For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆమె రాత్రంతా ఫోన్ లో మాట్లాడుతూ ఏవేవో కోరికలు రేపేది.. అది వర్చువల్‌ నంబర్ అట - #mystory180

మా ఆయన లేడు. నేను చాలా రోజులుగా ఒంటరిగా ఉంటున్నాను. నా కోరికలు అదుపులో పెట్టుకోలేకపోతున్నా. నువ్వు ఒక్కసారి వస్తావా అంటూ నా సెల్ కు ఒక మెసేజ్ వచ్చింది. వర్చువల్ నంబర్, ఫేక్ కాల్, ఫోన్ లో మోసం.

|

మా ఆయన లేడు. నేను చాలా రోజులుగా ఒంటరిగా ఉంటున్నాను. నా కోరికలు అదుపులో పెట్టుకోలేకపోతున్నా. నువ్వు ఒక్కసారి వస్తావా అంటూ నా సెల్ కు ఒక మెసేజ్ వచ్చింది. మొదట నేను దాన్ని పట్టించుకోలేదు. మరుసటి రోజు.. మీరు ఎక్కడున్నారు.. ఎన్నాళ్లయ్యింది మీతో మాట్లాడి.. ఫోన్ చెయ్యండి ఈ నెంబర్‌కు అంటూ ఒక అందమైన స్వరం ఉన్న అమ్మాయి మాట్లాడింది.

హిందీలోనే మాట్లాడింది

హిందీలోనే మాట్లాడింది

ఆమె మొత్తం హిందీలోనే మాట్లాడింది. ఆ రోజు నేను రూమ్ లో ఒక్కన్నే ఉన్నాను. నాకు కూడా ఏవేవో కోరికలతో నిద్రపట్టలేదు. వెంటనే కాల్ చేశా. చాట్ చేశా. సారీ అండీ.. నేను నా బాయ్ ఫ్రెండ్ అనుకున్నాను... మీకు వచ్చిందా కాల్ అంది. ఆమె ఆ మాటలు చెబుతుండగానే నేను తనతో మాటలు కలిపాను. గంటల తరబడి మాట్లాడాను. నేను చెప్పే ఊసులన్నీ ఆమె వింటూ ఉంది.

తన స్వరం విని

తన స్వరం విని

తను ఎవరో నాకు తెలియకపోయినా తన స్వరం విని తన రూపాన్ని ఊహించుకున్నాను. తను నేను ఏం చెప్పినా అభ్యంతరం చెప్పలేదు. అంత బోల్డ్ గా నాతో ఏ అమ్మాయి మాట్లాడలేదు. అందుకే తనతో నేను గంటల తరబడి మాట్లాడుతూ ఉండిపోయాను.

కోరికలను చెప్పేవాణ్ని

కోరికలను చెప్పేవాణ్ని

నా బ్యాచిలర్ ప్రాబ్లమ్స్, నా ఉడుకురక్తం కోరుకుంటున్న కోరికలను చెప్పేవాణ్ని. తను ఫోన్ లో మాట్లాడుతూనే నాలో ఏవేవో కోరికలు రేపేది. కోరిక తీర్చడానికి నీకు దగ్గర్లో లేను.. లేదంటే తీర్చేదాన్ని అనేది.

రోజూ అర్ధరాత్రి వేళల్లో మిస్డ్‌కాల్స్‌

రోజూ అర్ధరాత్రి వేళల్లో మిస్డ్‌కాల్స్‌

అలా రోజూ అర్ధరాత్రి వేళల్లో మిస్డ్‌కాల్స్‌ వచ్చేవి. నేను ఫోన్ చేసే మాట్లాడేవాణ్ని. నాది పోస్ట్ పెయిడ్ నంబర్. నా నంబర్ కు చాలా ఆఫర్స్ ఉన్నాయి. దాంతో నాకు ఫోన్ బిల్ సమస్య

ఉండదని నేను రోజూ మాట్లాడాను. ఒక రోజు నాకు నా సిమ్ కార్డ్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది. మీరు మీ లిమిట్ దాటిపోయారు. ఇప్పటికే మీకు చాలా బిల్ వచ్చింది అని చెప్పారు. నేను షాక్ అయ్యాను.

నేను ఫోన్ మాట్లాడితే ఒట్టు

నేను ఫోన్ మాట్లాడితే ఒట్టు

నేను ఎవరితోనూ సరిగ్గా మాట్లాడాను. ఆ అమ్మాయితో మాత్రమే ఎక్కువ సేపు మాట్లాడుతాను. కానీ నా జీవితంలో అంత ఫోన్ బిల్ నేను ఎప్పుడూ చూడలేదు. మళ్లీ జీవితంలో నేను ఫోన్ మాట్లాడితే ఒట్టు. అసలు ఏం జరిగిందా అని టెన్షన్ పడ్డాను. ఇలాంటి విషయాలపై బాగా అవగాహన ఒక సార్ తో నా సమస్య మొత్తం చెప్పుకున్నా. ఆయన నాకు ఇలా వివరించారు.

వర్చువల్‌ నెంబర్లతో

వర్చువల్‌ నెంబర్లతో

"ఇటీవల కాలంలో ఇలాంటి కాల్స్ పెరిగిపోయాయి. ఎవరైనా స్పందించి ఆయా నెంబర్లను సంప్రదిస్తే నిండా మునిగినట్లే. ఫోన్‌కాల్స్‌ బిల్లు భారీగా వస్తుంది. స్నేహం, ప్రేమ, డేటింగ్‌ పేరుతో వర్చువల్‌ నెంబర్లతో వల వేసి నిలువునా ముంచే ప్రీమియం కాల్స్‌ బెడద పెరిగింది" అని చెప్పాడు.

బల్క్‌ ఎస్సెమ్మెస్‌లు పంపడం

బల్క్‌ ఎస్సెమ్మెస్‌లు పంపడం

కొందరు ప్రీమియంగాళ్లు యువతులు పేర్లతో బల్క్‌ ఎస్సెమ్మెస్‌లు పంపడం, ఫోన్లు చేయడం, మిస్డ్‌ కాల్స్‌ ఇవ్వడంతో పాటు ఎదుటి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్‌లో దోచుకుంటూ ఉంటారన్నారు.

నిర్ణీత కాలానికి అద్దెకు

నిర్ణీత కాలానికి అద్దెకు

కొందరు ప్రీమియం గాళ్లు తాము టార్గెట్‌గా చేసుకున్న వారికి పంపడానికి వర్చువల్‌ నంబర్లను వాడుతున్నారట. ఇంటర్‌నెట్‌లోని అనేక వెబ్‌సైట్లు ఈ ఫోన్‌ నెంబర్లను నిర్ణీత కాలానికి అద్దెకు ఇస్తుంటాయట. ఆయా సైట్లలో ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన, వివిధ సర్వీసు ప్రొవైడర్లు అందించే కొన్ని నంబర్లు డిస్‌ప్లే అవుతుంటాయట. వీటిలో తమకు కావాల్సిన దేశానికి చెందిన వాటిని ఎంపిక చేసుకోవచ్చట.

ఇంటర్‌నెట్‌ కాలింగ్‌

ఇంటర్‌నెట్‌ కాలింగ్‌

ఈ నంబర్లు ఇంటర్‌నెట్‌ కాలింగ్‌ ద్వారా పని చేస్తాయట. ఇలా వర్చువల్‌ నంబర్‌ పొందే వారు వాటిని బల్క్‌ ఎస్సెమ్మెస్‌ రూపంలో స్నేహం, ప్రేమ, డేటింగ్‌ అంటూ సదరు నంబర్‌ను ప్రచారం చేస్తారట. ఇవి ప్రీమియం నంబర్లు కావడంతో అసలు చార్జికి కొన్ని రెట్లు ఎక్కువ పడుతుంది.

నిమిషానికి రూ.18

నిమిషానికి రూ.18

వివిధ టీవీ ఛానళ్లు నిర్వహించే ఎస్సెమ్మెస్‌ కాంటెస్ట్‌లు, ఫోన్‌ కాంటెస్టులకూ ఇలాంటి ప్రీమియం నంబర్లనే వాడతారట. ఎస్‌ఎంఎస్‌కు రూ.5, కాల్‌కు నిమిషానికి రూ.18 వరకు చార్జ్‌ పడుతుందట. ఇంటర్నేషనల్‌ రూటింగ్‌ కాల్స్‌ కు ఈ చార్జీలు మరింత ఎక్కువగా ఉంటాయట.

ఇంటర్నేషనల్‌ రూటింగ్‌ ద్వారా

ఇంటర్నేషనల్‌ రూటింగ్‌ ద్వారా

నాలా మెసేజ్ లకు ఆకర్షితులై ఎవరైనా ఫోన్‌ చేస్తే... మాట్లాడటానికి కొందరు యువతులను ఏర్పాటు చేసుకుంటారట ప్రీమియగాళ్లు. ఈ కాల్స్‌ అన్నీ ఇంటర్నేషనల్‌ రూటింగ్‌ ద్వారా వస్తాయట. వీరు సంభాషణను వీలైనంత పొడిగించేందుకు ప్రయత్నం చేస్తుంటారట. దీంతో భారీగా బిల్లు వస్తుందట. మొత్తానికి ప్రీమియంగాళ్ళ ఆదాయం కోసం అమాయకులను బలి చేస్తారట.

కనుక్కోవడం కష్టసాధ్యమట

కనుక్కోవడం కష్టసాధ్యమట

ఇక నాలాంటి బాధితులు చాలా మంది ఉన్నారట. వారంతా సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్లలో మొరపెట్టుకుంటున్నారంట.అయితే వర్చువల్‌గా ఉండే ఈ నెంబర్ల మూలాలు కనుక్కోవడం, కట్టడి చేయడం అత్యంత కష్టసాధ్యమట. ఆయా వెబ్‌సైట్లకు సంబంధించిన సర్వర్లు విదేశాల్లో ఉండటమే దీనికి కారణం అట.

మీరు నాలా కాకండి

మీరు నాలా కాకండి

సో ఫ్రెండ్స్ నా మాదిరిగా మీరు కూడా ఇలాంటి వారిలో బుట్టలో పడకుండా జాగ్రత్తగా ఉండండి. క్షణికానందం కోసం మీరు తెలియని వ్యక్తులతో ఫోన్లో గంటల తరబడి ముచ్చట్లు పెడితే మీరు జీవితంలో చెల్లించలేనంత బిల్ వస్తుంది. ప్రస్తుతం నేను తెలియక చేసిన తప్పుకు మూల్యం చెల్లించక తప్పడం లేదు. మీరు నాలా కాకండి.

English summary

i got a fake call and was cheated

i got a fake call and was cheated
Story first published:Friday, June 1, 2018, 15:24 [IST]
Desktop Bottom Promotion