For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చంద్రగ్రహణం : అసలు సూతక కాలం అంటే ఏమిటి? మరియు దాని సమయాలు.

చంద్రగ్రహణం : అసలు సూతక కాలం అంటే ఏమిటి? మరియు దాని సమయాలు.

|

ఈ సంపూర్ణ చంద్రగ్రహణం జూలై 27, 2018న ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో రెండవ సంపూర్ణ చంద్రగ్రహణంగా ఉన్న ఈరోజు, సుమారు గంటకు పైగా ఉండనుందని ఖగోళ శాస్త్రజ్ఞుల సమాచారం. మరియు 162 సంవత్సరాల తర్వాత వస్తున్న కేంద్రయోగమునకు మరియు 104 సంవత్సరాల తర్వాత వస్తున్న ముదురు గోధుమ రంగు లేదా ఎరుపు రంగులోని సంపూర్ణ చంద్రగ్రహణానికి ఆరోజు వేదిక కానుంది. కావున కేంద్రయోగానికి సూచించబడిన పూజలు చేయవలసి ఉంటుందని పండితులు సూచిస్తుంటారు. ముఖ్యంగా తమ జన్మకుండలి నందు ప్రభావం అధికంగా కలిగిన వారు.

గ్రహణం రోజున చంద్రుని రంగు కారణంగా బ్లడ్ మూన్ అని వ్యవహరించబడుతుంది కూడా. క్రమంగా ఈ శతాబ్దంలోనే ఉత్తమమైన గ్రహణంగా ఉండనుందని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు.

Lunar Eclipse: Sutak Kal Meaning And Timings

చంద్రగ్రహణం : అసలు సూతక కాలం అంటే ఏమిటి? మరియు దాని సమయాలు.

చంద్ర గ్రహణం:

సూతక కాలం అంటే ఏమిటి? మరియు దీని సమయాలు, జూలై 27న వచ్చే చంద్ర గ్రహణం రోజున ఎలా ఉండనున్నాయి.

సూతక కాలం అనగా ఒక సూర్య లేదా చంద్రగ్రహణం సమయంలో సాధారణంగా కలిగే నీచ సమయాన్ని సూచిస్తుంది. సూర్య గ్రహణం సందర్భంలో సూతక కాలం, గ్రహణం ప్రారంభం కావడానికి ముందు ఇరవై నాలుగు గంటల ముందే మొదలవుతుంది. అయితే, చంద్ర గ్రహణం సందర్భంలో, గ్రహణం ప్రారంభించటానికి, తొమ్మిది గంటలు ముందు ఏర్పడుతుంది. ఈసారి చంద్ర గ్రహణం రాత్రి 11:54 నుండి ప్రారంభం కానుంది, కావున జ్యోతిష్కుల అంచనాల ప్రకారం, సూతక కాలం అదేరోజు మద్యాహ్నం 2:00 నుండి వర్తించబడుతుంది. మరియు మరుసటి రోజు సూర్యోదయం వరకు కొనసాగుతుంది.


సూతక కాలం సమయంలో, చంద్రుడి ద్వారా ప్రతికూల శక్తులు గ్రహించబడతాయి. ఈ ప్రతికూల శక్తులు, ఒక నిర్దిష్ట మార్గంలో రాశిచక్రాలను, గ్రహాలు మరింత ప్రభావితం చేసేలా ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి జన్మ కుండలిలోని చంద్రుని స్థానాలు అననుకూలమైనవి అయితే, అతని జీవితంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. సూతక కాలం గ్రహాలు సానుకూలంగా ఉన్నప్పుడు కూడా ప్రభావితమవుతుంది. ఎందుకంటే ప్రతికూల ఫలితాలను కలుగజేసే హానికరమైన రేడియేషన్ల లక్షణం ఇది. క్రమంగా అన్ని గ్రహాలూ సక్రమమైన స్థానంలో ఉన్న వ్యక్తి కూడా కొన్ని ప్రతికూల ప్రభావిత సమస్యలను ఎదుర్కొనక తప్పదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సూతక కాలం సమయంలో విరమించుకోవలసిన విషయాలు:

ఈ ప్రతికూల ప్రభావాల వలన, కొన్ని విషయాలను పాటించడం అత్యంత అసందర్భమైన అంశాలుగా పరిగణించబడుతాయి. కొన్ని ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు, గృహ ప్రవేశం, వివాహాలు మొదలైనవి ఈ సమయంలో నిర్వహించరాదు.

సూతక కాలం సమయంలో ఆహారాన్ని వండడం లేదా తినకూడదు అని చెప్పబడింది. ఆ సమయంలో ముడి పండ్లు మరియు కూరగాయలను మాత్రమే తీసుకోవచ్చు. ఈ కాలంలో నిద్రపోవడం కూడా దురదృష్టమని నమ్ముతారు. పవిత్ర చెట్ల కొమ్మల ఆకులు కూడా ఆ సమయంలో కోయరాదు. గర్భిణీ స్త్రీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారు బయటకు వెళ్ళరాదు, మరియు పదునైన లోహ వస్తువుల వినియోగాన్ని పక్కనపెట్టాలి. ఆ సమయంలో బయటికి వెళ్ళడం వలన శిశువు చర్మ సంబంధిత వ్యాధులతో జన్మించటానికి దారి తీయవచ్చు.

అయితే, ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నందున మీరు చింతించవలసిన అవసరం లేదు. కానీ విజ్ఞాన శాస్త్రజ్ఞుల ప్రకారం ఎటువంటి హానీ ఉండదని, అందరూ గ్రహణాన్ని వీక్షించవచ్చని తెలియజేస్తున్నారు. కానీ, ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి పరీక్షలు చేసే కన్నా, కొన్ని నియమాలను పాటించడం వలన నష్టమైతే లేదని, జ్యోతిష్య శాస్త్ర పండితుల వాదన. ఇటువంటి వాదనలు దశాబ్ద శతాబ్దాలుగా ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. ఏదిఏమైనా జాగ్రత్త తప్పనిసరి.


జ్యోతిషశాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతికూల ప్రభావాన్ని గ్రహించకుండా నిరోధించడానికి, కొన్ని చిట్కాలు ఉన్నాయి.


1. శివ మంత్రం: ఓం నమః శివాయ మంత్రాన్ని పఠించవచ్చు.

2. వారి, జాతకచక్రం యొక్క నీచ స్థానంలో చంద్రుడు (ప్రతికూల ప్రదేశం) ఉన్నవారు, వారు ఈమంత్రాన్ని పఠిoచాలి: ఓం చంద్రే నమహ.

3. సూతక కాలం ప్రారంభమయ్యే ముందు తులసి ఆకులు కోసి వాటిని పాలు, పెరుగు మొదలైన ద్రవాలలో వేయడం మంచిది.

4. గ్రహణం ముగిసిన తరువాత, స్నానం చేయడం మరచిపోకండి. మీరు ఈ రోజున తీర్థయాత్రలో ఉన్నట్లయితే, లేదా మీ సమీపంలోని ఏదైనా ఒక నది ఉన్న ఎడల, పవిత్రమైన నదిలో స్నానం చేయడం ఉత్తమం.

5. గ్రహణం ముగిసిన తర్వాత, మీ ఇంట్లో గంగాజలాన్ని చల్లడం మాత్రం మర్చిపోకండి.


ముఖ్యంగా పెళ్ళికాని వారు, గర్భిణీ స్త్రీలు బహు జాగ్రత్తను పాటించపలసినదిగా సూచించడమైనది. వీలయితే మంచి జ్యోతిష్య శాస్త్ర నిపుణుని సందర్శించి, వారి వారి సలహాలను పాటిస్తూ గ్రహణ ప్రభావాలు తమ మీద పడకుండా జాగ్రత్తను తీసుకోవచ్చు.


కేవలం పెళ్లి కాని వారు, గర్భిణీ స్త్రీలు మాత్రమే కాకుండా, చంద్రుడు నీచ స్థానంలో (ప్రతికూల స్థానం మరియు జన్మ కుండలిలో దిగువ భాగం) ఉన్న ఎడల, పెళ్ళైన వారు సైతం కొన్ని సూచనలను పాటించక తప్పదు, లేనిచో ఈ సారి వచ్చే చంద్రగ్రహణ ప్రభావం కొన్నిరాశి చక్రాల మీద పెను ప్రభావాలను చూపే అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా వ్యక్తుల భావోద్వేగాలు, ఆలోచనా విధానాలు, ఉద్రేకాలు వంటి మానసిక సంబంధిత లక్షణాల మీద ప్రతికూల ప్రభావాలను చూపనున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కావున జన్మ కుండలిలో నీచ స్థానంలో చంద్రుడు ఉన్న వ్యక్తులు కూడా కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది. ఇక సూతక కాల ప్రభావాల నుండి ప్రతి ఒక్కరు బయట పడే క్రమంలో భాగంగా పైన చెప్పిన నియమాలను, పద్దతులను పాటించడం మంచిదిగా సూచించబడినది.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆద్యాత్మిక, జ్యోతిష్య శాస్త్ర, హస్త సాముద్రిక, ఆరోగ్య, జీవన శైలి తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Lunar Eclipse: Sutak Kal Meaning And Timings

Sutak Kal refers to the inauspicious time that begins twenty four hours prior to a solar eclipse and nine hours prior to a lunar eclipse. For the eclipse occurring on July 27, 2018, the Sutak Kal will be from 2:00 pm on July 27 to the sunrise on July 28. Astrologers say not to perform any auspicious pujas on this day.
Story first published:Thursday, July 26, 2018, 11:05 [IST]
Desktop Bottom Promotion