For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డాక్టర్ కడుపులోనే 10000 రాళ్లు ఉన్నాయి, అందరికీ సలహాలిచ్చే ఆయనే ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు

పిత్తాశయంలో ఎలా ఏర్పడ్డాయి వైద్యులకు కూడా అర్థం కాలేదు. మొత్తం10,356 రాళ్లను పిత్తాశయంలో నుంచి బయటికి తీశారు. అన్ని రాళ్లు పిత్తాశయంలో ఎలా ఏర్పడ్డాయి వైద్యులకు కూడా అర్థం కాలేదు.

|

సాధారణంగా కిడ్నిల్లో రాళ్లు ఉండడం వంటి సమస్యను మనం చూస్తుంటాం. కొందరికి పేగుల్లో మరో చోట కూడా ఇలాంటి రాళ్లు ఏర్పడుతుంటాయి. అవి మహా అంటే పదుల సంఖ్యలో ఉండొచ్చు. వాటిని డాక్టర్లు శస్త్ర చికిత్సలు చేసి తొలగిస్తుంటారు. అలా అని మనకు సలహా ఇచ్చే డాక్టర్లు ఆరోగ్యంగా ఉంటారనుకోవడం పొరపాటే. ఒక డాక్టర్ పిత్తాశయంలో ఏకంగా 10,000 రాళ్లు బయటపడడం గమనార్హం.

తీవ్రమైన కడుపు నొప్పి

తీవ్రమైన కడుపు నొప్పి

చౌదరి అనే వైద్యుడు దాదాపు నెలన్నర పాటు తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బందిపడ్డాడు. అతను ఒక న్యూట్రిషియన్. కోల్ కత్తలో ఉంటాడు. అయితే ఆ సమస్యను అతను కాస్త లైట్ గా తీసుకున్నాడు. సమస్య తీవ్రత పెరిగిన తర్వాత డాక్టర్ని సంప్రదించాడు. డాక్టర్లు స్కానింగ్ చేస్తే అతని పిత్తాశయంలో (గాల్ బ్లాడర్) రాళ్లు ఉన్నట్లు తేలింది.

శస్త్ర చికిత్స చేపట్టారు

శస్త్ర చికిత్స చేపట్టారు

దీంతో వెంటనే శస్త్ర చికిత్స చేపట్టారు. రాళ్లు తీసేకొద్దీ బయటకు వస్తుండడంతో డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. అన్ని రాళ్లు పిత్తాశయంలో ఎలా ఏర్పడ్డాయి వైద్యులకు కూడా అర్థం కాలేదు. మొత్తం10,356 రాళ్లను పిత్తాశయంలో నుంచి బయటికి తీశారు.

40 నిమిషాల సమయం

40 నిమిషాల సమయం

ఈ శస్త్రచికిత్స నిర్వహించడానికి 40 నిమిషాల సమయం పట్టింది. కానీ బయటకు తీసిన రాళ్లను లెక్కించడానికి సిబ్బందికి ఎక్కువ సమయం పట్టింది. కోల్ కత్తాలో ఇలాంటి కేసు ఇది రెండోది కావడం విశేషం. కొన్ని రోజుల క్రితం కూడా ఇలాంటి కేసునే డాక్టర్స్ డీల్ చేశారు.

12,000 రాళ్లను తొలగించాడు

12,000 రాళ్లను తొలగించాడు

కొన్ని రోజుల క్రితం కోల్ కత్తాలో డాక్టర్ మఖన్లాల్ సహ ఒక రోగికి ఆపరేషన్ చేసి 12,000 రాళ్లను తొలగించాడు. కొందరికి కడుపులో సడెన్ గా పెయిన్ వస్తుంటుంది. తీరా డాక్టర్ వద్దకు వెళ్తే గాల్ బ్లాడర్ సమస్య అని చెబుతారు. గాల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడడానికి ప్రధానంగా కొన్ని కారణాలున్నాయి.

ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే

ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే

గాల్ బ్లాడర్ కాలేయానికి అనుసంధానంగా ఉంటుంది. లివర్ లోని పైత్యరసం గ్లాస్ బ్లాడర్ లో నిల్వగా ఉంటుంది. సరైన సమయానికి భోజనం తినకపోవడం, కొలెస్ట్రాల్ వల్ల గాల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడుతాయి. సో.. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. అందుకే అప్రమత్తంగా ఉండండి.

English summary

kolkata doctors remove 10,000 stones from nutritionist's gallbladder

kolkata doctors remove 10,000 stones from nutritionist's gallbladder
Story first published:Monday, September 3, 2018, 10:17 [IST]
Desktop Bottom Promotion