For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నా డార్లింగ్ తో డార్జిలింగ్ వెళ్లా.. మళ్లీ మళ్లీ అక్కడికి వెళ్లి రొమాన్స్ చేయాలని ఉంది - #mystory179

డార్జిలింగ్‌ అంటే పిడుగుల ప్రదేశమని అర్థం. డార్జిలింగ్ అందాలను రోప్‌ వే ప్రయాణంలో ఆకాశమార్గంలో తిలకించాం. డార్జిలింగ్ ట్రిప్, డార్జిలింగ్ యాత్ర, విహార యాత్ర, ప్రయాణం. డార్జిలింగ్ డార్లింగ్.

|

నా భార్య నేను ఏటా ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఈ మధ్య ఒక మంచి ట్రిప్ వెళ్లాలని అనుకున్నాం. ఎక్కడికి వెళ్తే బాగుంటుందని నా డార్లింగ్ ని అడిగాను. డార్జిలింగ్ వెళ్దామా అంది. వెంటనే ఒకే అనేశాను.

ప్రకృతి.. తన అందాలను ఆరబోసిన ప్రదేశం డార్జిలింగ్‌. పశ్చిమ బెంగాల్‌ తూర్పు హిమాలయాల్లో నేపాల్‌, భూటాన్‌ దేశాలకు చేరువలో డార్జిలింగ్‌ ఉంది. మేము సిలిగురి నుంచి అక్కడికి చేరుకున్నాం. ఇది కాంచనగంగ పర్వత శ్రేణులలో ఉంది.

పిడుగుల ప్రదేశం

పిడుగుల ప్రదేశం

డార్జిలింగ్‌ అంటే పిడుగుల ప్రదేశమని అర్థం. అక్కడ ఉండే చిన్న చిన్న జలపాతాలను చూస్తూ మతిపోతుంది. రైలు ప్రయాణం అయితే అబ్బో మాటల్లో చెప్పలేం. పొగమంచు దుప్పటి, ప్రకాశవంతమైన సూర్యాస్తమయం మమ్మల్ని మైమరిపించాయి.

ఆకాశమార్గంలో తిలకించాం

ఆకాశమార్గంలో తిలకించాం

డార్జిలింగ్ అందాలను రోప్‌ వే ప్రయాణంలో ఆకాశమార్గంలో తిలకించాం. రోప్ వేలో నేను నా భార్య వెళ్లాం. వెళ్తూ వెళ్తూ ఇద్దరం ఒకి ఒడిలో ఒకరం ఒదిపోతూ అందాలను ఆస్వాదించాం. మంచుతో కప్పబడిన కాంచన్‌జంగ పర్వత శిఖరాలతో అలరారుతున్న ఆ ప్రదేశాన్ని ఆనందించా.

నా డార్లింగ్ ను గట్టిగా హత్తుకున్నా

నా డార్లింగ్ ను గట్టిగా హత్తుకున్నా

రోప్‌ వేలో నుంచి డార్జిలింగ్‌ లోయ దృశ్యాలు, తేయాకు తోటలు, దట్టమైన అడవులు, పర్వత ప్రవాహాలు, జలపాతాలు, మంచు శిఖరాల్లాంటివి చూస్తూ మైమరిచిపోయాం. కిందికి వచ్చిన తర్వాత తేయాకు తోటలలో తిరుగుతుంటే మాకు ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా అనిపించింది. ఎవరూ లేని సమయం చూసి ఆ ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ నా డార్లింగ్ ను గట్టిగా హత్తుకున్నా. తన పెదాలపై నా పెదాలుంచాను.. తర్వాత మైమరిచి.. ముద్దుల్లో తేలిపోయాం.

రాక్‌ గార్డెన్‌

రాక్‌ గార్డెన్‌

తర్వాత డార్జిలింగ్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రాక్‌ గార్డెన్‌ కు వెళ్లాం. అక్కడ వివిధ రకాలుగా మలిచిన రాళ్ళపై పారుతున్న జలపాతాల తీరు మంత్రముగ్ధుల్ని చేసింది. చంచల్‌ లేక్‌ కూడా భలే ఉంటుంది.

పర్వతారోహకులకు ఇచ్చే ట్రైనింగ్

పర్వతారోహకులకు ఇచ్చే ట్రైనింగ్

హిమలయన్‌ మౌంటనీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఎవరెస్టు శిఖర పర్వతారోహణకు సంబంధించిన శిక్షణా సంస్థను కూడా చూశాం. పర్వతారోహకులకు ఇచ్చే ట్రైనింగ్ చూశాం. తర్వాత పద్మజానాయుడు హిమలయన్‌ జులాజికల్‌ పార్క్‌ కు వెళ్లాం. హిమలయాలకు సంబంధించిన అరుదైన వన్యప్రాణులన్నీ చూశాం.

మంచు చిరుతలు

మంచు చిరుతలు

రెడ్‌పాండా, మంచు చిరుతలు, టిబెటన్‌ నక్కలతో పాటు, వలస వచ్చే అరుదైన పక్షులు కట్టిపడేశాయి. కొమ్ము ఖడ్గమృగాలు, ఏనుగులు, పులులు, మచ్చల జింకలు కనువిందు చేశాయి.

టైగర్‌ హిల్‌

టైగర్‌ హిల్‌

ఇక డార్జిలింగ్‌లోని ఎత్తయిన ప్రదేశం టైగర్‌ హిల్‌. ఇది డార్జిలింగ్‌కు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచుతో కప్పబడిన తూర్పు హిమాలయాలలోని కాంచనగంగ పర్వత శిఖరాల మధ్య నుంచి సూర్యోదయాన్ని చూడటానికి ఉత్తమమైన చోటు ఇదే. అక్కడికి కూడా వెళ్లాం.

టారు ట్రెయిన్‌

టారు ట్రెయిన్‌

టారు ట్రెయిన్‌ లో పుల్ ఎంజాయ్ చేశాం. ఇది నేరోగజ్‌ రైల్వేలైన్‌ మీద నడుస్తుంది. ఇక్కడి బటాసియా లూప్‌లో వలయాకారంలో ఉండే అంచులు చూడముచ్చటగా ఉంటాయి. ఇక్కడి నుంచి చూస్తే టీ తోటలు, నీటి ప్రవాహాలు ఎంతో అద్భుతంగా కనబడతాయి.

జపనీస్‌ ఆలయం

జపనీస్‌ ఆలయం

డార్జిలింగ్‌ నుంచి కారులో పది నిమిషాలు ప్రయాణిస్తే ఒక అందమైన ప్రదేశానికి చేరుకుంటాం. ఇది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అదే జలపహార్‌ హిల్‌. ఇక్కడ జపనీయుల సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మించిన ఆలయం ఉంది. బుద్ధుని నాలుగు అవతారాలుగా భావించే పెద్ద విగ్రహాలూ ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి. వీటినే పీస్‌ పగోడా అంటారు.

కాళీమాత ఆలయం

కాళీమాత ఆలయం

దివ్యమైన తేజస్సుతో విరాజిల్లే బుద్ధుని విగ్రహాలను చూడటానికి ఎంతోమంది బౌద్ధ సందర్శకులు ఇక్కడకు వస్తూ ఉంటారు. అంతేకాక, డార్జిలింగ్‌లోని కాళీమాత ఆలయం హిందువులకు, బౌద్ధులకూ సందర్శనీయ ప్రదేశంగా గుర్తింపు పొందింది.

రైల్వేజోన్‌ మంచి మార్గం

రైల్వేజోన్‌ మంచి మార్గం

డార్జిలింగ్‌ చేరుకునేందుకు సమీపంలోని జలపాయిగురి రైల్వేజోన్‌ మంచి మార్గం. డార్జిలింగ్‌ హిమాలయన్‌ రైల్వే నిర్మాణం 19వ శతాబ్దంలో జరిగింది. ఇక్కడి రైలుమార్గం అద్భుతమైన ఇంజనీరింగ్‌ నమూనాకు ప్రతీక అని చెప్పుకోవాలి. ఈ రైలుమార్గం 70 కిలోమీటర్ల పొడుగు ఉంది.

8-9 గంటల ప్రయాణం

8-9 గంటల ప్రయాణం

కోల్‌కతా నుంచి డార్జిలింగ్‌ మేల్‌తో పాటు, కామ్‌రూప్‌ ఎక్స్‌ప్రెస్‌ జలపాయిగురి వెళ్తుంది. ఢిల్లీ నుంచి గౌహతి డిబ్రూగడ్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఇక్కడికి వస్తుంది. అదే, టారుట్రైన్‌తో జలపాయిగురి నుంచి డార్జిలింగ్‌కు 8-9 గంటల ప్రయాణం ఉంటుంది.

సిలిగురి నుంచి రెండు గంటల సమయం

సిలిగురి నుంచి రెండు గంటల సమయం

రోడ్డుమార్గంలో డార్జిలింగ్‌ను చేరుకోవాలంటే సిలిగురి నుంచి రెండు గంటల సమయం పడుతుంది. కోల్‌కతా నుంచి సిలిగురికి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి. డార్జిలింగ్‌ చేరుకోవడానికి ఫ్లైట్‌ సౌకర్యం ఉంది. సిలిగురి నుంచి 90 కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్‌పోర్టు ఉంది. అక్కడి నుంచి డార్జిలింగ్‌కు రెండు గంటల సమయం పడుతుంది. కోల్‌కతా, ఢిల్లీకి ప్రతిరోజూ విమానాలు ఉంటాయి. గౌహతి, పాట్నా నుంచీ విమాన సౌకర్యం ఉంది.

ఒక్కరోజులో

ఒక్కరోజులో

ఇక కాలింపాంగ్‌ డార్జిలింగ్‌ జిల్లాలోనే ఉంది. ఇదొక ప్రముఖ హిల్‌స్టేషన్‌గా పేరుగాంచింది. డార్జిలింగ్‌, గంగ్టోక్‌కు వెళ్లాలనుకునేవారు ఈ నగరాన్ని దాటేవెళ్లాలి. ఏదైనా వెహికల్‌ సహాయంతో అయితే, ఒక్కరోజులో కాలింగ్‌పాంగ్‌ను చుట్టేయొచ్చు. కాలి నడకన అయితే రెండు మూడురోజులు పడుతుంది.

మర్చిపోలేని మధుర అనుభూతి

మర్చిపోలేని మధుర అనుభూతి

ఎక్కువమంది పర్యాటకులు కాలినడకకే ప్రాధాన్యతనిస్తారు. కాలింగ్‌పాంగ్‌ ఈశాన్య హిమాలయాల వెనుకభాగాన ఉంది. డార్జిలింగ్‌ ప్రయాణం నా జీవితంలో మర్చిపోలేని ఓ మధుర అనుభూతి. మీరు కూడా వీలుంటే ఎప్పుడైనా డార్జిలింగ్ వెళ్లండి బాసూ.

English summary

my darjeeling memories and experiences

my darjeeling memories and experiences
Story first published:Friday, June 1, 2018, 11:24 [IST]
Desktop Bottom Promotion