For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చదువులో మొద్దుని, అర్చనను కలుస్తా, ఎవరైనా సరే జస్ట్ సీఎంను కలవాలని చెప్పి వచ్చేసెయండి : కుమారస్వామి

కర్ణాటక తాజా ముఖ్యమంత్రి కుమారస్వామి గురించి కొన్ని రోజులుగా ఏదో చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి మంత్రివర్గం కూడా కొలువుదీరింది. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి.

|

కర్ణాటక తాజా ముఖ్యమంత్రి కుమారస్వామి గురించి కొన్ని రోజులుగా ఏదో చర్చ నడుస్తూనే ఉంది. ఎన్నో నాటక పరిణామాల మధ్య కుమారస్వామి ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే.

తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి మంత్రివర్గం కూడా కొలువుదీరింది. ఇలా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రోజూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అయితే కుమారస్వామి కొన్ని రకాల ఆసక్తికర విషయాలు చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

వైరల్

వైరల్

ఈ మధ్య ఆయన చెప్పిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అందులో ఒకటి ఆయన చదువు విషయం. తాను చదువులో మొద్దునని టీచర్లకు భయపడి వెనక బెంచ్‌లో కూర్చునేవాడినని తాజాగా అన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి.

నేషనల్‌ డిగ్రీ కళాశాలలో చదివారు

నేషనల్‌ డిగ్రీ కళాశాలలో చదివారు

బెంగళూరు జయానగర్‌లోని నేషనల్‌ డిగ్రీ కళాశాలలో కుమారస్వామి చదివారు. ఆయన చదువుకున్న కళాశాలలో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించడంతో ఉత్సవానికి కళాశాల యాజమాన్యం కుమారస్వామిని ఆహ్వానించింది. చాలా ఏళ్ల తర్వాత కుమారస్వామి కళాశాలకు వెళ్లారు. అక్కడ ఆయన్ని ఘనంగా సన్మానించారు.

రాజ్‌కుమార్‌కు వీరాభిమాని

రాజ్‌కుమార్‌కు వీరాభిమాని

ఇక కుమారస్వామి పలు ఆసక్తికర విషయాలు అక్కడ మాట్లాడారు. తాను కాలేజీలో చదివే రోజుల్లో రాజ్‌కుమార్‌కు వీరాభిమాని అట. తనచదువును కొనసాగించి ఉంటే ఐఏఎస్‌ అధికారిని అయ్యేవాడిని అన్నారు ఈ ముఖ్యమంత్రి. తన జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని గుర్తు చేసుకున్నారు.

నువ్వెందుకూ పనికిరావు

నువ్వెందుకూ పనికిరావు

‘నువ్వెందుకూ పనికిరావు' అంటూ కుమారస్వామిని వాళ్ల నాన్న ఎప్పుడూ తిడుతుండేవారట. కానీ కుమారస్వామి మాత్రం ఎలాగోలా రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని పరితపించేవాడట. అందుకే ఎంపీగా గెలిచినప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చాలా కష్టపడ్డాడట.

చదువులో మొద్దు

చదువులో మొద్దు

ఇక రాజకీయాల్లో తాను అదృష్టవంతుడిగా భావిస్తానని చెప్పాడు కుమారస్వామి. కాలేజీ రోజుల్లో అస్సలు బాధ్యత లేకుండా తిరిగేవాడని కుమారస్వామే స్వయంగా చెప్పారు. ఇక తాను చదువులో మొద్దునని.. ముందు బెంచ్‌లో కూర్చుంటే ఎక్కడ టీచర్లు తనని ప్రశ్నలు అడుగుతారోనని భయపడి వెనక కూర్చునేవాడని తన కాలేజీ రోజులను కూడా గుర్తు చేసుకున్నాడు ఈ ముఖ్యమంత్రి.

జస్ట్ సీఎంను కలవాలి

జస్ట్ సీఎంను కలవాలి

కానీ తనలాగా ఎవరూ చేయవద్దని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు విధాన సౌధకు ఎప్పుడైనా వచ్చి తనని కలవొచ్చని.. తనని కలవడానికి అనుమతి, అపాయింట్‌మెంట్‌ అవసరం లేదని చెప్పి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు కుమారస్వామి. జస్ట్ సీఎంను కలవాలని చెప్పి లోనికి వచ్చేసెయండి అన్నాడు కుమారస్వామి.

మహిళా కానిస్టేబుల్‌ అర్చన

మహిళా కానిస్టేబుల్‌ అర్చన

ఇదిలా ఉంటే ఈ మధ్య బెంగళూరుకు చెందిన మహిళా కానిస్టేబుల్‌ అర్చన కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతోంది. కన్నబిడ్డ తనకు అక్కర్లేదని ఓ తల్లి వదిలేస్తే.. మహిళా కానిస్టేబుల్‌ అర్చన.. ఆ బిడ్డకు అమ్మగా మారిన విధానం అందరినీ ఆకట్టుకుంది. అర్చన చేసిన పనిని సామాజిక మాధ్యమాల వేదికగా అందరూ అభినందిస్తున్నారు.

త్వరలోనే అర్చనను కలుస్తా

త్వరలోనే అర్చనను కలుస్తా

తాజాగా కర్ణాటక నూతన ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా అర్చన విషయంలో స్పందించారు. ట్విటర్‌ ద్వారా అర్చనను ప్రశంసించారు. ‘మీడియా ద్వారా చిన్నారి వార్త తెలిసింది. మహిళా కానిస్టేబుల్‌ చేసిన పని నన్నెంతో కదిలించింది. ఆమె గొప్ప తల్లి. త్వరలోనే ఆమెను నేను కలుస్తా' అని కర్ణాటక సీఎం తాజాగా ట్వీట్‌ చేశారు.

పక్కకు తీసుకెళ్లి పాలిచ్చింది

పక్కకు తీసుకెళ్లి పాలిచ్చింది

ఇటీవల బెంగళూరు శివారులోని ఓ నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టిన బిడ్డను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బిడ్డను తీసుకుని స్టేషన్‌కు వెళ్లారు. ఆ బిడ్డ బాలుడు అని తెలిసింది. చిన్నారి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో అక్కడే ఉన్న అర్చన వెంటనే బాబును పక్కకు తీసుకెళ్లి పాలిచ్చింది. అలా అమ్మగా స్పందించి బిడ్డను కాపాడింది. అందుకే అర్చనకు అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అయితే అర్చన కూడా మూడు నెలల బాలింత.

సినిమా నిర్మాణం

సినిమా నిర్మాణం

ఇక కర్నాటక ముఖ్యమంత్రిగా హెచ్.డి కమారస్వామి గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు. కుమారస్వామికి మొదట సినిమా నిర్మాణం, పంపిణి రంగం ప్రధాన వ్యాపారంగా ఉండేది. కుమార స్వామి హెచ్.డి.దేవగౌడ, చిన్నమ్మ దంపతులకు 1959 డిసెంబర్ 16 న కర్నాటక రాష్ట్రం హసన్ జిల్లా హాలినరిసింపూర తాలుక హర్ధినహళ్ళి లో జన్మించారు.

కన్నడ నటి రాధికను వివాహమాడారు

కన్నడ నటి రాధికను వివాహమాడారు

హసన్ లో ప్రాథమిక విద్యను, బెంగళూర్ లోని జయనగర్ లోని ఎం.ఇ.ఎస్ ఎడ్యుకేషనల్ ఇన్సిస్ట్యూట్ లో హైస్కూలు విద్యను, బెంగళూరు విజయ కాలేజీలో పి.యు.సి, నేషనల్ కాలేజీ లో బి.ఎస్.సి పూర్తి చేశారు.

కుమార స్వామి 1986 మార్చి 13న అనితను వివాహమాడారు. వీరికి నిఖిల్ అనే కుమారుడు ఉన్నారు.కుమారస్వామి కన్నడ నటి రాధికను 2006 లో వివాహమాడారు. ఈ వివాహం కొంత వివాదం అయింది. వీరికి సామిక అనే కుమార్తె ఉంది.

డిపాజిట్ కూడ దక్కలేదు

డిపాజిట్ కూడ దక్కలేదు

కుమారస్వామి రాజకీయాలలో 1996 ప్రవేశించారు.కనకపుర లోకసభ నుంచి పోటి చేసి గెలుపొందారు.1998లో సతనూరు అసెంబ్లీ ఎన్నికలలో కుమారస్వామి ఘోరంగా ఓడిపోయారు. కనీసం డిపాజిట్ కూడ దక్కలేదు.1999లో సైతం ఓటమి పాలు అయ్యారు.

హంగ్ వచ్చింది

హంగ్ వచ్చింది

2004లో ఈయన రామ్ నగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ కి ఎన్నికయ్యారు. 2004 ఎన్నికలలో కర్నాటక లో ఏ పార్టీకి పూర్తి స్థాయి మేజార్టీ రాకపోవడంతో హంగ్ వచ్చింది. దీంతో కాంగ్రెస్ - జెడిఎస్ లు పరస్పరం అవగాహనతో కాంగ్రెస్ పార్టీ జెడిఎస్ మద్దతుతో ధరమ్ సింగ్ సి.ఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనసాగలేదు.

కుమారస్వామి

కుమారస్వామి

రాజకీయ వివాదం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోగ, 2006 ఫిబ్రవరి4న బిజెపి మద్దతుతో కుమారస్వామి కర్నాటక సి.ఎం.గా ప్రమాణ స్వీకారం చేశారు. 2007 అక్టోబర్ 9 వరకు కొనసాగారు. 2009లో బెంగళూరు రూరల్ పార్లమెంటు స్థానానికి పోటి చేసి గెలుపొందారు.

జాక్ పాట్ తగిలి

జాక్ పాట్ తగిలి

2013లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొంది ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగారు. 2018 మే12న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కుమార స్వామి అసెంబ్లీ కి ఎన్నికయ్యారు. ఇక ఆ తర్వాత జరిగిన విషయాలు మొత్తం మనకు తెలిసినవే. మొత్తానికి 2004 నాటి పరిణామాలు మళ్లీ పునరావృత్తం కావడంతో కుమారస్వామికి జాక్ పాట్ తగిలి కర్నాటక సీఎం పీఠం దక్కించుకున్నారు.

English summary

karnataka cm kumaraswamy says was a backbencher during college days

karnataka cm kumaraswamy says was a backbencher during college days
Story first published:Thursday, June 7, 2018, 10:29 [IST]
Desktop Bottom Promotion