For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలా ఈశ్వరీరావుకు ఆ హీరోలు మంచి ఫ్రెండ్స్, అవకాశాలిస్తామని చెప్పి అలా చేశారట, బోయపాటి అందుకే అడిగాడట

రజనీకాంత్‌కు కాలాలో భార్యగా నటిస్తున్నా ఈశ్వరీ రావు ఆ అనుభవాలను కూడా పంచుకున్నారు. రజనీకాంత్‌ చిత్రంలో నటించాలని అడిగారు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. కాలా హీరోయిన్ ఈశ్వరీరావు, కాలా భార్య, రజినీకాంత్.

|

ప్రస్తుతం అందరినోట నానుతున్న సినిమా పేరు 'కాలా'. ఈ సినిమా ఈ నెల ఏడో తేదీన విడుదలకానుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా అయినా కాలాలో ఆయన సరసన నటించిన ఈశ్వరీరావ్ మన తెలుగు నటే. ఆమె ఈ మూవీలో రజిని భార్య పాత్రలో నటించింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో ని రజనీకాంత్, ఈశ్వరీరావుల మధ్య ఉండే సీన్స్ చూస్తే చాలా బాగుంటాయి.

ఈశ్వరిరావును బాపు బొమ్మ, బాలుమహేంద్ర హీరోయిన్ ఇలా పిలుస్తూ ఉంటారు. నటి ఈశ్వరీరావుది రాజమండ్రి. ఈమె పేరు వైజయంతి. వెండితెరపై ఈశ్వరీరావుగా పేరుతెచ్చుకుంది. ఆ మధ్య బ్రహ్మోత్సవం, అఆ చిత్రాల్లోనూ తన నటనతో మైమరిపించింది. హీరోయిన్ గా, అమ్మగా, అక్కగా, వదినగా ఇలా ఏ పాత్రలో తన నటనతో అదరగొట్టే ఈశ్వరీరావు గురించి తెలియని కొన్ని విషయాలు మీకోసం.

అనుకోకుండా హీరోయిన్‌

అనుకోకుండా హీరోయిన్‌

ఈశ్వరీరావు అనుకోకుండా హీరోయిన్‌ను అయ్యిందట. ఆమెకు మొదట్లో సినిమాల్లో నటించాలన్న ఆలోచనే ఉండేది కాదట. వాళ్ల ఇంట్లో కూడా కొంచెం పట్టింపులు ఎక్కువేనట. ‘అమ్మాయిలు ఎక్కువగా నవ్వకూడదు. బయట తిరగకూడదు' వంటి ఆంక్షలు

ఈశ్వరీరావు ఇంట్లో ఉండేవట.

నటించాలన్న ఊహే లేదు

నటించాలన్న ఊహే లేదు

అందువల్ల సినిమాల్లో నటించాలన్న ఊహే ఈశ్వరీరావుకు ఎప్పుడూ రాలేదట. అయితే సినిమావాళ్లతో ఈశ్వరీరావు కుటుంబానికి పరిచయాలు ఉండేవి. ఈశ్వరీరావు సొంత ఊరు రాజమండ్రి నుంచి మద్రాసులోని బంధువుల ఇళ్లకు అప్పుడప్పుడు వెళ్లేది.

మంచి కళ ముఖం

మంచి కళ ముఖం

ఈశ్వరీరావుది మంచి కళ ముఖం అందరూ అనేవారట. దీంతో ఈశ్వరీ రావు ఒకసారి అనుకోకుండా ఆడిషన్స్ కు వెళ్లింది. దీంతో టి. రాజేందర్‌ తన సినిమా కోసం టెస్ట్‌లు చేశారట. ఆయన నవ్వి ఈశ్వరీరావును కూడా అలా నవ్వమనేవారట. ఏడ్చి ఏడవమనేవారట. అలా దర్శకులు ఏం చెబితే అది ఈశ్వరీరావు చేసిందట.

పెద్ద హీరోయిన్ అయిపోతానేమో

పెద్ద హీరోయిన్ అయిపోతానేమో

ఇక ఈశ్వరీరావుకి కెమెరా ముందు మొదటిసారి నిల్చున్నప్పుడు పెద్ద హీరోయిన్ అయిపోతానేమో అనిపించిందట. ‘ఇంటింట దీపావళి'తో..1990లో ఈశ్వరీరావు తొలి సినిమా ‘కవితై పాడుమ్‌ అలైగళ్‌' గావిడుదలైంది. టీకే బోస్‌ దర్శకులు. ఇళయరాజా సంగీతం అందించారు.

జగన్నాటకంలో

జగన్నాటకంలో

ఇక అదే సంవత్సరం వచ్చిన ‘ఇంటింట దీపావళి' కూడా తెలుగులో ఈశ్వరీరావు మొదటి చిత్రం. చంద్రమోహన్, సురేష్‌తో కలిసి నటించింది ఈశ్వరీరావు. లక్ష్మీదీపక్‌ డైరెక్టర్‌. తరువాత జగపతిబాబు హీరోగా మోహనగాంధీ తీసిన ‘జగన్నాటకం'లో అవకాశం వచ్చింది. అప్పటికీ నటన గురించి ఈశ్వరీరావుకు పెద్దగా ఏమీ తెలీదట.

మద్రాసులోనే ఉండిపోయిందట

మద్రాసులోనే ఉండిపోయిందట

తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువగా నటించింది ఈశ్వరీరావు . అందుకు కారణం... ఈశ్వరీరావు సినిమాల్లోకి వచ్చిన సమయంలోనే తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్‌కి తరలింది. మళ్లీ అక్కడికి వెళ్లాలా అని ఈశ్వరీరావు మద్రాసులోనే ఉండిపోయిందట. దాంతో తెలుగులో తక్కువ సినిమాలు చేసిందట. డా. శివప్రసాద్‌ అనే ఆయన ఈశ్వరీరావును రాజేంద్రప్రసాద్‌కు పరిచయం చేశారట.

కళ్లు, నవ్వు, రంగు నచ్చి

కళ్లు, నవ్వు, రంగు నచ్చి

ఆయన సిఫార్సుతో బాపుగారి దగ్గరకి ఈశ్వరీరావు వెళ్లింది. ఈశ్వరీరావు కళ్లు, నవ్వు, రంగు నచ్చి బాపుగారు ‘రాంబంటు'లో హీరోయిన్‌గా తీసుకున్నారట. ‘క్యాజువల్‌గా ఉండు. మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటావో అలాగే నటించాలి' అని చెప్పారట.ఆయన దర్శకత్వంలో నటించడం ఈశ్వరీరావు అదృష్టంగా భావిస్తూ ఉంటుంది.

భలే సంతోషపడుతూ ఉంటుంది

భలే సంతోషపడుతూ ఉంటుంది

సినిమాల్లోకి వచ్చాక విశ్వనాథ్‌, బాపు, బాలుమహేంద్ర సినిమాల్లో ఈశ్వరీరావు నటించాలనుకుంది. విశ్వనాథ్‌గారి దర్శకత్వంలో నటించలేకపోయినా.. బాపు బొమ్మ, బాలుమహేంద్ర హీరోయిన్ అనే పేరయితే వచ్చిందని ఈశ్వరీరావు భలే సంతోషపడుతూ ఉంటుంది.

బ్రేక్‌ డౌన్

బ్రేక్‌ డౌన్

ఇక బాలు మహేంద్ర దర్శకత్వంలో నటించిన ‘రామన అబ్దుల్లా' ఈశ్వరీరావుకు మంచి పేరు తెచ్చింది. అయితే ఈశ్వరీరావు కెరీర్‌ బ్రేక్‌ డౌన్ కూడా అక్కడే పడింది. ఈ సినిమా విడుదలైన తరువాత నెల రోజులు ఈశ్వరీరావు వేరే ఊరు వెళ్లింది. ఆ నెల రోజుల్లోనే ఈశ్వరీరావు మంచి ఆఫర్లు, పెద్ద బ్యానర్లలో అవకాశాలు వచ్చాయి. కవితాలయ బ్యానర్‌పై, ప్రభుకు జోడీగా నటించాల్సిన చిత్రాలు మిస్సయింది.

అవకాశాలు ఇస్తామని చెప్పి

అవకాశాలు ఇస్తామని చెప్పి

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈశ్వరీరావుకు చాలా ఇబ్బందులు వచ్చాయి. చాలామంది అవకాశాలు ఇస్తామని ఇవ్వలేదట. అయితే బోయపాటి శీను ‘భద్ర' తీస్తున్న సమయంలో -ప్రకాష్‌రాజ్‌కు భార్యగా నటించమని అడిగారట. గతంలో ఈశ్వరీరావు నటించిన సినిమాకి బోయపాటి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేయడంతో ఆయన అడగడంతో కాదనలేకపోయిందట. తరువాత మళ్లీ నటించలేదు.

12 ఏళ్లుగా

12 ఏళ్లుగా

ఇక 2014లో బోయపాటి తీసిన లెజండ్‌లో నటించింది ఈశ్వరీరావు. తర్వాత బ్రహ్మోత్సవం, అ ఆలలో నటించింది. ఈశ్వరీరావు బుల్లితెరపై 12 ఏళ్లుగా హీరోయిన్‌గా కొనసాగింది. సినిమాల్లో కోల్పోయిన ఆనందం సీరియల్స్‌లో పొందేదట. కస్తూరిలో ఈమె ఆరేళ్లు పని చేసింది.

విజయ్‌కు తొలి హీరోయిన్‌

విజయ్‌కు తొలి హీరోయిన్‌

హీరోల్లో భానుచందర్‌, జగపతిబాబు, సాయికుమార్‌, సురేష్‌, ప్రకాష్‌రాజ్‌ ఈశ్వరీరావుకు మంచి స్నేహితులు. ఇప్పటికీ వాళ్లకు ఫోన్ చేస్తుంటారట ఈశ్వరీరావు. తమిళంలో విజయ్‌కు మొదటి హీరోయిన్‌ని ఈశ్వరీరావునే. ఆయన హీరోగా అరంగేట్రం చేసిన ‘నాలై తీర్పు'లో ఈశ్వరీరావు నటించింది.

ఎల్‌.రాజాతో పరిచయం

ఎల్‌.రాజాతో పరిచయం

ఇక‘నిన్నే పెళ్లాడుతా' సీరియల్‌లో నటించేటప్పుడు ఈశ్వరీరావు ఎల్‌.రాజాతో పరిచయం అయ్యింది. ఆ సీరియల్‌కు ఆయనే దర్శకులు. ఆయన ప్రవర్తన, మంచితనం ఈశ్వరీరావుని ఆకట్టుకున్నాయి. బాధ్యతగల మనిషి అనుకుంది. ఆయన మంచితనం చూసి ఇంట్లో వాళ్లు కూడా ఓకే చేయడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈశ్వరీరావుకు ఇద్దరు పిల్లలు. నివేదిత (9), రిషబ్‌రాజా (5). ఈశ్వరీరావు ఎల్‌ రాజాకు కూడా భార్య అంటే ప్రాణం.

మా ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని

మా ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని

ఇక రజనీకాంత్‌కు కాలాలో భార్యగా నటిస్తున్నా ఈశ్వరీ రావు ఆ అనుభవాలను కూడా పంచుకున్నారు.

"ఒక రోజు నాకు ఫోన్‌ వచ్చింది. రజనీకాంత్‌ చిత్రంలో నటించాలని అడిగారు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. దేవుడికి థ్యాంక్స్ చెప్పా. తొలిరోజు షూటింగ్‌ స్పాట్‌లో భయపడ్డా. నాకు, రజనీ సార్‌కు తెలుగు బాగా వచ్చు కాబట్టి.. తెలుగులోనే మాట్లాడుకునేవాళ్లం. ఇక మా ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని ప్రేక్షకులే చెప్పాలి. " అని ఈశ్వరీరావు తాజాగా చెప్పింది.

ఇవీ ఈశ్వరీరావు గురించి తెలిసిన కొన్ని విషయాలు. ఏ పాత్రలోనైనా ఇలాగే ఇమిడిపోయే ఈశ్వరీరావు భవిష్యత్తు బాగుండాలని కోరుకుందాం.

English summary

Eswari Rao stages a comeback.. lesser known facts about rajinikanths kaala heroine easwari rao

Eswari Rao stages a comeback.. lesser known facts about rajinikanths kaala heroine easwari rao
Story first published:Tuesday, June 5, 2018, 12:39 [IST]
Desktop Bottom Promotion