రెంట్ ఫర్ సెక్స్ : రోజూ పక్కకు వస్తే చాలు.. అద్దె వద్దు.. యువతులకు ఆఫర్ ఇస్తోన్న ల్యాండ్ లార్డ్స్

Written By:
Subscribe to Boldsky

మనం రకరకాల ప్రకటనలు చూసి ఉంటాం. డ్రైవర్లు కావాలి.. టీచర్లు కావాలి.. వరుడు కావాలి.. ఇల్లు అద్దెకు ఇస్తాం.. ఇల్లు అమ్ముతాం... ఇలా వందల రకాల యాడ్స్ పేపర్లలో వస్తుంటాయి. కానీ మీకు ఇల్లు అద్దెకు కావాలంటే మాతో సెక్స్ లో పాల్గొనండి... రెంట్ ఫర్ సెక్స్ అనే ప్రకటనలను మాత్రం అస్సలు చూసి ఉండం.

రెంట్ ఫర్ సెక్స్ rent for sex

రెంట్ ఫర్ సెక్స్ rent for sex

కానీ ఇంగ్లడ్ లోని లండన్ లో ప్రధాన పత్రికల్లో, వెబ్ సెట్లలో ఇలాంటి యాడ్స్ రోజూ వస్తూ ఉంటాయి. ఇంటి అద్దె అవసరం లేదు.. కాకపోతే మాతో సెక్స్ కు ఒప్పుకోండి చాలు.. అందూ కొందరు ఇంటి యజమానులు పబ్లిక్ గ్గా ప్రకటనలు ఇస్తున్నారు.

ఒంటరిగా ఉండే వారే టార్గెట్

ఒంటరిగా ఉండే వారే టార్గెట్

ఒంటరిగా ఉండే మహిళల్ని టార్గెట్ చేసి ఇలాటి ప్రకటనలు ఇస్తున్నారు ఇంటి యజమానులు. వాస్తవానికి ఇలాంటి ప్రతిపాదనలు పంపడం.. ప్రకటనలు ఇవ్వడం కూడా నేరాల జాబితాలోకే వస్తాయి.

సెక్స్ కు ఒకే అనుకుని..

సెక్స్ కు ఒకే అనుకుని..

కానీ ఈ ప్రతిపాదనల గురించి ఫిర్యాదు చేసేవారు ఎవరూ లేరు. కొందరు రెంట్ ఫర్ సెక్స్ కు ఒకే అనుకుని ఇళ్లల్లో చేరిపోతున్నారు. మరికొందరు మౌనంగా ఉంటున్నారు.

బాగా పెరిగిపోయింది

బాగా పెరిగిపోయింది

ఈ సమస్య తీవ్రత ఇప్పుడు ఇంగ్లాడ్ లో బాగా పెరిగిపోయింది. దీనిపై బీబీసీ వార్తా సంస్థ డాక్యుమెంటరీలు తీసే భాగంగా కొన్ని ఇన్వేస్టిగేషన్స్ కూడా చేసింది.

వేల మంది

వేల మంది

ఇంటి నుంచి బయటకొచ్చి నిరాశ్రయురాలైన 14 ఏళ్ళ యువతి రెంట్ ఫర్ సెక్స్ కు అంగీకరించాల్సి వచ్చింది. అలాగే క్లో అనే 18 ఏళ్ల అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు ఆమె రిలేషన్ గురించి తెలిసి ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించారు. ఆ సమయంలో క్లో లండన్ లో ఇంటి కోసం వెతకడం మొదలుపెట్టింది.

అద్దెకు బదులుగా సెక్స్

అద్దెకు బదులుగా సెక్స్

క్లో (చోలే) పేపర్లలో ప్రకటనలు చూసింది. అందులో ఒక ప్రకటన కనపడింది. ఇంటి రూఫ్ పై ఉన్న గది ఇవ్వడానికి ఒక ఇంటి యజమాని రెడిగా ఉన్నాడు. కానీ ఇంటి అద్దెకు బదులుగా అతని దగ్గర పడుకుంటేనే క్లో కు ఇంట్లో ఉండే అవకాశం లభిస్తుంది.

అండర్ కవర్ స్టోరీ

అండర్ కవర్ స్టోరీ

ఇక బీబీసీ త్రీ విలేఖరి ఎలీ ఫ్లిన్ రెంట్ ఫర్ సెక్స్ పై ఒక అండర్ కవర్ స్టోరీ చేయడానికి ప్లాన్ చేసింది. ఫ్లిన్ కేవలం ఈ రెంట్ ఫర్ సెక్స్ కు సంబంధించిన విషయాలపై పరిశోధన చేసే క్రమంలో ల్యాండ్ లార్డ్స్ మాటలు విని షాక్ తినింది.

అద్దె లేకుండానే ఉండు

అద్దె లేకుండానే ఉండు

ఇక బీబీసీ త్రీ ప్రతినిధి చేసిన ఇన్వెస్టిగేషన్ ఇలా ఉంది..

తూర్పు లండన్‌లో తన ఇంట్లో ఆశ్రయం ఇస్తానని చెప్పిన ఒక వ్యక్తి ఆమెకు ఎలాంటి అద్దె లేకుండా తన ఇంట్లో ఉండమని చెప్పాడు. రెంట్ కు బదులుగా తనతో సెక్స్‌కు ఒప్పుకోవాలన్నాడు.

నర్సుగా పని చేస్తాను

నర్సుగా పని చేస్తాను

ఆమె అసలు పేరు బయట పెట్టకుండా యూకేలో ఎంతమంది ఇంటి యజమానులు ఇలాంటి ప్రతిపాదనలు చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంది. తనకు ఇల్లు అద్దెకు కావాలని, తన వయసు 24 ఏళ్లు అని తాను నర్సుగా పనిచేస్తున్నాని ఒకరికి ఫోన్ చేసింది.

నాతో పాటే ఉండండి

నాతో పాటే ఉండండి

అయితే తాను స్నేహితులతో కలసి ఒక ఇంట్లో ఉంటున్నానని, మీరు కూడా నాతో ఉండొచ్చని అతను చెప్పాడు. తన రూంమేట్స్‌తో ఏ సమస్య ఉండదని అన్నాడు. ఆమెని తన గర్ల్‌ ఫ్రెండ్‌గా వారికి పరిచయం చేస్తానన్నాడు.

చాలా మంది రెంట్ ఫర్ సెక్స్ ప్రతిపాదనలు

చాలా మంది రెంట్ ఫర్ సెక్స్ ప్రతిపాదనలు

దానికి ఆమె అంగీకరించకపోవడంతో ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు. అతనొక్కడే కాదు చాలా మంది రెంట్ ఫర్ సెక్స్ ప్రతిపాదనలు తన ముందు ఉంచాడు. బాగా పేరున్న ఒక క్లాసిఫైడ్ వెబ్‌సైట్‌లో వెతికితే ఇలాంటి ప్రతిపాదనలు ఒక డజన్ కనిపించాయి.

అవన్నీ యూకే నుంచి వచ్చినవే

అవన్నీ యూకే నుంచి వచ్చినవే

ఆ ప్రకటలన్నీ యూకే నుంచి వచ్చినవే. దేశంలోని పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు అన్ని చోట్ల నుంచి ఇలాంటి ప్రకటనలు కనిపించాయి. ఇక వాటన్నింటిపై ఆమె ఫోకస్ పెట్టింది.

బాడీ, బ్రా సైజు అడిగారు

బాడీ, బ్రా సైజు అడిగారు

ఆమె వారితో నేరుగా మాట్లాడడానికి ప్రయత్నించింది. కొన్ని నిమిషాల్లోనే ఆమెకు ఒకరు రిప్లై ఇచ్చారు. ఇంటి కోసం అడిగితే ఆమె బాడీ, బ్రా సైజు అడిగారు. ఇంకో వ్యక్తి మనం వాట్సాప్‌లో ఎందుకు చాట్ చేయకూడదు అని ప్రశ్నించాడు.

ప్రతి ఒక్కరూ రెంట్ ఫర్ సెక్స్ కింద ఆఫర్ ఇచ్చారు

ప్రతి ఒక్కరూ రెంట్ ఫర్ సెక్స్ కింద ఆఫర్ ఇచ్చారు

ఇలాంటి ప్రతిపాదలనతో వచ్చిన కొంతమంది ఇంటి యజమానులను ప్రత్యక్షంగా కలుసుకోడానికి సిద్ధమైంది ఆమె. వాళ్ల ఆలోచన ధోరణి చూస్తే ఆమెకు ఆశ్చర్యమేసింది. ఒకరికి నిండా 24 ఏళ్లు కూడా ఉండవు. ఇంకో వ్యక్తి తన కూతురు పడక గదిని ఉచితంగా వాడుకోమని చెప్పాడు. ఇలా ప్రతి ఒక్కరూ రెంట్ ఫర్ సెక్స్ కింద ఆమెకు ఇళ్ల ఆఫర్లు ఇచ్చారు.

రెండు రోజులకొకసారి సెక్స్‌

రెండు రోజులకొకసారి సెక్స్‌

ఇక ఒక 24 ఏళ్ల కుర్రాడు తనతో రెండు రోజులకొకసారి సెక్స్‌లో పాల్గొనాలని ఆమెకు షరతు పెట్టాడు. ఏ గూడు లేని యువతులకు ఇలాంటి వారి వల్ల ఎలాంటి పరిస్థితి వస్తుందోనని ఆమెకు అర్థం అయ్యింది. ఒక మహిళను ఇలా డైరెక్ట్ గా నాతో సెక్స్ లో పాల్గొంటావా? అని అడిగితే ఆమె ఎంత ఇబ్బంది పడుతుందనే విషయం వాళ్లు ఆలోచించడం లేదని ఆమె బాధపడింది.

తప్పే కాదు

తప్పే కాదు

నిజానికి, చాలా మంది ఇంటి యజమానులు రెంట్ ఫర్ సెక్స్ అనేది తప్పే కాదని భావిస్తున్నారు. కానీ, ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం చట్ట వ్యతిరేకం. రెంట్ ఫర్ సెక్స్ ప్రకటనలు వ్యభిచారం లాంటిదే అవుతుంది. ఇలాంటి నేరాలకు ఇంగ్లాండ్‌, వేల్స్‌లో 7 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు.

పరస్పర లైంగిక ఒప్పందం వల్లే

పరస్పర లైంగిక ఒప్పందం వల్లే

ఇక ఇంటి యజమానులైతే తాము ఏమి తప్పు చేయడం లేదని పరస్పర లైంగిక ఒప్పందం వల్లే తాము సెక్స్ లో పాల్గొన్నామని ఆమెకు సమాధంన ఇచ్చాడు. తానేమీ తప్పు చేయలేదని సమర్థించుకున్నాడు. ఇంకో వ్యక్తి అలాంటి ఉద్దేశమే తనకు లేదని, కలిసి ఉందామని మాత్రమే ప్రతిపాదించానని చెప్పాడు.

నిరాకరించింది

నిరాకరించింది

ఇక 20 ఏళ్ల ఒక యువతిని ఆమె కలిసింది. ఆమెకు ఇంటి యజమానిని కలిసే వరకు కూడా ఈ రెంట్ ఫర్ సెక్స్ అగ్రిమెంట్ గురించి తెలియదు. విషయం తెలియగానే ఆమె ఆ ఇంట్లో ఉండటానికి నిరాకరించింది.

తాకడానికి ప్రయత్నించాడు

తాకడానికి ప్రయత్నించాడు

ఇంటి యజమానితో సెక్స్ లో పాల్గొనాలనే విషయం నాకు తెలియదు. దానికి నేను అంగీకరించలేదు. అతను పదే పదే నన్ను తాకడానికి ప్రయత్నించాడు. కానీ, నాపై ఒత్తిడి చేయలేదంటూ బీబీసీ ప్రతినిధికి వివరించింది.

కంపెనీ ఇస్తే చాలు

కంపెనీ ఇస్తే చాలు

ఇక న్యూకాస్టేలోని ఒక ఇంటి యజమాని ఉచితంగా బీబీసీ ప్రతినిధి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆమెకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. తాను ఒంటరిని, తనకు కంపెనీ ఇస్తే చాలు అన్నాడు. అంటే అది కూడా రెంట్ ఫర్ సెక్స్ లాంటిదే.

తనతో పడుకుంటే చాలు

తనతో పడుకుంటే చాలు

ఇక 650 బ్రిటన్ పౌండ్లు(భారత కరెన్సీలో దాదాపు 58000 రూపాయలు) అద్దెకు తన వద్ద ఇళ్ళు ఉందని ఓ భూస్వామి పేపర్ లో ప్రకటన ఇచ్చాడు. అది తెలుసుకొని ఓ యువతి అతడిని ఆశ్రయించింది. అయితే ఆ వ్యక్తి తనకు డబ్బులు మాత్రమే చెల్లించాల్సిన అవసరం లేదని.. కావాలనుకుంటే తనతో పడుకోవచ్చని చెప్పాడు.

అంతా రికార్డ్

అంతా రికార్డ్

ఈ మొత్తం మీటింగ్ ఓ రెస్టారెంట్ లో జరిగింది. అలాగే అంతా ఓ కెమెరాలో రికార్డు చేశారు. సియాన్ థామస్ అనే రిపోర్టర్ ఆ వ్యక్తిని కలవగా తన వక్రబుద్ధిని బయటపెట్టాడు అతడు.

వారానికొకసారి గడుపు

వారానికొకసారి గడుపు

తనతో వారానికి ఒకసారి గడిపితే చాలని.. అంతే తప్పని నిన్ను భయపెట్టనని.. వేధించనని ఆ వ్యక్తి స్టింగ్ ఆపరేషన్ లో బయటపెట్టాడు. ఈ స్టింగ్ ఆపరేషన్ లో తాను అడ్డంగా దొరికిపోయానని భావించిన ఆ ఇంటి యజమాని టీవీలో ప్రసారం చేయవద్దని వారితో ప్రాథేయపడ్డాడు.

Image Credit& News Source

Source

English summary

inside the sleazy world of rent for sex landlords

inside the sleazy world of rent for sex landlords
Story first published: Friday, March 9, 2018, 12:15 [IST]