For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొట్టమొదటి “గాల్లో ఎగిరే స్కూటర్” తయారుచేసిన చైనీస్ వ్యక్తి

మొట్టమొదటి “గాల్లో ఎగిరే స్కూటర్” తయారుచేసిన చైనీస్ వ్యక్తి

|

ఒక చైనా ఔత్సాహికుడు తన ఇంట్లో ఆవిష్కరించిన "గాలిలో ఎగిరే స్కూటర్" నేడు ఇంటర్నెట్లో ఒక వైరల్ అయింది. దీనిని ప్రపంచంలోనే మొట్టమొదటి "ఎగిరే స్కూటర్" వలె పేర్కొన్నాడు.

చైనాలో ఒక గ్రామీణ ప్రాంతంలో జన్మించిన‌ జావో డెలి, బాల్య వయసు నుండే గాలిలో ఎగిరే స్కూటర్ తయారుచేయాలన్న కోరికను కలిగి ఉండే వాడని స్థానిక మీడియా తెలిపింది.

తన కోరికకు తగ్గట్లుగా పట్టుదలతో అలుపెరుగని పోరాటం చేసిన ఈ నలభై ఏళ్ల వ్యక్తి చివరగా ఊహకందని విజయాన్ని రుచి చూశాడు.

ఈ వీడియోలో కనిపిస్తున్న జావో డెలి, తనకు తానుగా ఈ యంత్రాన్ని అధిరోహించి చేసిన ప్రయోగం నేడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల మన్ననలు పొందుతూ ఉంది. ఈ ప్రయోగాన్ని డాంగ్గువాన్ సిటీ, గుయాంగ్డాంగ్ ప్రావిన్సు, చైనాలో రికార్డు చేయబడినది.

తన, “గాలిలో ఎగిరే స్కూటర్” యొక్క పనితనాన్ని ప్రపంచానికి చూపే ప్రయత్నంలో భాగంగా, ఓకే సీట్ తో కూడిన, జైంట్ క్వాడ్కాప్టర్ డ్రోన్ వలె కనిపిస్తున్న ఆ వాహనం మీద ఎక్కి ప్రయాణించినట్లుగా వీడియో రికార్డ్ చేయడం జరిగింది.

Inventor Creates The First Flying Scooter


ఇక వాహనం విషయానికి వస్తే, జావో డెలి చెప్పిన వివరాల ప్రకారం, ఈ వాహనం 220 పౌండ్ల బరువుతో, గంటకు 45 మైళ్ళ వేగంతో ముందుకు సాగగలదు. మధ్య విభాగానికి అనుసంధానించబడిన ఫ్లయింగ్ స్కూటర్ ప్రొపెల్లర్స్ తేలికైన బరువుతో సౌకర్యముగా రూపొందించబడి ఉంటాయి.

ఈ వాహనానికి, మంకీ కింగ్ సినిమా స్పూర్తితో, మేఘము అను అర్థం వచ్చే విధముగా ‌ "జిన్ డౌన్ యున్" అని నామకరణము చేయబడినది.

నివేదికల ప్రకారం, ఈ వాహనంపై, విజయానికి ముందు 1000 మార్లు పరీక్షలకు ఉపక్రమించినట్లుగా తెలుపబడింది.

ఏదో ఒక రోజు ఎల్లో రివర్ మీదుగా ఈ వాహనంపై ప్రయాణించాలని, ఇతని కోరికగా ఉన్నట్లు “జావో డెలి” తెలిపాడు.

భవిష్యత్తులో ఇటువంటివిమన ఇళ్ళముందు కూడా తిరిగే రోజులు వస్తాయేమో చూడాలి, తలచుకుంటే ఆసక్తికరంగా అనిపిస్తుంది కదా. ఇతని విజయవంతమైన ప్రయోగం, నలుగురికీ ఆదర్శప్రాయంగా మారాలని కోరుకుందాం.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Inventor Creates The 'First Flying Scooter'

The man wanted a 'flying motorbike' after reading about a hovering surfboard. He had spent two years in creating his 'dream vehicle' and even sold his house for it. He has named it 'Jin Dou Yun', which means 'a cloud' ridden by Chinese superhero Monkey King. After more than 1,000 test flights, he was finally able to create his flying scooter.
Story first published:Thursday, August 9, 2018, 17:50 [IST]
Desktop Bottom Promotion