For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిఫా వరల్డ్ కప్ పోటీలతో పాటు ప్రపంచస్థాయి పోటీల్లో ఫస్ట్ టాఫిక్ శృంగారమే

31 రోజులు... 64 మ్యాచ్‌లతో జరిగే విశ్వ క్రీడా సంరంభం సాకర్‌ ప్రపంచ సమరం ఆరంభం కానుంది. 2018 ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్‌ల కోసం రష్యాలోని 12 స్టేడియాలను ముస్తాబు చేశారు. ఫిఫా వరల్డ్ కప్ పోటీలు

|

నేటి నుంచే ఫిఫా వరల్డ్‌కప్‌ 2018 ప్రారంభం కానుంది. ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత్‌ పాల్గొనకపోయినప్పటికీ మన దేశంలో కూడా చాలా మంది ఆ పోటీలను చూస్తారు. అయితే
ఫిఫా వరల్డ్‌కప్‌ 2018కు సంబంధించి ఆటకు సంబంధం లేకుండా కొన్ని విషయాలు రోజూ వార్తల్లో నిలుస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడలు జరిగినా కండోమ్‌, సెక్స్ గురించే వినిపిస్తూ ఉంటుంది. ఇవి మన దేశంలో చాలా అరుదుగా మాత్రమే వినిపిస్తుంటాయి. అఫ్‌కోర్స్‌.. ఈ మధ్యకాలంలో బాగానే ప్రాచుర్యం పొందుతోందనుకోండి. సెక్స్‌, శృంగారం.. అన్న విషయం గురించి గట్టిగా మాట్లాడాలంటే మన దేశంలో చాలామందికి బెరుకు. కానీ వెస్ట్రన్ కల్చర్ వల్ల ఇక్కడ కూడా విచ్చలవిడి శృంగారం ఎక్కువైపోయింది.

విదేశాల్లో శృంగారానికి హద్దులే వుండవు. దీంతో ఒలింపిక్స్, ఫిఫా వరల్డ్ కప్ (సాకర్) వంటి పోటీల్లో కండోమ్ లకు సంబంధించిన చర్చ నడుస్తూ ఉంటుంది. ఇలాంటి పోటీలు ప్రారంభవుతున్నాయంటే సెక్స్, కండోమ్ ల గురించే రోజూ వార్తలు వస్తుంటాయి.

కండోమ్‌ల వ్యాపారం

కండోమ్‌ల వ్యాపారం

ఇలాంటి క్రీడల్లో క్రీడాకారులు పతకాలు సాధిస్తాడు.? ఏ దేశం అత్యధికంగా పతకాల్ని పట్టుకుపోతుంది.? ఈ క్రీడా పండుగలో ఎలాంటి రికార్డులు నమోదవుతాయి.? అన్న అంశాలతోపాటు, కండోమ్‌ల వ్యాపారం సృష్టించే రికార్డుల మాటేమిటి.? అనే చర్చ కూడా గట్టిగానే జరుగుతూ ఉంటుంది.

విచ్చలవిడి శృంగారం

విచ్చలవిడి శృంగారం

గతంలో రియోడిజనరోలో జరిగిన ఒలింపిక్ వేడుకల్లో విచ్చలవిడి శృంగారం హాట్‌ టాపిక్‌ గా మారిన విషయం తెలిసిందే. ప్రపంచ స్థాయి పోటీలు ప్రారంభమైనప్పుడు కండోమ్‌ల వ్యాపారం చుట్టూనే ఇంత చర్చ జరుగుతోందంటే ఇక వ్యభిచార కార్యకలాపాల మాటేమిటి.? ఇక, దాని గురించి ఎంత చర్చించుకున్నా తక్కువే.

రోజూ రెండు కండోమ్‌లు

రోజూ రెండు కండోమ్‌లు

రియో వేదికగా గతంలో జరిగిన ఒలింపిక్స్ లో ఆటగాళ్ళకు రోజూ రెండు కండోమ్‌లు సరఫరా చేసేవారు. ఆ లెక్కన మొత్తం ఆటగాళ్ళ కోసం లక్షల సంఖ్యలో కండోమ్‌లు కూడా అప్పుడు సిద్ధం చేశారు. దాదాపు 90లక్షలకు పైగా కండోమ్స్ ను అప్పట్లో సిద్ధం చేశారు. మహిళా కండోమ్ లను కూడా అపట్లో అందుబాటు లో ఉంచారు. క్రీడాకారుల సురక్షిత శృంగారం కోసమే అలాంటి నిర్ణయం తీసుకున్నట్టు అప్పట్లో ఐఓసీ పేర్కొంది.

విదేశీయులతో శృంగారం వద్దు

విదేశీయులతో శృంగారం వద్దు

ఇక సాకర్‌ వరల్డ్‌ కప్‌ సందర్భంగా రష్యా మహిళలు శ్వేతజాతియేతర విదేశీయులతో శృంగారంలో పాల్గొనకూడదని ఆ దేశ ప్రజాప్రతినిధి ఒకరు సూచించిన విషయం ఇప్పుడు బాగా హాట్ టాఫిక్ గా మారింది. శ్వేతజాతియేతర విదేశీయులతో లైంగిక సంబంధం పెట్టుకుంటే.. మిశ్రమ జాతి (మిక్స్‌డ్‌ రేస్‌) పిల్లలతో సింగిల్‌ మదర్‌గా మహిళలు మిగిలిపోయే అవకాశముందని అన్నారు.

తమరా ప్లెట్‌న్యోవా

తమరా ప్లెట్‌న్యోవా

రష్యా మహిళలు విదేశీయులతో చేసుకుంటున్న వివాహ సంబంధాలు దారుణంగా దెబ్బతింటున్నాయని, రష్యా మహిళలు విదేశాల్లో చిక్కుకుపోవడం, లేదా వారు దేశంలో ఉంటే.. వారి పిల్లలు విదేశాల్లో ఉండటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని సీనియర్‌ చట్టసభ సభ్యురాలు, కుటుంబ వ్యవహారాలు, మహిళా శిశు పార్లమెంటు కమిటీ చైర్మన్‌ తమరా ప్లెట్‌న్యోవా అన్నారు. ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మాస్కో ఒలింపిక్స్‌ సందర్భంగా

మాస్కో ఒలింపిక్స్‌ సందర్భంగా

1980లో మాస్కో ఒలింపిక్స్‌ సందర్భంగా విదేశీయులతో సంబంధాల కారణంగా రష్యా మహిళలు పిల్లలను కన్నారు. అప్పట్లో గర్భనిరోధక పద్ధతులు అంతగా అందుబాటులో లేకపోవడంతో ఇలా పుట్టిన చిన్నారులు ‘ఒలింపిక్‌ పిల్లలు'గా ముద్రపడ్డారు. అంతర్జాతీయ క్రీడల సందర్భంగా ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, ఆసియా పురుషులతో సంబంధాల వల్ల రష్యా మహిళలకు పుట్టిన శ్వేతజాతియేతర పిల్లలను పిలిచేందుకు సోవియట్‌ హయాంలో ఈ పదాన్ని వాడేవారు. ఈ పిల్లలు రష్యాలో వివక్షను ఎదుర్కొన్నారు.

శృంగారాన్ని పక్కన పెట్టండి

శృంగారాన్ని పక్కన పెట్టండి

ఇక మెక్సికో జట్టు ఫుట్‌బాల్ ఆటగాళ్లకు మెక్సికో కోచ్, మేనేజర్ మిగ్వెల్ హెరీరా కూడా ఒక సూచన ఇచ్చాడు. ప్రపంచకప్ జరుగుతున్నంత కాలంపాటు ఆట మీదే మనసు పెట్టాలని.. శృంగారాన్ని పక్కన పెట్టండని చెప్పాడు. ఓ నెల రోజులు శృంగారంలో పాల్గొననంత మాత్రాన ఎవరూ చనిపోయే ప్రమాదమేమి లేదని కాస్త ఘాటుగానే చెప్పాడు.

31 రోజులు... 64 మ్యాచ్‌లు

31 రోజులు... 64 మ్యాచ్‌లు

ఇక 31 రోజులు... 64 మ్యాచ్‌లతో జరిగే విశ్వ క్రీడా సంరంభం సాకర్‌ ప్రపంచ సమరం ఆరంభం కానుంది. 2018 ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్‌ల కోసం రష్యాలోని 12 స్టేడియాలను ముస్తాబు చేశారు. ఆ 12 మైదానాలు ఇవే. మొత్తం 11 నగరాల్లో ఫుట్‌బాల్‌ మహా సంగ్రామం ఉండనుంది. 1. లుజ్నికి స్టేడియం(మాస్కో) 2. స్పార్టక్ స్టేడియం(మాస్కో) 3. నిజ్నీ నోవ్గోరోడ్ స్టేడియం 4. మోర్డోవియా అరేనా 5. కజన్ అరేనా 6. సమర అరేనా 7. యెకటెరిన్‌బర్గ్ అరేనా 8. సెయింట్ పీటర్స్ బర్గ్ స్టేడియం 9. కలినింగ్రాడ్ స్టేడియం 10 . వొల్గోగ్రాడ్ అరేనా 11. రోస్టోవ్ అరేనా 12. ఫిష్ట్ స్టేడియం.

రష్యా, సౌదీ అరేబియా మధ్య

రష్యా, సౌదీ అరేబియా మధ్య

ఆతిథ్య రష్యా, సౌదీ అరేబియా మధ్య తొలి పోరు ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ రంజుగా సాగే మ్యాచ్‌లతో అభిమానులకు పసందైన విందు ఉంటుంది. ఇక ప్రపంచమంతా సాకర్ పోటీలను తిలికించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వివిధ దేశాల నుంచి వచ్చే క్రీడాకారులు, వారి మద్దతుదారుల సందడిలో మైదనాలు తడిసి ముద్దవనున్నాయి.

పనిలోపనిగా ఆయా మైదానాలకు సమీపంలో సెక్స్‌ బిజినెస్‌ కూడా బాగానే నడవనుందట.

అంతా సెక్స్ కార్యాకళాపాలే

అంతా సెక్స్ కార్యాకళాపాలే

ఫిఫా వరల్డ్ కప్ 2018 పోటీల్లో భాగంగా జరిగే సెక్స్ కార్యాకళాపాలే ఇప్పుడు చాలా పతాక శీర్షికలవుతున్నాయంటే అక్కడ యవ్వారం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. క్రీడాకారలు ఎక్కువ ఒత్తిడికి లోనై సెక్స్ కోరుకుంటారని అందుకే ప్రపంచ వ్యాప్త క్రీడా పోటీలు జరిగినప్పుడు ఈ టాఫిక్ వస్తుంటుందని కొందరు అంటుంటారు.

English summary

interesting facts about the fifa world cup 2018

interesting facts about the fifa world cup 2018
Story first published:Thursday, June 14, 2018, 12:39 [IST]
Desktop Bottom Promotion