Latest Updates
-
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది!
మీ వ్యక్తిత్వాన్ని బయటపెట్టే ఆసక్తికరమైన పరీక్ష..
మీ వ్యక్తిత్వాన్ని బయటపెట్టే ఆసక్తికరమైన పరీక్ష..
ఈ మద్య కాలంలో మీరు ఆడిన “మైండ్ గేమ్స్” లో ఉత్తమమైనది ఏది? ఒక వ్యక్తిని పరీక్షించడం ద్వారా వచ్చే ఫలితాలలో, వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకోవడమనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పరీక్ష ఇతరులను బాధ పెట్టకుండా, మంచి మార్గంలో ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడుతుంది.
ఆప్టికల్ ఇల్యూషన్ పరీక్ష ద్వారా, వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఆసక్తికరంగా ఉంది కదా?, ఎందుకంటే ఈ పరీక్ష, వారి ఆలోచనల గురించిన పూర్తి అవగాహనను ఇవ్వగలదు. తద్వారా వ్యక్తి, వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సులభతరం అవుతుంది.
ఇక్కడ, ఈ ఆప్టికల్ ఇల్యూషన్ పరీక్షలో మీరు చేయవలసిన పని ఏమిటంటే, ఇక్కడ పొందుపరచిన చిత్రాన్ని తనిఖీ చేసి, మొదటగా మీకు కనిపించిన చిత్రాన్ని, తర్వాత కాసేపటి తర్వాత కనిపించిన చిత్రాన్ని కలిపి విశ్లేషించండి తద్వారా మీ ప్రస్తుత వ్యక్తిత్వ లక్షణాలను అంచనా వేయవచ్చు.
ఈ భ్రమను కల్పించే చిత్రంతో పరీక్ష ఏమిటి? అసలు ఇది ఎలా పని చేస్తుంది? అని మీరు ఆలోచిస్తూ ఉంటే., అది సాధారణ మెదడు మెదడుచే ఆలోచనా విధానం అని చెప్పబడింది. ఎందుకంటే ఆప్టికల్ ఇల్యూషన్ ప్రకారం, మన ఆలోచనలకు వ్యతిరేకంగా ఫలితాలు కనిపిస్తున్నప్పుడు, మెదడు వెంటనే అంగీకరించలేదు, తద్వారా అయోమయంతో కూడిన స్థితికి దారి తీస్తుంది!
ఒకసారి ఈ చిత్రాన్ని తేరిపారా చూడండి.

మీరు ఒక మహిళ అయుండి ఒక పురుషుని ముఖాన్ని కనుగొన్న ఎడల...
మీరు ఒక స్త్రీ అయి ఉండి, చిత్రంలో ఒక పురుషుని ముఖాన్ని మొదటగా కనుగొంటే, అప్పుడు మీరు మీ శృంగార భాగస్వామి కోసం ఎదురుచూస్తున్న వ్యక్తి అని అర్థం. లేదా మీ భాగస్వామి మీరు ఆశించిన సంతోషాన్ని పొందక నిరాశగా ఉన్నారని అర్ధం. మరొకవైపు మీరు మీ భాగస్వామి పట్ల విపరీతమైన ప్రేమను కలిగి ఉంటారు. మీ వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది. మరియు మీకు తగిన విధంగా మీ భాగస్వామిని మలచుకోగలిగిన శక్తి మీకుంటుంది. ధైర్యం, ఆత్మస్థైర్యం మీకు సహజ ఆభరణాలుగా ఉంటాయి.
మీరు ఒక పురుషుడై, మరొక పురుషుని ముఖాన్ని చూసినట్లయితే ...
మీరు ఒక పురుషునిగా ఉండి మరొక పురుషుని ముఖాన్ని మొదటగా చూసినట్లయితే, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి మీరు శ్రద్ధ చూపుతారని అర్ధం. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని నిరంతరం పరితపించే వ్యక్తిగా ఉంటారు. కొత్త సంబంధాలను ఏర్పరచుకునే క్రమంలో లేదా ఉన్న సంబంధాలను పదిలపరచుకునే క్రమంలో మీ ఆలోచనలు ఉంటాయి. మీ స్నేహం, మీ తత్వం ఇతరులు ఆస్వాదించేలా ఉంటుంది. జీవితంలోని ఎటువంటి క్లిష్ట, ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొగలిగే మానసిక స్థైర్యం మీ సొంతం. మీ ప్రతి ఆలోచన వెనుకా మీ ప్రియమైన వారి సంతోషం శ్రేయస్సు ఉంటాయి.
మీరు ఒక మహిళ అయుండి మరొక మహిళ ముఖాన్ని కనుగొంటే....
మీరు ఒక మహిళ అయి ఉండి మరొక మహిళ ముఖాన్ని మొదటగా చూసిన ఎడల, మీరు మీ ఆలోచనలకు, మీ వ్యక్తిత్వానికి, మీరు కలిగి ఉన్న ఎటువంటి అంశం మీదనైనా గౌరవం కలిగిన వారిగా ఉంటారు. ఆత్మ సంతృప్తి మీ ప్రధాన లక్షణం. సమాజంలోని నిబంధనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మీకు నచ్చని అంశాలకు దూరంగా ఉండేలా మీ చర్యలు ఉంటాయి. మీకు నచ్చిన విధంగా మీ జీవితాన్ని నడపాలని భావించే వ్యక్తిగా మీ వ్యక్తిత్వం ఉన్నతంగా ఉంటుంది. కానీ, మీరు ఆశించిన రీతిలో మీ జీవితం లేని ఎడల మీరు నిరాశా నిస్ప్రుహలకు లోనవుతూ ఉంటారు.
మీరు ఒక పురుషుడు అయి ఉండి మరొక స్త్రీ ముఖాన్ని చూసిన ఎడల...
మీరు ఒక పురుషుడు అయి ఉండి, చిత్రంలో మొదటగా ఒక మహిళ ముఖాన్ని చూసిన ఎడల, మీరు మీ జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నారని అర్ధం. లేదా మీ భాగస్వామితో సరైన సంబంధాన్ని కలిగిలేరని అర్ధం. మరో పక్క, మీ భాగస్వామి విషయంలో కాస్త ఎక్కువ ప్రయత్నాలను చేస్తున్నారని అర్ధం. ముఖ్యంగా మీరు మీ మనసును సావధానపరచుకుని వర్తమానంలో జీవిoచడం మంచిదిగా సూచించబడినది. మీరు ఉన్నత ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తిగా ఉంటారు.మరియు మీ ఆలోచనలు విధానాలకు తగిన భాగస్వామి కొరకు ఎదురుచూస్తుంటారు. ఇది వరకే మీరు సంబంధంలో ఉన్న ఎడల, మరియు ఈ చిత్రంలో మొదటగా మీకు మహిళ చిత్రం కనిపించిన ఎడల, మీరు ఆశించిన స్థాయిలో మీ భాగస్వామితో సంబంధాన్ని కలిగిలేరని అర్ధం. కావున మీరు మీ భాగస్వామితో చర్చలు జరిపి మీ భావాలను అర్ధమయ్యే రీతిలో వ్యక్తపరచడం ద్వారా, సానుకూల ఫలితాలను పొందగలరు.
ఎన్నో పరీక్షల మరియు ఫలితాల అనంతరం ఈ చిత్రం గురించిన వివరాలు మీ ముందు ఉంచడం జరిగినది. అలాగని పూర్తిగా ఈ చిత్రం మీదనే మీ వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది అని చెప్పడానికి లేదు. కానీ, ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా ఇవ్వగలదు.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ, జ్యోతిష్య, రాశిచక్ర మరియు హస్త సాముద్రిక అంశాల గురించిన అనేక వివరణలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.



Click it and Unblock the Notifications











