For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇందిరాగాంధీని ఎలా చంపారు? ఇందిరాగాంధీ చనిపోయిన రోజు జరిగిన విషయాలివే! పక్కా ప్లాన్

అది 1984 అక్టోబర్‌ 31. ఆ రోజుమాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని ఆమె ఇద్దరు సిక్కు బాడీ గార్డులు కాల్చి చంపారు. ఇందిరాగాంధీని ఎలా చంపారు? ఇందిరాగాంధీ చనిపోయిన రోజు జరిగిన విషయాలివే! పక్కా ప్లాన్

|

అది 1984 అక్టోబర్‌ 31. ఆ రోజుమాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని ఆమె ఇద్దరు సిక్కు బాడీ గార్డులు కాల్చి చంపారు. పర్యవసానంగా ముందు ఢిల్లీలో, ఆ తర్వాత దేశవ్యాప్తంగా సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగాయి. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఒక్క ఢిల్లీ నగరంలోనే 2,100 మంది సిక్కులు ఊచకోతకు గురికాగా, దేశవ్యాప్తంగా 2,800 మంది ఊచకోతకు గురయ్యారు. అనధికార లెక్కల ప్రకారం ఒక్క ఢిల్లీలో మూడువేల మంది సిక్కులు, దేశవ్యాప్తంగా 8 వేల మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారన్నది అంచనా.

సరిగ్గా 9 గంటల 10 నిమిషాలకు

సరిగ్గా 9 గంటల 10 నిమిషాలకు

ఆ రోజు సఫ్దార్‌జంగ్‌ రోడ్డులోని తన అధికార నివాసం నుంచి ఇందిరాగాంధీ బయటకు వస్తుండగా ఉదయం సరిగ్గా 9 గంటల 10 నిమిషాలకు సత్వంత్‌ సింగ్, బియాంత్‌ సింగ్‌ అనే ఇద్దరు సిక్కు గార్డులు ఆటోమేటిక్‌ వెపన్ల ద్వారా ఆమెపైకి 30 తూటాలు పేల్చారు. అందులో మూడు తూటాలు ఆమెకు తగలకుండా పక్క నుంచి దూసుకుపోగా, 20 తూటాలు ఆమె శరీరంలోకి ఓ పక్కనుంచి లోపలికెళ్లి మరో పక్కనుంచి బయటకు దూసుకెళ్లాయి.

ఏడు తూటాలు ఆమె శరీరంలోకి

ఏడు తూటాలు ఆమె శరీరంలోకి

ఏడు తూటాలు ఆమె శరీరంలోకి వెళ్లాయి. తొమ్మిదిన్నర ప్రాంతంలో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమె మరణాన్ని ఆస్పత్రి వర్గాలు ఆరోజు మధ్యాహ్నం 2.20 గంటలకు ధ్రువీకరించాయి. ఆరోజు సాయంత్రం వార్తల్లో దూరదర్శన్‌ ఇందిరాగాంధీ మరణాన్ని అధికారికంగా ప్రకటించింది.

అసలు కథ వివరంగా....

అసలు కథ వివరంగా....

ఆ రోజు ఉదయం ఏడున్నరకల్లా ఇందిరాగాంధీ తయారయ్యారు. ఆ రోజు ఆమె నల్లటి అంచున్న కాషాయ రంగు చీర కట్టుకున్నారు. ఆ రోజు మొదటి అపాయింట్‌మెంట్ పీటర్ ఉస్తీనోవ్‌తో. ఆయన ఇందిరా గాంధీపై ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారు. ఒక రోజు ముందు జరిగిన ఒడిశా పర్యటనలో కూడా ఉస్తీనోవ్ ఆమెను షూట్ చేశారు.

ఎండ పడకుండా ఉండేందుకు

ఎండ పడకుండా ఉండేందుకు

మధ్యాహ్నం ఆమె బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి జేమ్స్ కాలెఘన్‌నూ, మిజోరం నాయకుడొకరినీ కలవాల్సి ఉంది. ఆ రాత్రి ఆమె బ్రిటన్ రాకుమారి యాన్‌కు విందు ఇవ్వాల్సి ఉంది. తొమ్మిది గంటల 10 నిమిషాలకు ఆమె బయటికి వచ్చినప్పుడు ఎండ తీవ్రంగా ఉంది. ఆమెపై ఎండ పడకుండా ఉండేందుకు ఓ సైనికుడు నారాయణ్ సింగ్ నల్లరంగులో ఉన్న గొడుగును పట్టుకొని ఆమె పక్కన నడుస్తున్నారు.

రామేశ్వర్ దయాళ్

రామేశ్వర్ దయాళ్

ఆమెకు కాస్త వెనకాల ఆర్కే ధావన్, ఇందిరా గాంధీ వ్యక్తిగత సహాయకులు నాథు రామ్ ఇంకాస్త వెనుక ఉన్నారు.అందరికన్నా వెనుక ఆమె ప్రైవేట్ సెక్యూరిటీ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ రామేశ్వర్ దయాళ్ ఉన్నారు. అప్పుడే ఆమె ముందు నుంచి ఓ సహాయకుడు టీ సెట్ పట్టుకొని అక్కడి నుంచి వెళుతుంటే ఇందిరా గాంధీ అతన్ని పిలిచి ఉస్తీనోవ్‌ కోసం మరో టీ సెట్ తీసుకురమ్మని చెప్పారు.

రాష్ట్రపతిని సాయంత్రం 7గంటల కల్లా వచ్చేయాలని చెప్పాను

రాష్ట్రపతిని సాయంత్రం 7గంటల కల్లా వచ్చేయాలని చెప్పాను

ఇందిరా గాంధీ అక్బర్ రోడ్ వైపు నుంచి వికెట్‌ గేట్ వైపు వెళుతున్నప్పుడు ఆమె ధావన్‌తో మాట్లాడుతున్నారు.ధావన్ ఇందిరా గాంధీతో మాట్లాడుతూ, మీరు చెప్పిన విధంగా యెమెన్ పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతిని సాయంత్రం 7గంటల కల్లా వచ్చేయాలని చెప్పానని అన్నారు. దిల్లీలోని పాలం రోడ్డులో ఉన్న ఎయిర్ పోర్టు నుంచి మిమ్మల్ని రిసీవ్ చేసుకొని ఇందిరా గాంధీకి బ్రిటన్ రాజకుమారి యాన్‌తో విందులో పాల్గోవాల్సి ఉందని చెప్పానని అన్నారు.

బియాంత్ సింగ్ రివాల్వర్ కాల్పులు జరిపాడు

బియాంత్ సింగ్ రివాల్వర్ కాల్పులు జరిపాడు

అలా మాట్లాడుతున్నప్పుడే అకస్మాత్తుగా అక్కడ డ్యూటీలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు బియాంత్ సింగ్ రివాల్వర్ తీసి ఇందిరా గాంధీపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆమె కడుపులో దిగింది. బియాంత్ సింగ్ పాయింట్ బ్లాంక్ రేంజిలో మరో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఆమె భుజం, గుండె, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి.

సత్వంత్ సింగ్ దిగ్భ్రాంతి చెంది

సత్వంత్ సింగ్ దిగ్భ్రాంతి చెంది

అక్కడి నుంచి ఐదడుగుల దూరంలో సత్వంత్ సింగ్ తన థామ్సన్ ఆటో కార్బైన్ గన్ పట్టుకొని అక్కడే నిలబడి ఉన్నారు. ఇందిరా గాంధీ కిందపడుతున్నప్పుడు సత్వంత్ సింగ్ దిగ్భ్రాంతి చెంది అక్కడి నుంచి కదలలేకపోయారు. అప్పుడే బియాంత్ సింగ్ కాల్పులు జరపమని గట్టిగా అరిచాడు.

మొత్తం బుల్లెట్లను ఇందిరా గాంధీ శరీరంలోకి

మొత్తం బుల్లెట్లను ఇందిరా గాంధీ శరీరంలోకి

సత్వంత్ సింగ్ వెంటనే తన థామ్సన్ ఆటో కార్బైన్‌లో ఉన్న మొత్తం బుల్లెట్లను ఇందిరా గాంధీ శరీరంలోకి దించేందుకు ప్రయత్నించారు. బియాంత్ సింగ్ మొదటిసారి కాల్పులు జరిపిన 25 సెకండ్ల తర్వాత కూడా అక్కడున్న భద్రతా దళాలు స్పందించలేదు. సత్వంత్ కాల్పులు జరపడం మొదలుపెట్టిన తర్వాత అందరికన్నా వెనకాల నడుస్తూ వచ్చిన రామేశ్వర్ దయాళ్ ముందుకు పరిగెత్తడం మొదలుపెట్టారు.

రామేశ్వర్ దయాళ్ పై సత్వంత్ కాల్పులు

రామేశ్వర్ దయాళ్ పై సత్వంత్ కాల్పులు

కానీ రామేశ్వర్ దయాళ్ఇందిరా గాంధీ దగ్గరకు చేరుకోక ముందే తొడ, కాళ్లపై సత్వంత్ జరిపిన కాల్పులతో కిందపడిపోయారు. అక్బర్ రోడ్‌లో ఉండే ఓ పోలీస్ అధికారి దినేష్ కుమార్ భట్ ఎందుకీ అరుపులు కేకలు వస్తున్నాయని బయటికి వచ్చారు. అప్పుడే బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ తమ ఆయుధాలను కింద పడేసి ఇలా అన్నారు "మేమేం చేయాలనుకున్నామో చేసేశాం. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి."

బియాంత్‌సింగ్ ను ప్రత్యేక గదిలో కాల్చి చంపారు

బియాంత్‌సింగ్ ను ప్రత్యేక గదిలో కాల్చి చంపారు

అప్పుడే నారాయణ్ సింగ్ ముందుకొచ్చి బియాంత్ సింగ్‌ను కింద పడేశాడు. దగ్గరలో ఉన్న ఓ రూమ్ నుంచి ఐటిబీపీ దళాలు పరిగెత్తుకొచ్చి సత్వంత్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నాయి. తరువాత ఆరు నిమిషాలలో ఇండో టిబిటన్ బోర్డర్ పోలీసుకు సంబంధించిన సైనికులైన తార్సెమ్‌సింగ్ జమ్వాల్, రామ్‌శరణ్ లు వారిని పట్టుకున్నారు. బియాంత్‌సింగ్ ను వారు ప్రత్యేక గదిలో కాల్చి చంపారు. బియాంత్ సింగ్ ఆ గదిలో ఉన్న అధికారులపై కాల్పులు జరపడానికి ప్రయత్నించినందుకు గానూ అతనిని కాల్చి చంపారు. సత్వంత్ సింగ్ ను 1989లో ఉరి తీశారు.

సోనియా గాంధీ చెప్పుల్లేకుండా తన డ్రెస్సింగ్ గౌన్‌తోనే

సోనియా గాంధీ చెప్పుల్లేకుండా తన డ్రెస్సింగ్ గౌన్‌తోనే

ఇందిరా గాంధీని ఆర్కే ధావన్, భద్రతా అధికారి దినేష్ ఇద్దరూ అక్కడి నుంచి లేపి తెల్లటి అంబాసిడర్ కారు వెనుక సీటులో పడుకో బెట్టారు. ముందు సీట్లో ధావన్, ఫోతేదార్, డ్రైవర్ ముగ్గురూ కూర్చున్నారు. కారు కాస్త ముందుకెళ్లిన తర్వాత సోనియా గాంధీ చెప్పుల్లేకుండా తన డ్రెస్సింగ్ గౌన్‌తోనే పరిగెత్తుకుని వచ్చారు. ర‌క్త‌పు మడుగులో ఉన్న ఇందిర తలను సోనియా గాంధీ తన ఒడిలో పెట్టుకున్నారు. కారు వేగంగా ఎయిమ్స్ వైపు వెళ్ళింది. ఆసుపత్రిలో వెంటనే ఇందిరా గాంధీ శరీరంలోకి 80 బాటిళ్ల రక్తాన్ని ఎక్కించారు. అది ఆమె శరీరంలో ఉన్న రక్తానికి ఐదు రెట్లు ఎక్కువ.

కాల్పులు జరిపిన నాలుగు గంటల తర్వాత ప్రకటించారు

కాల్పులు జరిపిన నాలుగు గంటల తర్వాత ప్రకటించారు

ఆమె చనిపోయారని తెలిసినా ఎయిమ్స్ ఎనిమిదో అంతస్తుపై ఉన్న ఆపరేషన్ థియేటర్‌లో ఆమెను తీసుకెళ్లారు.ఇందిరా గాంధీ మరణించారని కాల్పులు జరిపిన నాలుగు గంటల తర్వాత ప్రకటించారు. ఇలా బియాంత్, సత్వంత్ ఇద్దరూ ఒకేచోట ఉండి ఆపరేషన్ బ్లూ స్టార్ కి ఇందిరా గాంధీపై ప్రతీకారం తీర్చుకున్నారు.

రాజీవ్‌ గాంధీ పశ్చిమ బెంగాల్‌ టూర్‌లో

రాజీవ్‌ గాంధీ పశ్చిమ బెంగాల్‌ టూర్‌లో

ఇందిగాంధీ హత్య జరిగిన రోజున రాజీవ్‌ గాంధీ పశ్చిమ బెంగాల్‌ టూర్‌లో ఉన్నారు. రాష్ట్రపతి జ్ఞాని జైల్‌ సింగ్‌ విదేశీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర హోం మంత్రి పీవీ నరసింహారావు ఢిల్లీలోనే ఉన్నారు. రాజీవ్‌ గాంధీ నాలుగు గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోగా, ఐదు గంటల ప్రాంతంలో జైల్‌ సింగ్‌ ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత గంటలోపలే రాజీవ్‌ గాంధీ ప్రధాన మంత్రిగా రాష్ట్రపతి చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు.

English summary

Indira Gandhis assassination Shocking story behind why Iron Ladys trusted bodyguards turned assailants

Indira Gandhis assassination Shocking story behind why Iron Ladys trusted bodyguards turned assailants
Story first published:Wednesday, July 11, 2018, 10:56 [IST]
Desktop Bottom Promotion