Latest Updates
-
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే! -
సమీరా రెడ్డి చేసిన గోవా స్పెషల్ మ్యాంగో కొబ్బరి కర్రీ..అన్నంలోకి అమృతమే..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మేషరాశిలో బుధాస్తమయం: ఈ 26 రోజులు డిజిటల్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి! -
ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనయోగం.. పట్టిందల్లా బంగారం కాబోతోంది..! -
పుచ్చకాయ తింటూ ఈ 3 తప్పులు చేస్తే మీ ప్రాణాలకే ముప్పు! -
నారద జయంతి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
నోట్లో నీళ్లు ఊరించే టమాటా నిల్వ పచ్చడి.. నెలల పాటు నిల్వ ఉండేలా చేసుకోండిలా.. -
వృషభం, సింహం, మకర రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - శనివారం, 02 మే 2026 -
ఎండలు మండిపోతున్నాయా? పీరియడ్స్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మే 2026 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే!
ఎస్.. నేను బహిరంగంగానే పాలిస్తాను, నా బిడ్డకన్నా ఇంకెవ్వరూ ఎక్కువ కాదు, తల్లులంతా తెలుసుకోవాలి
అమెరికాకు చెందిన మారా మార్టిన్ కు చాలానే ఉన్నాయి. ఈ మోడల్ స్విమ్ షూట్ ప్రచారంలో భాగంగా తన బిడ్డకు పాలు ఇస్తూనే ర్యాంప్ వాక్ చేసింది. మారా మార్టిన్ స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ స్విమ్ సూట్ మోడల్.
ఈ లోకంలో ఎవరైనా ఓ తల్లి బిడ్డనే. రాజు అయినా బంటు అయినా ఎవడైనా సరే ఓ తల్లి గర్భంలో నుంచే రావాలి. అందుకే తల్లికి అంత ప్రాధాన్యం. అయితే సమాజంలో పోకడలు మారుతున్న కొద్దీ ఈ కాలం అమ్మాయిలు తల్లి ప్రాధాన్యాన్ని మరిచిపోతున్నారు. కన్న బిడ్డకు పాలిస్తే వారి ఫిజిక్ ఎక్కడ పాడైపోతుందేమోనని భయపడిపోతున్నారు. ఇక కొందరు తల్లులు బహిరంగంగా బిడ్డకు పాలివ్వడానికి కూడా జంకుతుంటారు.

అందరికీ ఆదర్శంగా
కానీ కొందరు మాతృమూర్తులు మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందం గురించి పక్కన పెట్టి అందరికీ ఆదర్శం అవుతున్నారు. అందాన్నే నమ్ముకుని దాన్నే ప్రొఫెషెన్ గా తీసుకున్న ఒక మోడల్ బహిరంగంగానే బిడ్డకు పాలిచ్చి అందం కన్నా బిడ్డ ఆరోగ్యమే నాకు ముఖ్యం అని చాటింది. అలా చేయాలంటే కూడా చాలా గట్స్ ఉండాలి.
అమెరికాకు చెందిన మారా మార్టిన్
ఆ గట్స్ అమెరికాకు చెందిన మారా మార్టిన్ కు చాలానే ఉన్నాయి. ఈ మోడల్ స్విమ్ షూట్ ప్రచారంలో భాగంగా తన బిడ్డకు పాలు ఇస్తూనే ర్యాంప్ వాక్ చేసింది. మారా మార్టిన్ స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ స్విమ్ సూట్ మోడల్. ఇటీవల యూఎస్ లోని మియామీ ఒక ర్యాంప్ వాక్ నిర్వహించారు.
A post shared by Mara Martin (@_maramartin_) on
బంగారం రంగులో ఉన్నటువంటి బికినీ వేసుకుని
ఇక స్విమ్ సూట్ ఫ్యాషన్ షోలో మారా మార్టిన్ కూడా పాల్గొంది. 16 మంది పోటీదారుల్లో ఆమె కూడా ఒకరు. ఆమె బంగారం రంగులో ఉన్నటువంటి బికినీ వేసుకుని ర్యాంప్ పై వాక్ చేయడానికి రెడీ అయ్యింది. అయితే ఇంతలో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. బికినీలో రెగ్యులర్ ప్రదర్శనలిస్తూనే ఉంటాను.. కానీ ఈ సారి ఒక మెసేజ్ కూడా ఇవ్వాలనుకుంది.
A post shared by Mara Martin (@_maramartin_) on
వీడియో వైరల్ అయిపోయింది
ఆలోచన వచ్చిందే ఆలస్యం.. వెంటనే ఆచరణ రూపం దాల్చింది. తన ఐదు నెలల పాపను చేతుల్లోకి తీసుకుంది. పాపకు పాలిస్తూ ర్యాంప్ పై క్యాట్ వాక్ చేసింది. ఆమె అలా వాక్ చేస్తుంటే అక్కడున్న జనాలంతా చప్పట్లు, కేరింతలతో అభినందించారు. ఇక ఆ వీడియో, ఆ ప్రదర్శన కు సంబంధిచిన ఫొటోలను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే క్షణాల్లో ఆ వీడియో వైరల్ అయిపోయింది. జనాలంతా ఆమె చేసిన ప్రదర్శనను మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
మోడల్ మామ్ హ్యాష్ ట్యాగ్ జతచేసి మారా మార్టిన్ ఫొటలోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.
A post shared by Mara Martin (@_maramartin_) on
ఓవర్ నైట్ లో పాప్ లర్
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంలో ఆమె పేరు మారిమోగిపోతుంది. ఓవర్ నైట్ లో పాప్ లర్ అయిపోయింది. వాస్తవానికి మొదటమారా మార్టిన్ ఒక్కరే ఆ ప్రదర్శనలో పాల్గొనాలని అనుుకుంది. కానీ తల్లి పాల ప్రాముఖ్యాన్ని వివరించేందుకే మారా మార్టిన్ ఈ నిర్ణయం తీసుకుంది. తన మోడల్స్ ఇలాంటి సాహసం చేస్తేనే ఈ కాలం అమ్మాయిలకు అర్థం అవుతుందని తాను భావించే ఇలా చేసింది. తన వినూత్న సందేశానికి అందరి నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
My little Angel baby... #Aria #Ari #angelbaby #prettybaby #cutex10000
A post shared by Mara Martin (@_maramartin_) on
జనాల్లో అవగాహన పెంచేందుకే
అయితే తాను ఇలా ప్రధాన పత్రికల్లో పతాక శీర్షికను అవుతానని అనుకోలేదని మారా మార్టిన్ తెలిపారు. జనాల్లో అవగాహన పెంచేందుకే అలా చేశానని చెప్పింది. తాను అందరి దృష్టిలో పడాలని ఈ పని చేయలేదని, ఐద్నెళ్లుగా తాను ఇలాగే అదే సమయంలోనే తన బిడ్డకు పాలు ఇస్తున్నానని చెప్పింది. కాస్త ఆలస్యం అయినా తాను ఏడుస్తుంది. అందుకే నేను నా బిడ్డకు ర్యాంప్ పైనే పాలిచ్చాను అంది.

కొన్ని ఆంక్షలున్నాయి
అయితే మనదేశంలో ఇలా బహిరంగంగా పాలు ఇచ్చే విషయంలో కొన్ని ఆంక్షలున్నాయి. కానీ యూఎస్ లో మాత్రం ఈ విధానాన్ని తప్పుపడుతున్నాయి. తల్లులు కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు... మొదట చూసేవారు వారి బుద్ధిన మార్చుకోవాలని యూఎస్ లోని వారు పేర్కొంటున్నారు.
చనుబాల ద్వారానే తీర్చాలే కానీ
బిడ్డ ఆకలిపి చనుబాల ద్వారానే తీర్చాలే కానీ డబ్బా పాల ద్వారా కాదని ఈ కాలం తల్లులు అర్థం చేసుకోవాలి. అలాగే బిడ్డకన్నా ఎవరూ ముఖ్యం కాదు.. బహిరంగంగానే బిడ్డకు పాలు ఇవ్వొచ్చు ఇందులో సిగ్గు పడాల్సిన అవసరం లేదని కూడా తల్లులు తెలుసుకోవాలి. అలాంటి కొందరు సిగ్గులేని వెదవలు వెకిలి చేష్టలు చేసినా క్రమంగా వారు కూడా తల్లి ప్రాముఖ్యాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం కేరళకు చెందిన మాతృభూమి పత్రిక గృహలక్ష్మి మేగజైన్ కవర్ పేజీపై కూడా ఇలాంటి ప్రచారమే చేశారు. ఒక మోడల్ బహిరంగంగా బిడ్డకు పాలిస్తున్నట్లు ఫొటో ప్రచురించి జనాల్లో కాస్త చైతన్యం తెచ్చారు.



Click it and Unblock the Notifications