For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూర్యగ్రహణం: ప్రజలు నమ్ముతున్న విషయాలు, వాస్తవమెంత?

జూలై-13-2018 సూర్యగ్రహణం: ప్రజలు నమ్ముతున్న విషయాలు, వాస్తవమెంత?

|

పాక్షిక సూర్య గ్రహణం మరియు 13 -శుక్రవారం రెండూ ఒకే రోజున వస్తున్న కారణాన, మరియు అనేక సంవత్సరాల తర్వాత జరుగుతున్న కారణాన, అనేక అపోహలు- అవాస్తవాలు మరలా ప్రచారంలోకి వచ్చాయి. అనేక దేశాలలో శుక్రవారం-13, గ్రహణం రావడాన్ని చెడుకి సంకేతంగా భావిస్తారు. ఆయా దేశాలలో ఆయా కారణాలు ప్రచారంలో ఉన్నాయి.

కావున, ఇక్కడ మనం బోల్ద్స్కీలో ఈ సూర్య గ్రహణానికి, శుక్రవారం -13 సంబంధించిన అవాస్తవాల గురించిన వివరాలను పంచుకోబోతున్నాము.

ముఖ్యంగా సూర్య గ్రహణం సమయంలో ప్రజలు సాధారణంగా మతపరంగా అనుసరించే కొన్ని అవాస్తవాలను కూడా పంచుకోబోతున్నాము.

Myths About Solar Eclipse And Friday The 13th That People Believe In!

జూలై-13-2018 సూర్యగ్రహణం: ప్రజలు నమ్ముతున్న విషయాలు - వాస్తవాలు

సూర్యగ్రహణం, గర్భిణీ స్త్రీలకు హాని కలిగించే అవకాశం ఉంది:

విజ్ఞానశాస్త్రం ప్రకారం, సూర్యగ్రహణం గర్భస్థ పిండానికి ఎటువంటి వైకల్యాన్ని సృష్టించదు లేదా కారణమవదని పరిశోధకులు వెల్లడించారు. సూర్యగ్రహణం గర్భస్థ పిండానికే కాదు తల్లికి కూడా ఎటువంటి హానిచేయదు. గ్రహణం సమయంలో డెలివరీ కాకూడదన్న ఆలోచనతో శస్త్రచికిత్సలకు పూనుకోవడం, పూర్తిగా నిరాధారమైన అంశం.

సూర్యగ్రహణం సమయంలో వంటచేయడం కారణంగా ఆహారంలో సూక్ష్మజీవులు పెరుగుతాయి!

అసలు ఇలాంటి అపోహలు ఎలా పుడుతాయో, ఎలా ప్రచారంలోకి వస్తాయో ఎవరికీ అర్ధం కాదు. ఒకరి నమ్మకం ఎన్నో రూపాంతరాలు చెంది చివరికి మూడనమ్మకంగా మారుతుందని అనేకమంది వాదనకు అర్ధమిచ్చేలా ఇటువంటి అవాస్తవాలు చాప కింద నీరులా తిరుగుతున్నాయి. సూర్యగ్రహణం సమయంలో వండడం ద్వారా ఆహారంలో సూక్ష్మ క్రిములు పెరుగుతాయి అనడానికి ఎటువంటి విజ్ఞాన సంబంధ ఆధారాలు లేవు. మిగిలిన సమయాల్లోని ఆహారాలతో, గ్రహణ సమయాల్లోని ఆహారాలతో పోల్చి చూస్తే ఎటువంటి తేడాలు కనపడవు కూడా.

సూర్యగ్రహణం సమయంలో ఇంట్లోనే ఉండండి:

ఈ దశలో సూర్యకిరణాలు మరియు శక్తులు మానవ శరీరాన్ని ప్రభావితం చేస్తాయని, క్రమంగా చర్మ వ్యాధులు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఇంట్లోనే ఉండుటకు మొగ్గుచూపుతుంటారు. కానీ నిరాధారమైన అవాస్తవం ఇది. శాస్త్రవేత్తలు నిర్భయంగా ఆరుబయటకి వచ్చి సూర్యగ్రహణాన్ని వీక్షించినా ఎటువంటి సమస్యలు రావని నిక్కచ్చిగా చెప్తున్నారు.

వంటగది కిటికీ నుండి సూర్య గ్రహణం చూడటం పవిత్రంగా భావించబడుతుంది!

ఇది ప్రజల హాస్యాస్పదమైన మూడ నమ్మకాలలో ఇది కూడా ఒకటి. నేల పైన జల్లెడ పట్టుకొని, షేక్ చేయడం ద్వారా ఏర్పడే సూర్యుని ప్రతిబింబాన్ని చూడడం, లేదా సూర్యుని వైపు గంప వంటి వస్తువును ఉంచడం వంటి అనేక చర్యలకు పూనుకుంటూ ఉంటారు. ప్రజలు సూర్య గ్రహణాన్ని చూడటానికి పాటించే అనేక పాత మార్గాలు ఇవి. వంటగది తర్కంతో ఉన్న ఈ పద్దతులు నిరాధారమైనవిగా చెప్పబడినవి.

మరొక వైపు, 13 వ శుక్రవారం గురించిన పురాణాలు:

1. 13వ తేదీ శుక్రవారం రోజున బిడ్డ జన్మించినట్లయితే, అతడు/ఆమె అసంతృప్తికరమైన జీవితాన్ని గడపవచ్చు.

2. శుక్రవారం 13వ తేదీన సుదీర్ఘ ప్రయాణం మొదలుపెట్టిన ఎడల, అనేక సమస్యలతో కూడుకుని ఉంటుంది.

3. శుక్రవారం 13 వ తేదీన మీ జుట్టు లేదా గోళ్ళను కత్తిరించినట్లయితే, కుటుంబంలో మరణం సంభవించవచ్చు.

4. అంతే కాకుండా, ఏదైనా పార్దివదేహం మీ పక్కగా వెళితే, తర్వాత చనిపోయే వ్యక్తి మీరే కావొచ్చు.

సూర్య గ్రహణం మరియు శుక్రవారం 13వ తేదీ గురించిన అపోహలు, అవాస్తవాలు ఇవి. ఒక్క విషయం గుర్తు ఉంచుకోండి, ఏదైనా విషయం పాటించే ముందు “వినదగు నెవ్వరు చెప్పిన” అనే పద్యాన్ని మీ మనసులో తలచుకోండి. మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నమ్మాలా వద్దా అని. లేకుంటే ఆ పద్యానికి విలువే ఉండదు. మనం ఉండే విధానాన్ని అనుసరించి మన తర్వాతి తరం కూడా తయారవుతుంది అని పెద్దలు అంటుంటారు. కావున మూడనమ్మకాలు తర్వాతి తరానికి వ్యాపించకుండా జాగ్రత్త పడడం మంచిది.ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికరఅంశాలు, జీవన శైలి , ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Myths About Solar Eclipse And Friday The 13th That People Believe In!

With the partial solar eclipse and Friday the 13th falling on the same day, this is the day when people tend to believe in certain myths, and this is something that has been going on for years now. So, here we at Boldsky are all set to decode the myths about solar eclipse and also the unlucky Friday the 13th.
Desktop Bottom Promotion