For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నటాషా సెరెబ్రీ: ఈ రష్యన్ మోడల్ 7 సంవత్సరాల పాటు ఒకరికి లైంగిక బానిసగా నరకం అనుభవించింది

ఈ రష్యన్ మోడల్ 7 సంవత్సరాల పాటు ఒకరికి లైంగిక బానిసగా నరకం అనుభవించింది.

|

ఈ రష్యన్ మోడల్ 7 సంవత్సరాల పాటు ఒకరికి లైంగిక బానిసగా నరకం అనుభవించింది.

ఇద్దరు పిల్లల తల్లైన ఒక రష్యన్ మోడల్ 'ఒక వ్యాపారవేత్త చెరలో ఏడు సంవత్సరాల పాటు లైంగిక చిత్రహింసల’ తర్వాత తప్పించుకుని బయటపడింది.

నటాషా సెరెబ్రీ అనే రష్యన్ మోడల్, ఒక సైకో ద్వారా ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. ఈ సైకో పేరు, వ్యాచస్లేవ్.ఆర్.

ఈవిడ చెప్పిన కథనం ప్రకారం, ఒక వ్యాపారవేత్త తనను గృహ నిర్బంధం చేసి ప్రతిరోజూ కొడుతూ, లైంగిక హింసలకు గురిచేస్తూ, నరకానికి గురిచేసాడని. బరువు అసాధారణంగా 6 స్టోన్స్ కి పడిపోయి అనారోగ్యానికి గురయ్యానని, అతని నుండి పారిపోయినప్పుడు తీవ్రమైన ఆకలిని భరించానని వెల్లడించింది. మరియు టర్కీ, రష్యాలలో 7 సంవత్సరాల పాటు తనను లైంగిక బానిసగా వాడుకున్నాడని ఆక్రోశాన్ని వ్యక్తం చేసింది. చివరికి బ్రతికి ఉంటానో లేదో అన్న భయం కూడా వెంటాడింది అని, ఇప్పటికీ అతను వచ్చి నన్ను తీసుకుని వెళ్తాడేమో అని భయమేస్తుందని వాపోతుంది.

తనవయసు 25 సంవత్సరాలు కానీ బరువు 6 స్టోన్స్, అనగా 38 కేజీలు ఇంచుమించుగా. (1 స్టోన్ = 6.35కేజీ)

అతని నుండి తప్పించుకుని పారిపోయినప్పుడు, తీవ్రమైన ఆకలితో విరిగిన చాతీ ఎముక, వేళ్ళు మరియు పక్కటెముకల గాయాలతో, తీవ్రంగా దెబ్బతిన్న అంతర్గత మరియు బాహ్య అవయవాలతో, తలపై గాయాలతో, చిరిగిన పురీషనాళo (రెక్టం) తో తీవ్రంగా భాదపడుతూ కనిపించింది.

Natasha Serebriy had Two Children by a Tyrant known only as Vyacheslav R!

ఉక్రేనియన్ మోడల్ అయిన ఈమె , దాదాపు మూడు నెలల సుదీర్ఘ రక్త స్రావం కారణంగా రక్తహీనతకు కూడా గురయింది. కానీ ఈ ఎనీమియానే తన ప్రాణం కూడా కాపాడుతుందని అనుకోలేదని చెప్తుంది నటాషా. ఈ పాషవికాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..

నటాషా చెప్పిన వివరాల ప్రకారం,

నటాషా చెప్పిన వివరాల ప్రకారం,

నటాషా చెప్పిన వివరాల ప్రకారం, వ్యాచెస్లవ్.ఆర్ (చిత్రపటం) ఆమెను మొదటిసారిగా 7 సంవత్సరాల క్రితం తనకు 18 సంవత్సరాల వయసున్నప్పుడే తనను గృహ నిర్భందం గావించి, కొట్టడం లైంగిక హింసలకు గురిచేయడం ప్రారంభించాడు.

వైద్యుల నివేదిక ప్రకారం ,

వైద్యుల నివేదిక ప్రకారం ,

వైద్యుల నివేదిక ప్రకారం , ఆమె స్టాక్హోమ్ సిండ్రోమ్ అనే మానసిక వ్యాధితో బాధపడుతుందని నమ్ముతారు, ఆమెను 'కిడ్నాప్' చేసిన వ్యక్తి పట్ల కోపం లేకపోగా అతని పట్ల నమ్మకం లేదా ఆప్యాయతా భావాలను కలిగి ఉంది. అతనిని ఏమీ చేయవద్దని చెప్తూ ఉంది.

మోస్కోస్కి కూమ్సోమోలెట్స్ కథనం ప్రకారం,

మోస్కోస్కి కూమ్సోమోలెట్స్ కథనం ప్రకారం,

మోస్కోస్కి కూమ్సోమోలెట్స్ కథనం ప్రకారం, ఆమె ఇప్పుడు రష్యాలోని గృహ హింస బాధితుల కోసం కేటాయించబడిన ఒక సంస్థ నందు ప్రస్తుతం వైద్య సహాయం తీసుకుంటూ ఉంది. ఇక్కడ సామాజిక వేత్తల పర్యవేక్షణలో, పోలీసు భద్రత మద్య బ్రతుకుతుంది.

వ్యాచెస్లావ్ తనను మొదట్లో టర్కీలో ఉంచినా,

వ్యాచెస్లావ్ తనను మొదట్లో టర్కీలో ఉంచినా,

వ్యాచెస్లావ్ తనను మొదట్లో టర్కీలో ఉంచినా, కొన్ని పరిణామాల నేపద్యంలో టర్కీ నుండి వెలివేయబడి తర్వాత రష్యాకు తీసుకుని వచ్చాడని, తన ఫోన్ ను స్వాధీనపరచుకుని, ఎటువంటి సామాజిక, కుటుంబ, సన్నిహిత సంబంధాలు కూడా లేకుండా చేసి, కనీసం పిల్లలున్నారన్న కనికరం కూడా లేకుండా, వారి ముందే తనను చిత్ర హింసలకు గురిచేసేవాడని చెప్పుకొచ్చింది.

ఆమె మాటల్లోనే :

ఆమె మాటల్లోనే :

ఇప్పుడు నా పిల్లల్లో మొదటి పాప ఇవాకు 5 సంవత్సరాలు కాగా , రెండవ పాప లిసాకు 3 సంవత్సరాల వయసు. నాముందు మోడలింగ్ వంటి మంచి కెరీర్ ఉన్నా కూడా, అతని సంరక్షణకై ప్రాకులాడాను కానీ , చివరికి అతని క్రూరత్వం బయటపడింది. పర్యవసానంగా నేను నిర్భంధానికి గురయ్యాను.

అతని సంరక్షణకై నేను ఉన్న సమయంలో, ఒక నెల తర్వాత నెమ్మదిగా హింసకు గురిచేయడం ప్రారంభించాడు. క్రమంగా లైంగిక ఒత్తిడికి, అత్యాచారానికి పాల్పడ్డాడు.

చిన్న తప్పును కూడా తీవ్రంగా పరిగణించి హింసకు పూనుకునే వాడు. మరియు ఇలా ఉండాలి ,అలా ఉండాలి అని నాకు విషయాలు తెలిపేవాడు. కాని హింస ప్రవృత్తిని మాత్రం కొనసాగిస్తూ వచ్చాడు.

నేను అతన్ని ప్రేమించాను,

నేను అతన్ని ప్రేమించాను,

నేను అతన్ని ప్రేమించాను, అదే నేను చేసిన తప్పు. తద్వారా అతని ప్రేమను పొందాలని ప్రయత్నించాను. ప్రేమ అనేది కలే అని నాకు చివరికి అర్ధమయింది. ప్రేమగా దగ్గరకు తీసుకోడు సరికదా, తీవ్రంగా కొట్టి గాయపరచేవాడు. గర్భం దాల్చిన సమయంలో కూడా కనికరం చూపలేదు. ఒక బిడ్డ పుడితే అతనే మారుతాడని, నెమ్మదిగా పరిస్థితులు చక్కబడుతాయని భావించాను. నేను కూడా ఒక మనిషినే అని అతను గుర్తిస్తాడని అభిప్రాయపడ్డాను. ఏదో ఒకరోజు నాకంటూ ఒక అందమైన జీవితం లభిస్తుందని భావించాను. కానీ అవన్నీ కలలే అని తేలిపోయింది. ఇతన్ని మార్చలేము సరికదా, ఇక్కడే ఉంటే ప్రాణాలు కూడా పోతాయన్న భయమేసేది. అప్పటికీ ఒకసారి టర్కీ నుండి బయటపడ్డాను అని భావించాను, కానీ మరలా వచ్చి తీసుకుని వెళ్తాడని అనుకోలేదు.

నరకం ఎక్కడో లేదు, ఇక్కడే భూమిమీదే ఉంది:

నరకం ఎక్కడో లేదు, ఇక్కడే భూమిమీదే ఉంది:

నేను 6 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు, టర్కీలో ఒక ప్రదేశంలో నన్ను దాచాడు. అప్పుడర్ధమయింది, అతనికి నేను బానిసనని. నిజం అతనిని చూసుకునేందుకు ఒక బానిస కావాలి, ఆ బానిస నేనే అవ్వాలి అని అతని ఆలోచన. ఎక్కడికి వెళ్ళినా అతని చేతులు పట్టుకునే ఉండాల్సి వచ్చేది. పారిపోవడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా, నాకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను స్వాధీనపరచుకున్నాడు. నా స్నేహితులతో, నా బంధువులతో, కనీసం అమ్మతో కూడా మాట్లాడనిచ్చేవాడు కాదు. నెమ్మదిగా నా సన్నిహితులనందరినీ నాకు దూరం చేశాడు. కనీసం పొరుగువారితో మాట్లాడే అవకాశo కూడా నాకు లేదు. పొరపాటున ఎవరు మాట్లాడినా, నన్ను చిత్ర హింసలకు గురిచేసేవాడు. ఒక్కోసారి వారి ముందే నన్ను కొట్టేవాడు. సాటి ఉద్యోగులు, వ్యాపార భాగస్వాములు ఇంటికి వచ్చినప్పుడు, వారి ముందు కూడా నన్ను తీవ్రంగా కొట్టేవాడు.

ఎక్కడికి వెళ్ళినా నన్ను గదిలో ఉంచి తాళం వేయడం,

ఎక్కడికి వెళ్ళినా నన్ను గదిలో ఉంచి తాళం వేయడం,

ఎక్కడికి వెళ్ళినా నన్ను గదిలో ఉంచి తాళం వేయడం, నాకు ఫోన్ అందుబాటులో లేకుండా చేయడం చేసేవాడు. ఒక్కోసారి రోజంతా అపార్ట్మెంట్లో నేనొక్కదాన్నే ఉండాల్సి వచ్చేది. కానీ అతని కోసం ఇంటిని శుభ్రపరచడం, బట్టలు ఉతకడం, అతనికి వండిపెట్టడం ఇలా అన్నీ చేసేదాన్ని. తద్వారా ఎవరితో సామాజిక సంబంధాలు లేని కారణంగా అతనే నా ప్రపంచంగా మారడం వలన, పూర్తిగా అతనిపై ఆధారపడవలసి వచ్చేది, ఇదే అదనుగా భావించిన అతను నాపై పైశాచిక ప్రవర్తనకు పూనుకునే వాడు అని ఎంతో భావోద్వేగానికి లోనయింది.

బిడ్డకు జన్మనిచ్చిన అనతికాలంలోనే

బిడ్డకు జన్మనిచ్చిన అనతికాలంలోనే

బిడ్డకు జన్మనిచ్చిన అనతికాలంలోనే బిడ్డకు పాలిస్తున్న సమయంలోనే అతను నాపై దాడి చేసాడు, దీనికి కారణం అతనికి గౌరవం ఇవ్వలేదని. అతను రోజూ అత్యాచారానికి ఒడిగట్టేవాడు. అంతే కాదు కనీసం గర్భ నిరోధక పద్దతులను అవలంబించడానికి కూడా సుముఖత చూపేవాడు కాదు. తద్వారా మొదటి పాప ఇవా పుట్టిన 22 నెలలకు, రెండవ పాప లిసా పుట్టింది.

టర్కిష్ పోలీసుల కథనం ప్రకారం,

టర్కిష్ పోలీసుల కథనం ప్రకారం,

టర్కిష్ పోలీసుల కథనం ప్రకారం, అతని మొదటి భార్య ద్వారా పుట్టిన కొడుకు ఇతని చర్యలకు ప్రధాన సాక్ష్యంగా ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆమెను ఉక్రెయిన్ కి పంపగా, ఇతన్ని మాత్రం టర్కీ నుండి వెలివేశారు.

కీవ్ లో తన ఫామిలీతో సంతోషంగా గడుపుతున్న నటాషాను, ఎట్టకేలకు కనుగొని తిరిగొచ్చాడు వ్యాచస్లావ్. "నువ్వు నాకు మాత్రమే సొంతం, నేనేం చేశానో అప్రస్తుతం, నేను చచ్చే దాకా నువ్వు నాతోనే ఉండాలి" అని అరుస్తూ పిల్లలతో సహా లాగి కార్లోకి తోసి రష్యాకు తీసుకుని వెళ్ళాడు.

మాస్కో సబర్బ్స్ లో ఒక ఇంట్లో 2 సంవత్సరాలకు పైగా నన్ను బలవంతంగా ఉంచాడు, జూన్ 2016 నుండి, జనవరి 2018 వరకు. చివరికీ ఎలాగోలా నేను బయటపడ్డాను.

చివరి 3 నెలల్లో ఎక్కువగా రక్త స్రావం జరగడం వలన రక్త హీనతకు లోనయ్యాను, వైద్యుని వద్దకు తీసుకువెళ్ళమని ఎంతో ప్రదేయపడ్డాను, కాని అతను కనికరించలేదు.

చనిపోతానేమో అని భయమేసింది

చనిపోతానేమో అని భయమేసింది

చనిపోతానేమో అని భయమేసింది. నెమ్మదిగా కొంతకాలానికి పిల్లలను బంధించి నన్ను హాస్పిటల్ పంపేవాడు. హాస్పిటల్ లోని స్టాఫ్ కు తన పరిస్థితిని గురించి వివరించాను కూడా, కనికరించిన వైద్యులు నాటకీయ పరిణామాలు నడిపి అక్కడనుండి బయట పడేలా కార్ అరేంజ్ చేశారు, మరియు సంక్షేమ కేంద్రానికి తరలించారు. అని చెప్పుకొచ్చింది.

కానీ నటాషా ఇప్పటికీ అతనొస్తాడు, తనను మళ్ళీ తీసుకెళ్తాడు అన్న భయంతోనే కాలం గడుపుతూ ఉంది.

తనను గృహ హింసకు గురి చేశాడని, అత్యాచారానికి, లైంగిక హింసకు పాల్పడ్డాడని ఫిర్యాదు ఇచ్చిన నేపద్యంలో పోలీసులు వ్యాచస్లావ్ ను వెతికే పనిలో పడ్డారు.

ఒక సామాజిక వేత్త ప్రకారం " నటాషా నిజంగా అదృష్టవంతురాలు, ఇంకనూ బ్రతికి ఉంది అంటే, అంత క్రూరంగా హింసించాడు, ఆ సైకో కారణంగా ఈవిడ మానసిక పరిస్థితి కూడా దెబ్బతింది" అని చెప్పింది.

మనదేశంలో కూడా ఇలాంటి గృహ హింస కేసులు సర్వసాధారణం

మనదేశంలో కూడా ఇలాంటి గృహ హింస కేసులు సర్వసాధారణం

మనదేశంలో కూడా ఇలాంటి గృహ హింస కేసులు సర్వసాధారణం అయిపోయాయి. ఎన్నో చట్టాలు అమల్లోకి వస్తున్నా కూడా, కొంతమంది క్రూరుల పైశాచిక చర్యలకు అభం శుభం తెలీని ఆడవారు బలవుతూ ఉన్నారు. భార్యను కుక్కల బోనులో ఉంచి శిక్షించిన ఘనుల దగ్గర నుండి, లైంగిక హింసలకు గురిచేసే ప్రభుద్దుల దాకా అనేకులు ఇంకా సమాజంలో మానవుల రూపంలోనే సంచరిస్తూ ఉన్నారు. ఇలాంటివి కొందరు గ్రహించినా మనకెందుకులే అన్న ఆలోచన వలన, ఎంతో మంది జీవితాలు కొండెక్కుతున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం మన దేశంలో రోజులో కనీసం 20 గృహ హింసల ఫిర్యాదులు నమోదవుతున్నాయని సారాంశం.

కానీ పోలీసుల వద్దనో, న్యాయస్థానాల వద్దనో కాదు

కానీ పోలీసుల వద్దనో, న్యాయస్థానాల వద్దనో కాదు

కానీ పోలీసుల వద్దనో, న్యాయస్థానాల వద్దనో కాదు మనుషుల్లో, సమాజంలో సహజంగా మార్పు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. సామాజిక స్పృహ అనేది కనుమరుగవుతున్న కాలంలో, మహిళల స్వేచ్చకే కాదు, ఉనికి కూడా ప్రశ్నార్ధకం అయ్యేలా ఉంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి, మీ అభిప్రాయాలను వాఖ్యల విభాగంలో తెలియజేయండి.

All Image Source: east to west news / MK / Social Media

English summary

Natasha Serebriy had Two Children by a 'Tyrant' known only as Vyacheslav R!

Natasha Serebriy had Two Children by a 'Tyrant' known only as Vyacheslav R!, Seven years as a sex slave for businessman who beat her and raped her almost every day leaving her anorexic and living in fear.
Story first published:Tuesday, May 22, 2018, 18:06 [IST]
Desktop Bottom Promotion