For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరుడుగట్టిన నేరస్తులు సత్పాల్ గ్యాంగ్ సభ్యులు, ఈ ముఠా నాయకుడు సత్పాల్ సింగ్ ఆర్మీ జవాన్

కరుడుగట్టిన సత్పాల్‌ సింగ్‌ ముఠాను నడిపే సత్పాల్‌ సింగ్‌ ది హరియాణా. ఇతను యుక్త వయసులో జవాన్‌గా ఆర్మీలో చేరి.. అక్కడ ఉన్నంతకాలం తప్పుడు ఆలోచనలు చేశాడు.కరుడుగట్టిన నేరస్తులు సత్పాల్ గ్యాంగ్ సభ్యులు.

|

సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని టెక్నాలజీ సాయంతో భారీ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా ఆటను తాజాగా విజయవాడ పోలీసులు కట్టించారు. ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఇనుప రాడ్ సహయంతో తాళాలు పగగొట్టి విలువైన వస్తువులు దొంగిలించే సత్పాల్ గాంగ్ సభ్యులను ఇటీవల అరెస్టు చేశారు.

బంగారు నగలు స్వాధీనం

బంగారు నగలు స్వాధీనం

వారి నుంచి సుమారు రూ.90 లక్షలు విలువ చేసే 3 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా పలు చోరీలు చేసిన ఈ ముఠా నాయకుడు లక్ష్యంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హరియాణాలోని గుర్గావ్ ప్రాంతానికి చెందిన ప్రీత్‌పాల్ టాక్రాన్ (33), రాజస్థాన్‌లోని పిలానీ ప్రాంతానికి చెందిన రాజీవ్ సోని(35)లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరు దేశంలోనే కరుడుకట్టిన పాత నేరగాడు సత్పాల్ సింగ్ ముఠాలోని సభ్యులు.

సత్పాల్ సింగ్

సత్పాల్ సింగ్

ఇక సత్పాల్ ముఠా నాయకుడు సత్పాల్ సింగ్. ఇతను ఇంకా పట్టుబడలేదు. దొంగతనాలు, హత్యలు, హత్యాయత్నాలకు సంబంధించి దేశంలో వివిధ రాష్ట్రాలలో సుమారు 30కి పైగా కేసులు ఉన్నాయి. ముఠాలోని ప్రధాన సూత్రధారి సత్పాల్ సింగ్ తన ముఠా సభ్యులు సీసీ కెమెరాలు లేని, తాళాలు వేసి ఉన్న అపార్ట్‌మెంట్ల దొంగతనాలు చేసే లక్ష్యంగా ఎంచుకుంటారు. ముందుగా నేరం చేసే ప్రాంతం గురించి వివరించి గ్యాంగ్‌లో ఉన్న సభ్యులకు పథక రచన గురించి వివరించి వారిని కారులో అక్కడికి పంపి తాను విమానంలో చేరుకుంటాడు.

ఇనుప రాడ్ సహయంతో

ఇనుప రాడ్ సహయంతో

అనంతరం అందరూ కారులో నేరం చేసే అపార్ట్‌మెంట్‌కు చేరుకొంటారు. బయట కారులో ఒకరు కాపలా ఉండగా మరో ఇద్దరు ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఇనుప రాడ్ సహయంతో అపార్ట్‌మెంట్ తాళాలు పగగొట్టి విలువైన వస్తువులు దొంగిలిస్తారు. అనంతరం అనుచరులు యథావిధిగా కారులో.. సత్పాల్ సింగ్ విమానంలో ప్రయాణించి డిల్లీకి సమీపంలో ఉన్న ఒక ప్రాంతంలో అందరూ కలుసుకుంటారు.

దొంగతనంలో పాలు పంచుకున్న వారికి

దొంగతనంలో పాలు పంచుకున్న వారికి

అక్కడ చోరీ చేసిన సొత్తులో కొంత భాగం దొంతనంలో పాలు పంచుకున్న వారికి ఇచ్చి తాను ఎక్కడికి వెళ్లేది చెప్పకుండా అక్కడ నుంచి జారుకొని తిరిగి మరలా నేరం చేసే సమయానికి కలుస్తారు. ఈ గ్యాంగ్ ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, గుంటూరు, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో పలుమార్లు నేరాలకు పాల్పడ్డారు. అలాగే ఈ గ్యాంగ్ గతంలో ఇతర రాష్ట్రాలైన డిల్లీ, హరియాణా, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటకలలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు.

20 ప్రత్యేక బృందాలు

20 ప్రత్యేక బృందాలు

ఈ ముఠా ఏపీలో చేస్తున్న నేరాలపై సీరియస్‌గా దృష్టి పెట్టిన విజయవాడ పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్.. దీనిపై దర్యాప్తును ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. జాయింట్ పోలీస్ కమీషనర్ టి.కాంతి రాణా పర్యవేక్షణలో సీసీఎస్ అధికారులు, సిబ్బందితో 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కేసులో నూతన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సీసీ కెమెరాల పుటేజీల సేకరణ ద్వారా నిందితులు ప్రయాణించిన మార్గం, వాహనం బస చేసిన ప్రదేశాలను గుర్తించారు.

ఒకప్పుడు ఆర్మీ జవాన్‌

ఒకప్పుడు ఆర్మీ జవాన్‌

కరుడుగట్టిన సత్పాల్‌ సింగ్‌ ముఠాను నడిపే సత్పాల్‌ సింగ్‌ ది హరియాణా. ఇతను యుక్త వయసులో జవాన్‌గా ఆర్మీలో చేరి.. అక్కడ ఉన్నంతకాలం తప్పుడు ఆలోచనలు చేశాడు. ఉద్యోగం పోగొట్టుకొని బయటికొచ్చేశాక దొంగల ముఠాలకు డాన్‌ అయ్యాడు. విజయవాడలో పలు చోరీ కేసుల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సత్పాల్‌ సింగ్‌ నేర చరిత్ర దొరికింది. చిన్నచిన్న నేరాలతో మొదలైన అతని జీవితం ప్రస్తుతం 15-20 గ్యాంగ్‌లను నడిపే స్థాయికి ఎదిగింది.

విలాసవంత భవనాలు

విలాసవంత భవనాలు

హరియాణా, రాజస్థాన్‌, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన యువకులను ఈ గ్యాంగ్‌ల్లో చేర్చుకున్నాడు. వారి సాయంతో దొంగతనాలకు పాల్పడి వచ్చిన సొమ్ముతో సొంత రాష్ట్రం హరియాణాలో విలాసవంత భవనాలు, ఆస్తులు సమకూర్చుకున్నాడు. అక్కడ పెద్దమనిషిగా చెలామణి అవుతున్నాడు.

మొదటి భార్యను హత్య చేశాడు

మొదటి భార్యను హత్య చేశాడు

మొదటి భార్యను హత్యచేసి అక్కడి పోలీసులను మేనేజ్‌ చేసి ఆమెది ఆత్మహత్యని రికార్డుల్లో రాయించాడు. అతడు ఏ రాష్ట్రానికెళ్లినా అక్కడ ఒక మహిళను భార్యగా పెట్టుకుంటాడు. కుటుంబాలను గోవాలో పెట్టి, అక్కడి నుంచి విమానాల్లో వచ్చి చోరీలు చేసి వెళ్తుంటాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సీసీ కెమెరాల నిఘాలేని ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లనే చోరీలకు ఎంచుకుంటాడు.

సత్పాల్‌ తప్పించుకున్నాడు

సత్పాల్‌ తప్పించుకున్నాడు

చోరీ పూర్తయ్యాక మళ్లీ ఆ ఫోన్‌ నంబర్‌ను ఉపయోగించడు. దొంగిలించిన సొత్తును ఢిల్లీలో వాటాలు వేసుకున్నాక... హరియాణాకు తరలిస్తాడు. సత్పాల్‌ గ్యాంగ్‌ సమాచారం తెలుసుకున్న విజయవాడ పోలీసులు 16 బృందాలుగా ఏర్పాటు చేశారు. పది రాష్ట్రాల పోలీసుల సహకారంతో గ్యాంగ్‌లో ఇద్దర్ని అరెస్టు చేశారు. సత్పాల్‌ తప్పించుకున్నాడు. కానీ సత్పాల్‌ కోసం ఇప్పుడు అంతటా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

English summary

lesser known facts about satpal gang

lesser known facts about satpal gang
Story first published:Monday, June 18, 2018, 11:52 [IST]
Desktop Bottom Promotion