఈర్ష్య, ద్వేషాలు కలుగుతున్నాయనే సంతోషం వల్లే. నాలో నేను నవ్వుకుంటూ ఉంటాను.

అక్షరాలు కూడా రాయడం రాదు

అక్షరాలు కూడా రాయడం రాదు

ఓ పెద్దాయన.. మీరు చాలా పుస్తకాలు రాసి ఉండొచ్చుగానీ.. సరిగ్గా మీకు అక్షరాలు కూడా రాయడం రాదు. ఫస్ట్ మీ తప్పులను సరిదిద్దుకోండి.. తర్వాత అవతలి వ్యక్తుల తప్పులను వెతకండి అని చాలా సార్లు డైరెక్ట్ గా చెబుదామనిస్తోంది. ఆయన మాదిరిగా పరోక్ష దాడులు చేయడం నా చేత కాదు.

ఒక్కో రోజు ఒక్కో అస్త్రం

ఒక్కో రోజు ఒక్కో అస్త్రం

ఈ పెద్దాయన ఒక్కో రోజు ఒక్కో అస్త్రం వదులుతుంటాడు. ఒక రోజు నా డ్రెస్ స్టైల్ బాలేదంటారు. మరో రోజు నా బిహేవియర్ బాలేదంటారు. ఆయనకు భజన చేయకుండా.. ఆయనకు గౌరవం ఇవ్వకుండా ఉండడాన్ని ఆయన బ్యాడ్ బిహేవియర్ గా పరిగణలోకి తీసుకుంటారు.

ముఖంపై ఉమ్మి వేయాలని అనిపిస్తుంది

ముఖంపై ఉమ్మి వేయాలని అనిపిస్తుంది

మరో రోజూ నా టీమ్ లో పని చేసే వ్యక్తులపై విరుచుకపడతాడు. ఇంకో రోజూ అక్రమ సంబంధాలు అంటగడతాడు. అసలు నీకు సిగ్గుందా? అని ప్రశ్నించి.. ముఖంపై ఉమ్మి వేయాలని అనిపిస్తూ ఉంటుంది.

నేను కూడా ప్రయోగించగలను

నేను కూడా ప్రయోగించగలను

అలా నేను పరోక్ష దాడులు చెయ్యడం మొదలుపెడితే ఒక్క క్షణం కూడా నిలకడగా ఉండకుండా చేయగలుగుతాను. జీవితం నాకు కూడా ఎన్నో గుణపాఠాలు నేర్పింది కాబట్టి వాటి ద్వారా నేర్చుకున్న విద్యలన్నింటినీ నేను కూడా ప్రయోగించగలను.

వయస్సు పైబడింది

వయస్సు పైబడింది

కానీ మీకు వయస్సు పైబడింది.. మీరు కూడా నా తండ్రిలాంటి వారేనని... నేను నీపై ఎక్కువ ఫోకస్ పెడితే నా కెరీర్ దెబ్బతింటుందని మీ గురించి ఆలోచించడం లేదు.

కోడిగుడ్డుపై ఈకలు పీకాలని ప్రయత్నిస్తుంటారు

కోడిగుడ్డుపై ఈకలు పీకాలని ప్రయత్నిస్తుంటారు

ప్రతి ఆఫీసులో ఇలాంటి పెద్దాయానలు చాలా మందే ఉంటారు. పనీపాటలేని వారిని కంపెనీలు జీతాలు ఇచ్చి పోషిస్తుంటాయి. గుండె నిండా ధైర్యంతో.. అంకిత భావంతో పని చేసే యువతను చూస్తే వీళ్లకు వెన్నులో భయం పుడుతుంది. అందుకే కోడిగుడ్డుపై ఈకలు పీకాలని ప్రయత్నిస్తుంటారు.

ఇలాంటి అడ్డంకులు వస్తాయి

ఇలాంటి అడ్డంకులు వస్తాయి

ఇది నా ఒక్కదాని సమస్య కాదు. ఈ ప్రపంచంలో ఉద్యోగాలు చేసే కొన్ని వేల మంది అమ్మాయిలు ఇలా రోజూ ఏదో ఒక రూపంలో సమస్యను ఎదుర్కొంటూనే ఉంటారు. మనం వెళ్లే దారిలో అప్పుడప్పుడు ఇలాంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి.

కాళీకదేవిలాగా విశ్వరూపం చూపించండి

కాళీకదేవిలాగా విశ్వరూపం చూపించండి

కానీ ప్రతి నారీమణి ధైర్యంగా ముందుకెళ్తేనే ఈ సమాజంలో మనుగడ సాధించగలదు. ఒక్కో స్త్రీ ఒక్కో రకమైన సమస్యను ఎదుర్కొంటుంది. ఓపికున్నంత వరకూ సహించండి. ఓపిక నశించాక కాళీకదేవిలాగా విశ్వరూపం చూపించండి. ఒక్కటి మాత్రం గుర్తించుకోండి. పుట్టుక, చావుల మధ్య గడిపే ఈ జీవితంలో మాత్రం ప్రతి క్షణం పోరాటం చేస్తేనే మనుగడ సాధించగలం. మహిళా సాధికారత చాలా అవసరం.

English summary

i am 24 now and I have my own perspective on several issues that concern me

i am 24 now and I have my own perspective on several issues that concern me
Desktop Bottom Promotion