ఆటోలో ఎక్కిన అమ్మాయిని సెక్స్ వల్ గా వేధించాడు ఓ పోలీసు.. ఆమె ఏం చేసిందో తెలుసా!

Written By:
Subscribe to Boldsky

ఆయన ఒక బాధ్యత గల పోలీసు. కానీ ఒక అమ్మాయిని వేధించాడు. నాతో పరిచయం పెంచుకో... నాతో స్నేహం చెయ్యి ... ప్లీజ్ అంటూ ఒక అమ్మాయి వెంటపడ్డాడు. అతని ఆగడాలు శ్రుతిమించడంతో ఆ అమ్మాయి చెంపపై చెల్లుమన్పించింది. తాజాగా జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ గా మారింది.

కరాటే ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం

కరాటే ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం

హర్యానాలోని రోహతక్‌లో ఇటీవల ఈ ఘటన జరిగింది. ఆమె పేరు నేహ జంగ్రా. ఆమె వయస్సు 21. ఆమె జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్. 2017, డిసెంబర్‌లో గోవాలో జరిగిన 10వ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో నేహా జంగ్రా పాల్గొని బంగారు పతకాన్ని సాధించారు.

ఆటోలో ఇంటికి బయల్దేరింది

ఆటోలో ఇంటికి బయల్దేరింది

నేహా ఎప్పటిలాగే కరాటే క్లాసులకు హాజరై తిరిగి ఆటోలో ఇంటికి బయల్దేరింది. మధ్యలో ఒక ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ యాసిన్‌ ఆటో ఆపాడు. అతను కూడా ఆటోలో ఎక్కాడు.

అసభ్యకరంగా ప్రవర్తించాడు

అసభ్యకరంగా ప్రవర్తించాడు

కొద్ది సేపటి తర్వాత నేహ జంగ్రాపై కాస్త అసభ్యకరంగా ప్రవర్తించాడు. నేహాను ఫోన్ నెంబర్ ఇవ్వమని ట్రాఫిక్ పోలీసు అడిగాడు. అసలు మీరెవరో తెలీదు... మీతో నాకు పరిచయం కూడా లేదు.. ఇలా డైరెక్ట్ గా ఫోన్ నంబర్ ఎలా అడుగుతావని నేహా అంది. ఇప్పటి నుంచి ఇద్దరం పరిచయం పెంచుకుందాం... నాతో కేవలం స్నేహం చేయాలంటూ బలవంతం చేశాడు.

ఫోన్ నంబర్.. ఇస్తావా లేదా

ఫోన్ నంబర్.. ఇస్తావా లేదా

మొదట ప్లీజ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటూ ట్రాఫిక్ పోలీసు నేహాను బతిమిలాడాడు. తర్వాత నేహాను సెక్స్ వల్ గా వేధించడం మొదలుపెట్టాడు. అయినా ఆమె ఫోన్ నంబర్ ఇవ్వనుంది. ఇస్తావా లేదా అని ట్రాఫిక్ పోలీస్ పట్టుబట్టాడు. ఇవ్వకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని బెదిరించాడు.

చెంపకేసి కొట్టింది

చెంపకేసి కొట్టింది

అలా నేహాను ఆ ట్రాఫిక్ పోలీసు వేధింపులకు గురి చేశాడు. ఓపిక ఉన్నంత వరకు ఆ పోలీసు చేష్టలను చూసింంది. చివరికి విసిగిపోయిన నేహా కానిస్టేబుల్‌ను చెంపకేసి కొట్టింది. ఎలా కనపబుతున్నా నీ కంటికి అంటూ నేహా పోలీసుకు వార్నింగ్ ఇచ్చింది.

పోలీసులకు అప్పగించింది

పోలీసులకు అప్పగించింది

నేహాకు ఆటో డ్రైవర్ కూడా సపోర్ట్ చేశాడు. ఆటో డ్రైవర్ సహాయంతో నేహా పోలీసుని అదే ఆటోలో సమీపంలో ఉన్న మహిళా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లింది. ఆ తర్వాత ట్రాఫిక్ పోలీసుపై ఫిర్యాదు చేసింది. ఆ ట్రాఫిక్ పోలీసును పోలీసులకు అప్పగించింది.

ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు

ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు

ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ యాసిన్‌గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ట్రాఫిక్ పోలీసుపై చర్యలు తీసుకోవద్దంటూ మహిళా పోలీసుకు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వచ్చాయట.

సస్పెండ్ చేశాం

సస్పెండ్ చేశాం

కానీ ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశామనీ.. రాతపూర్వక ఫిర్యాదు అందిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని రోహ్‌తక్ డీఎస్పీ రవీంద్ర స్వయంగా చెప్పాడు.

English summary

karate champion beats up haryana cop accuses him of sexual harassment

karate champion beats up haryana cop accuses him of sexual harassment
Story first published: Monday, April 9, 2018, 12:58 [IST]