లైవ్ లో రిపోర్టర్లను ముద్దుల్లో ముంచెత్తున్నారు, ఇద్దరు అమ్మాయిల మధ్యలో నలిగిన రిపోర్టర్

జియాన్‌ వాంగ్‌ రియల్‌ అనే దక్షిణ కొరియా టీవీ రిపోర్టరు వరల్డ్‌కప్‌ కవరేజ్‌ కోసం రష్యా వెళ్లాడు. ఓ మ్యాచ్‌కి సంబంధించి లైవ్‌ ఇస్తుండగా రష్యా మహిళా అభిమానులు ఆయన చుట్టూ గుమిగూడారు.

ముద్దు పెట్టుకోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముద్దు అంటే ఆడవారి ముఖంలో సిగ్గు మెగ్గలేస్తుంది. పెదవులపై చిరునవ్వు చిగురిస్తుంది. కానీ ఇప్పుడు ముద్దు హద్దులను దాటుతోంది. లైవ్‌లో ముద్దులు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా రిపోర్టర్లకు లైవ్‌లో ముద్దులు పెడుతూ ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. అయితే మగ రిపోర్టర్లకు కూడా అమ్మాయిలే లైవ్‌లో ముద్దులు పెడుతూ పోటిపడుతున్నారు. లైవ్‌ కిస్‌లు ఫ్యాషన్‌ కావడంతో రిపోర్లర్లు ఇబ్బందులుపడుతున్నారు.

మహిళా రిపోర్టర్లకే ఆ ఇబ్బందులు

మహిళా రిపోర్టర్లకే ఆ ఇబ్బందులు

మొన్నటి వరకు మహిళా రిపోర్టర్లకే ఆ ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు అబ్బాయిలకు ఆ టెన్షన్‌ తప్పడం లేదు. మేము మాత్రం తక్కువ అంటూ అబ్బాయిలకు పోటిగా అమ్మాయిలు లైవ్‌లో రెచ్చిపోతున్నారు. నడిరోడ్డు మీద ఓ రిపోర్టరును ఇద్దరు రష్యన్ భామలు ముద్దు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

టక్కున ముద్దు పెట్టి మాయమయ్యాడు

టక్కున ముద్దు పెట్టి మాయమయ్యాడు

ఆ మధ్య రష్యాలో ఫుట్‌బాల్‌ స్టేడియం ముందు ఓ మహిళా జర్నలిస్ట్‌ లైవ్‌ చెబుతుండగా.. ఓ ఆకతాయి టక్కున ముద్దు పెట్టి మాయమయ్యాడు.. తర్వాత సారీ చెప్పాడు కూడా.. లేడీ రిపోర్టర్లకు ముద్దులు పెడుతూ, పెట్టాలని ప్రయత్నిస్తూ, లైంగికంగా వేధిస్తున్న వీడియోలు తరచూ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సీన్‌ కాస్త మారింది.. లైవ్‌ చెపుతున్న ఓ అబ్బాయికి షాక్‌ ఇచ్చారు అక్కడి అమ్మాయిలు.

ఇద్దరు అమ్మాయిలు లైవ్‌లో ముద్దుపెట్టారు

ఇద్దరు అమ్మాయిలు లైవ్‌లో ముద్దుపెట్టారు

జియాన్‌ వాంగ్‌ రియల్‌ అనే దక్షిణ కొరియా టీవీ రిపోర్టరు వరల్డ్‌కప్‌ కవరేజ్‌ కోసం రష్యా వెళ్లాడు. ఓ మ్యాచ్‌కి సంబంధించి లైవ్‌ ఇస్తుండగా రష్యా మహిళా అభిమానులు ఆయన చుట్టూ గుమిగూడారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు రిపోర్టర్ బూరెల్లాంటి బుగ్గలపై లైవ్‌లో ముద్దుపెట్టారు. ఒకసారితో వదలేదు ఈ భామలు.. మరోసారి ఘాటైనా అదర చుంబనం అందించారు. ఊహించని ఈ పరిణామానికి అతను కంగారు పడ్డాడు.

సిగ్గు పడి నవ్వుకున్నాడు

దక్షిణ కొరియాకు చెందిన ఎంబీఎన్ ఛానల్ లో జియాన్ వాంగ్ రిపోర్టర్ గా చేస్తున్నాడు. ఇక ముద్దు పెట్టుకున్నందుకు మొదట ఆ రిపోర్టర్ కాస్త కంగారు పడ్డా తర్వాత సిగ్గు పడి నవ్వుకున్నాడు. ఇటీవల ఓ మహిళా రిపోర్టరును లైవ్‌లో ఓ రష్యన్‌ యువకుడు ముద్దు పెట్టడం సంచలనం అయింది. మహిళలకు భద్రత లేదని ప్రపంచవ్యాప్తంగా నెటిజనులు విమర్శించారు.

జూలియట్‌ను ఓ వ్యక్తి ముద్దాడాడు

ఇక కొన్ని రోజుల క్రితం ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలకు సంబంధించిన లైవ్ ప్రోగ్రామ్‌ ఇస్తున్నరిపోర్టర్‌ జూలియట్‌ను ఓ వ్యక్తి ముద్దాడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జూలియట్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అయితే ఆ వెంటనే మరో లేడీ రిపోర్టర్‌ను ముద్దాడేందుకు ప్రయత్నించాడు ఒక ఫుట్ బాల్ అభిమాని. అయితే ఆమె తనను ముద్దాడేందుకు వచ్చిన వ్యక్తి నుంచి తప్పించుకుంది. ఇక మహిళా రిపోర్టర్‌ ఆ వ్యక్తి చివాట్లు పెట్టింది. ఆ రెండు సంఘటనలు కూడా కొన్ని రోజుల క్రితం బాగా వైరల్ అయ్యాయి.

జూలియా గుమారాస్ ను ముద్దు పెట్టాలనుకుంటే

జూలియా గుమారాస్ ను ముద్దు పెట్టాలనుకుంటే

బ్రెజిల్ కు చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ జూలియా గుమారాస్ అనే మహిళా జర్నలిస్ట్ యోకాటెరిన్ బర్గ్ నుంచి రిపోర్టును ఇస్తున్న సమయంలో ఓ ఆకతాయి ఆమెను సమీపించి ముద్దు పెట్టబోయాడు. అతన్నుంచి తప్పించుకున్న జూలియా, ఇది మంచి పద్ధతి కాదని చివాట్లు పెట్టింది. ఓ అమ్మాయి పట్ల ఇలా చేయడం తగదని, ఇంకోసారి ఇలా చేయవద్దని మండిపడింది. జరిగిన ఘటనపై ట్విట్టర్ లో స్పందిస్తూ, ఇక్కడిలా జరగడం రెండోసారని, దాని గురించి చెప్పడానికి మాటలు రావడం లేదని వ్యాఖ్యానించింది. తన అదృష్టం బాగుండి తప్పించుకున్నానని వ్యాఖ్యానించింది. రష్యాలో ఇటువంటి పరిస్థితులు చాలానే ఎదురవుతున్నాయని పేర్కొంది.

ఆమెను అసభ్యంగా తాకాడు

అలాగే కొలంబియా జర్నలిస్ట్ జూలియెత్ గొంజాలెజ్ ఓ వీధిలో నిలబడి లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా.. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఆమె చెంపపై ముద్దు పెట్టాడు. అంతేకాకుండా ఆమెను అసభ్యంగా తాకాడు. అయినప్పటికీ ఆమె ఏమాత్రం తడబడకుండా లైవ్ రిపోర్టింగ్ కొనసాగించింది. జర్మన్ న్యూస్ ఛానెల్‌కు లైవ్ రిపోర్టింగ్ ఇస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేసింది

జర్మన్ చానెల్ డష్ వెలె లో జూలియెత్ పని చేస్తోంది. జరిగిన ఉదంతం గురించి ఆమె కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేసింది. లైవ్‌లో అలా చేస్తే తాను వెంటనే రియాక్టయ్యే అవకాశం ఉండదని భావించి పక్కా ప్రణాళికతోనే అతడిలా చేసినట్లు జూలియెత్ తెలిపింది. తాను ఆ స్పాట్‌లో 2 గంటలుగా ఉన్నానని, లైవ్ రిపోర్టింగ్ మొదలు పెట్టే వరకు వేచి చూసి ఆ వ్యక్తి ఇలా చేశాడని చెప్పింది.

ఇద్దరు రష్యా అమ్మాయిలు వేధించారు

ఇకపై ప్రస్తుతం కూడా అబ్బాయిలకు ఇలాంటి షాక్‌లు తప్పడం లేదు. అమ్మాయిని అబ్బాయి కిస్ చేస్తే, మహిళలకు భద్రత లేదని స్పందించిన వారంతా, ఇప్పుడు అబ్బాయిలపైనా లైవ్‌లో ముద్దులు పెట్టిన ఘటనపై ఎలా స్పందిస్తారో చూడాలి. జరిగిన ఘటనపై ఎంబీఎన్ చానల్ సైతం స్పందించింది. వరల్డ్ కప్ పోటీలను కవర్ చేసేందుకు రష్యా వెళ్లిన తమ జర్నలిస్టును ఇద్దరు రష్యా అమ్మాయిలు వేధించారని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.

Story first published: Thursday, July 12, 2018, 9:00 [IST]
Desktop Bottom Promotion