For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొడైకెనాల్ చెరువు గట్టున నా భార్య, నేను తనువులు మెలేసుకుని తన్మయత్వంతో ఆనందించాం - #mystory178

ప్రిన్సెస్‌ ఆఫ్‌ హిల్‌స్టేషన్‌గా పేరుమోసిన కొడైకెనాల్‌ తమినాడులో ముఖ్యమైన పర్యాటక కేంద్రాల్లో ఒకటని మన అందరికీ తెలుసు. దిండుగల్‌ జిల్లాలో పర్వత శ్రేణులు, ప్రకృతి అందాలు.కొడైకెనాల్, ఊటీ కొడైకెనాల్

|

మా ఆవిడతో కలిసి ఎప్పటి నుంచో ఒక మంచి ప్లేస్ కు ట్రిప్ ప్లాన్ చేయాలని నాకు ఉండేది. అందుకే బాగా ఆలోచించి మేమిద్దరం కొడైకెనాల్ వెళ్లాలని డిసైడ్ అయ్యాం. ప్రిన్సెస్‌ ఆఫ్‌ హిల్‌స్టేషన్‌గా పేరుమోసిన కొడైకెనాల్‌ తమినాడులో ముఖ్యమైన పర్యాటక కేంద్రాల్లో ఒకటని మన అందరికీ తెలుసు.

దిండుగల్‌ జిల్లాలో పర్వత శ్రేణులు, ప్రకృతి అందాల మధ్య అలరిస్తున్న ఈ విహార కేంద్రం మమ్మల్ని మైమరిచిపించింది. అక్కడి ఎత్తైన కొండలు, జలపాతాలు, పార్కులు, ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, వినోద కేంద్రాలు ఆబాల గోపాలాన్ని అలరిస్తూ మమ్మల్ని అద్భుతమైన లోకంలోకి తీసుకెళ్లాయి.

అమ్మయనాయకనూర్‌

అమ్మయనాయకనూర్‌

మా ప్రయాణం అమ్మయనాయకనూర్‌ గ్రామం నుంచి మొదలైంది. అక్కడి నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరం వరకు యడ్ల బండ్ల మీద కొన్ని గంటలు ప్రయాణం చేశాం. తర్వాత కృష్ణమ్మ నాయక తోప్పు దగ్గరకు చేరుకున్నాం. అక్కడి నుంచి ఇంకో పద్దెనిమిది కిలోమీటర్లు గుర్రం మీద వెళ్లాం.

కొడైకెనాల్‌రోడ్‌

కొడైకెనాల్‌రోడ్‌

అమ్మయనాయకనూర్‌ గ్రామం దగ్గర ఒక రైల్వేస్టేషన్‌ ఉంటుంది. ఈ స్టేషనే కొడైకెనాల్‌రోడ్‌. మేము అక్కడికి వరకు ట్రైన్ లో వెళ్లాం. కురింజి పువ్వులకు కొడైకెనాల్‌ బాగా ఫేమస్ ఈ పువ్వులు పన్నెండేళ్లకు ఒకసారి పూస్తాయి. మేము వెళ్లినప్పుడు కరెక్ట్ గా ఆ పువ్వులు పూశాయి. వాటిని చూసి భలే ఆనందపడ్డాం.

సోలార్‌ ఫిజికల్‌ అబ్‌జర్వేటరీ

సోలార్‌ ఫిజికల్‌ అబ్‌జర్వేటరీ

కొడైకెనాల్ లో మేము సైక్లింగ్‌, హార్స్‌రేసింగ్‌, బోటింగ్‌, ట్రెక్కింగ్‌లతో భలే ఎంజాయ్ చేశాం. మేము సోలార్‌ ఫిజికల్‌ అబ్‌జర్వేటరీకి వెళ్లాం. ఇది చెరువు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టం నుంచి 2343 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ నిర్వహణలో వుంది. కొడైకెనాల్‌లో ఎత్తైన ప్రదేశమిది.

పచ్చలోయ

పచ్చలోయ

కొడైకెనాల్‌ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పచ్చలోయకు నేను, నా భార్య వెళ్లాం. ఇది గోల్ఫ్‌ క్లబ్‌కు దగ్గర్లో ఉంది. ఇక్కన్నుంచి దిగువన ఉండే వైగై నది అందాలను ఇద్దరం ఆస్వాదించాం.

నిశ్శబ్ద లోయ

నిశ్శబ్ద లోయ

నా భార్య నేను నిశ్శబ్ద లోయ వెళ్లాం. తను చాలా భయపడింది. అక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది పిల్లర్‌ రాక్స్‌, బెరిజం చెరువు రోడ్డుకు కాస్త దూరంలో ఉంది. పేరుకు తగినట్టు ఈ లోయ ప్రాంతం ఎంతో నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడకు వచ్చే పిల్లలకు, పెద్దల తోడు తప్పనిసరి.

లా సలెత్‌ చర్చి

లా సలెత్‌ చర్చి

ఇది కొడైకెనాల్‌లో 150 సంవత్సరాల నాటి చర్చి. 1866లో ఇక్కడ థ్యాంక్స్‌ ఆఫరింగ్‌ జరిగింది. ప్రపంచంలో లేడీ లా సలెత్‌ కోసం కట్టిన రెండు చర్చిలలో ఇదొకటి, ఇంకొకటి ఫ్రాన్స్‌లో ఉంది. ఇక్కడ ప్రతీ ఏటా ఆగస్ట్‌ నెలలో, వార్షికోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో దక్షిణభారత దేశం నుంచి లక్షలాది మందిభక్తులు పాల్గొంటారు.

తలయార్‌ జలపాతం

తలయార్‌ జలపాతం

దీనిని ఎలివాల్‌ అరువి (ఎలుక తోక జలపాతం) అని కూడా అంటారు. చూడ్డానికి ఎలుక తోకలా, సన్న ధారలా లోయలోకి ప్రవహించే ఈ జలపాతం, దేశంలో ఎత్తైన జలపాతాల్లో మూడవదట. అయితే అక్కడకు చేరుకోడానికి రోడ్డు లేదు. కాబట్టి వెళ్లలేకపోయాం. కానీ కోడై రోడ్డు నుంచి కొడైకనాల్‌కు వెళ్లేటప్పుడు, ఘాట్‌ రోడ్డు ఎక్కే సమయంలో ఈ జలపాతాన్ని చూసి ఎంజాయ్ చేశాం.

బోటింగ్ లో భలే ఎంజాయ్ చేశాం.

బోటింగ్ లో భలే ఎంజాయ్ చేశాం.

తర్వాత మేము సైక్లింగ్‌, గుర్రపుస్వారి, బోటింగ్‌, ఫిష్షింగ్‌తోపాటు గోల్ఫ్‌ కూడా ఆడాం. కొడైకెనాల్‌ చెరువు చుట్టూ తిరగడానికి సైకిళ్లు అద్దెకు దొరుకుతాయి. వాటిని తీసుకుని తొక్కుతూ అలా చెరువు చెట్టూ రౌండ్ కొట్టాం.

చెరువులో బోటింగ్‌ భలే ఉంటుంది. నేను మా ఆవిడ బోటింగ్ లో భలే ఎంజాయ్ చేశాం.

బాగా నచ్చింది

బాగా నచ్చింది

కొడైకెనాల్‌ చెరువు మాకు బాగా నచ్చింది . ఇది

24 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. చెరువు చుట్టూ ఐదు కిలోమీటర్ల తారు రోడ్డు ఉంది. కొడైకెనాల్‌లో ఇదే ప్రధాన ఆకర్షణ కేంద్రం.

బెరిజం చెరువు

బెరిజం చెరువు

ఈ వ్యూపాయింట్‌, కొడైకెనాల్‌ చెరువుకు నైరుతీ దిశలో ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంది. మున్నార్‌ టౌన్‌ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఒకవేళ అక్కడ రాత్రి బస చెయ్యాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, పరిమిత బస సదుపాయంతో ఒక ఫారెస్ట్‌ రెస్ట్‌హౌస్‌ కూడా ఉంది. మేమిద్దరం ఆ రోజు రాత్రి అందులోనే బస చేశాం. చెరువు అందాలను ఆస్వాదిస్తూ... తనువులు మెలేసుకుని తన్మయత్వంతో ఆనందించాం.

కుక్కల్‌ గుహలు

కుక్కల్‌ గుహలు

కొడైకెనాల్‌ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గుహలకు మేమిద్దరం వెళ్లాం. ఇవి ట్రెక్కింగ్‌కు చాలా ఫేమస్‌. సముద్ర మట్టం నుంచి 6,200 అడుగుల ఎత్తులో, పళని కొండలకు పశ్చిమంగా వున్నాయి. ముందుకు వచ్చిన రాతి స్లాబ్లతో ఈ గుహలు ఏర్పడ్డాయి. మేమిద్దరం ట్రెక్కింగ్‌ చేసి బాగా ఎంజాయ్ చేశాం. మాకు మంజంపట్టి జలపాతం ఎంతో శోభాయమానంగా కనిపిస్తుంది. ఈ లోయలో అడవి దున్నలు కనిపిస్తాయి. వేకువజామున ఈ అడవుల్లోంచి ట్రెక్కింగ్‌ చేశాం కాబట్టిప్రకృతి సౌందర్యాలను సంపూర్ణంగా ఆస్వాదించాం.

వెండి జలపాతం

వెండి జలపాతం

మదురై- కొడైకెనాల్‌ రోడ్డు మీద, కొడైకెనాల్‌ చెరువుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్లేస్ కు కూడా మేము వెళ్లాం. కొడైకెనాల్‌ చెరువు అలుగు పారినప్పుడు ఈ జలపాతం ప్రవహిస్తుంది. దాదాపు 180 అడుగుల ఎత్తు నుంచి కిందకు జారుకునే ఈ జలా ప్రవాహ అందాలను చూడ్డానికి మా రెండుకళ్లు చాలలేదు. ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా వీలుంటే కొడైకెనాల్ కు వెళ్లండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు.

English summary

my most enjoyable experience in kodaikanal

my most enjoyable experience in kodaikanal
Story first published:Thursday, May 31, 2018, 9:38 [IST]
Desktop Bottom Promotion