For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ మగ్ వృత్తాకారంలో ఉందా లేదా చతురస్రాకారంలోనా? దీన్ని చూసాకా, మీ తల గోక్కోకుండా ఉండలేరు సుమీ!

ఈ మగ్ వృత్తాకారంలో ఉందా లేదా చతురస్రాకారంలోనా? దీన్ని చూసాకా, మీ తల గోక్కోకుండా ఉండలేరు సుమీ!

|

టోనీ ఫిషర్ ఒక బ్రిటీష్ పజిల్స్ రూపకర్త. అతను తికమకపెట్టే చిక్కుప్రశ్నలను తయారుచేయడంలో దిట్ట. కొత్త టెక్నిక్లను ఉపయోగించి పజిల్స్ రూపకల్పన చేసే జగత్తులో, టోనీ ఒక మార్గదర్శకుడిగా గుర్తింపు పొందాడు.

2017 లో, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు , టోనీ ఫిషర్ ను, ప్రపంచంలోనే అతిపెద్ద రూబిక్స్ క్యూబ్ రూపకర్తగా గుర్తించారు.

తనలోని అద్వితీయమైన సృజనాత్మకతకు ప్రసిద్ది చెందిన ఫిషర్, ఈ వీడియోలో తన తాజా సృష్టిని ప్రదర్శించాడు.

Is It Round Or Square? This Mug Will Have You Scratching Your Head

పైన ఉన్న వీడియోలో, ఫిషర్ తాను తయారు చేసిన కప్పును మనకు చూపిస్తున్నారు. ఈ కప్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మీ దృష్టికోణాన్ని అనుసరించి, అది వృత్తాకారంలో లేదా చతురస్రాకారంలో కనిపిస్తుంది.

తన అభిప్రాయాన్ని నిరూపించడానికి, ఫిషర్ ఒక అడుగు ముందుకేసి, ఇందులో ఎటువంటి కెమెరా ట్రిక్కులు లేవని చూపించాడు. అతను కప్పులో పాలను నింపి, చెంచాతో కలపడం చూడవచ్చు. దీని ప్రతిబింబాన్ని చూపించడం కొరకు అద్దం ఉపయోగించాడు.

ఈ వీడియో చూడటానికి ఒక విచిత్రమైన పజిల్ మాదిరిగా అనిపిస్తుంది. ఆఖరికి మీరు ఆ కప్పు నిజంగా, వృత్తాకార మరియు చతురస్రాకారాలలో ఉంది అని గ్రహిస్తారు.

ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏమిటి? దిగువన ఉన్న కామెంట్ విభాగం ద్వారా మాకు తెలియజేయండి. మరీన్ని ఆసక్తికరమైన కధనాల కొరకు, ఈ విభాగాన్ని చూస్తూ ఉండండి!

English summary

Is It Round Or Square? This Mug Will Have You Scratching Your Head

Some craftwork can cheat our eyes. A famous artist and a puzzle maker Tony Fisher shows off a mug he made that is both round and square depending on your perspective. To prove his point that there are no camera tricks involved, Fisher fills the cup with milk and stirs it around with a spoon, using the mirror to show off the reversed shape.
Story first published:Saturday, August 11, 2018, 12:24 [IST]
Desktop Bottom Promotion