For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఐఏఎస్ ఆఫీసర్లు చేసిన పని గురించి తెలిస్తే హ్యాట్సాఫ్ చెబుతారు

వారంతా ఐఎఎస్ అధికారులే. ఇద్దరు సబ్ కలెక్టర్లు. ఒకరు ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ కమిషనర్‌. వారే ఐఎఎస్‌ అధికారి రాజమాణిక్యం, వాయ నాడ్‌ సబ్‌ కలెక్టర్‌ ఎన్‌ ఎస్‌ కె ఉమేశ్‌, పద్మ నాభపురం సబ్‌ కలెక్టర్‌ రాజగోపాల్.

|

కేరళను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల వల్ల వందలాది మంది ప్రాణాలు పోతున్నాయి. దేశవ్యాప్తంగా అక్కడి బాధితుల కోసం ప్రార్థనలు చేస్తున్నారు. వారు కోలుకోవాలని వరదలు తగ్గాలని అందరూ కోరుకుంటున్నారు. అందరూ వారికి తోచినంత సాయం కేరళవాసుల కోసం చేస్తున్నారు.

సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ

సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ

పోలీసులు, ఆర్మీకు చెందిన వారు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. బాధితులను వారు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇప్పుడు దేశం మొత్తం కూడా ఇప్పుడు కేరళ వరదలే హాట్ టాఫిక్ గా మారింది. ఇలాంటి తరుణంలో అక్కడి అధికారుల తీసుకుంటున్న చొరవ చూసి అందరూ అభినందిస్తున్నారు.

పునరావాస కేంద్రాలు

కేరళలోని బాధితులను ఆదుకునేందుకు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అధికారులు అక్కడ అన్నీ కనీసం సౌకర్యాలు ఉండేలా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఒక పునరావాస కేంద్రానికి ఒక లారీలో బియ్యం వచ్చాయి. ఆ లారీ వచ్చినప్పుడు అక్కడే ముగ్గురు అధికారులున్నారు.

వారంతా ఐఎఎస్ అధికారులే

వారంతా ఐఎఎస్ అధికారులే. ఇద్దరు సబ్ కలెక్టర్లు. ఒకరు ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ కమిషనర్‌. వారే ఐఎఎస్‌ అధికారి రాజమాణిక్యం, వాయ నాడ్‌ సబ్‌ కలెక్టర్‌ ఎన్‌ ఎస్‌ కె ఉమేశ్‌, పద్మ నాభపురం సబ్‌ కలెక్టర్‌ రాజగోపాల్‌.

జనాల నుంచి ఎప్పుడూఅభినందనలు వెల్లువెత్తుతుంటాయి

వారు లారీలోని బియ్యం సంచులను పునరావస కేంద్రంలోకి తీసుకెళ్లడానికి సహకరించారు. స్వయంగా వారే బియ్యపు సంచులను భుజాన వేసుకుని కేంద్రంలో వేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కష్టాలు వచ్చినప్పుడు హోదాలు మరిచి సామాన్యుల్లా జనానికి సాయం చేసే అధికారులు చాలా కొందరే ఉంటారు. అలాంటి అధికారులకు జనాల నుంచి ఎప్పుడూఅభినందనలు వెల్లువెత్తుతుంటాయి.

English summary

Kerala IAS officers unload rice bags in Relief Camps

Kerala IAS officers unload rice bags in Relief Camps
Story first published:Saturday, August 18, 2018, 11:13 [IST]
Desktop Bottom Promotion