For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ గ్రామంలో రాత్రి పూట శృంగారం కోసమే మగవారికి అనుమతి.. అక్కడ అంతా ఆడవారిదే రాజ్యం.. అదో ప్రమీల రాజ్యం

ఉత్తర కెన్యా యుమోజా గ్రామంలో శృంగారం కోసమే మగవారికి అనుమతి.. ఆ గ్రామంలో రాత్రి పూట శృంగారం కోసమే మగవారికి అనుమతి.. అక్కడ అంతా ఆడవారిదే రాజ్యం.. అదో ప్రమీల రాజ్యం. ప్రమీలా రాజ్యం, ఉత్తర కెన్యా యుమోజా

|

మహాభారత కాలంలో కొంతమేర మాతృస్వామ్యం ఉండేదంటారు సామాజికవేత్తలు. కాకపోతే అప్పటికే ఆ వ్యవస్థ చివరి దశలో ఉంది. ప్రమీలార్జునీయ ఘట్టం... అందుకో ఉదాహరణ. కురుక్షేత్ర యుద్ధం తర్వాత, పాండవులు అశ్వమేధయాగం చేస్తారు. అర్జునుడు యాగాశ్వంతో బయల్దేరతాడు. ఆ గుర్రం స్త్రీమండలమైన ప్రమీల రాజ్యానికి చేరుతుంది.

అది పురుషుల్లేని రాజ్యమని అంటున్నా, పురుషుడికి ఓ ఉనికంటూ లేని చోటుగా భావించాల్సి ఉంటుంది. ప్రమీల మీద అర్జునుడి విజయం, పెళ్లి....అంతిమంగా పురుషాధిపత్యానికి ప్రతీక. భీమసేనుడి భార్య హిడింబి కూడా ఒకానొక మాతృస్వామ్య వ్యవస్థకు చెందిన మహిళే.

మాతృస్వామ్యం

మాతృస్వామ్యం

మాతృస్వామ్యం ద్రవిడ సంప్రదాయమనీ, పితృస్వామ్యం ఆర్య సంప్రదాయమనీ ఓ వాదన. ఆర్యుల రాకతోనే...మాతృస్వామ్య పునాదులు కూలిపోయాయని ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేవారి మాట. శాతవాహన వంశంలో గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్టీపుత్ర పులోమావి మాత్రమే మాతృనామాల్ని ధరించారు.

ప్రమీలా రాజ్యాల్నే తలపిస్తాయి

ప్రమీలా రాజ్యాల్నే తలపిస్తాయి

అదే వంశానికి చెందిన మరో సుప్రసిద్ధ పాలకుడు హాలుడు తల్లిపేరును చేర్చుకున్న దాఖలాల్లేవు. కేరళలోని ట్రావన్‌కోర్‌ రాజవంశం ఎనిమిది వందల సంవత్సరాల కాలంలో... ఎనిమిదిమంది బాలికల్ని దత్తత తీసుకుంది. కారణం ఒక్కటే .. మహిళా వారసత్వాన్ని కొనసాగించడం. ఇవన్నీ ప్రమీలా రాజ్యాల్నే తలపిస్తాయి. అయితే ఇప్పటికీ కొన్ని ప్రమీలా రాజ్యాలు ఈ భూప్రపంచంపై ఉన్నాయి. కెన్యా, ఇండోనేషియాలో ఇలాంటి ప్రమీలా రాజ్యాలు కనిపిస్తున్నాయి.

మగ ప్రపంచానికి దూరంగా

మగ ప్రపంచానికి దూరంగా

ఇక ఒక ప్రమీలా రాజ్యంలో మహిళలు, పిల్లలే ఉంటారు. వారంతా మగవాళ్ల చేతుల్లో ఏదో రకంగా మోస పోయినవారే. వారిలో మూకుమ్మడి రేపులకు గురైనవారు, బాల్య వివాహాలకు బలైనవారు, గృహ హింసను తట్టుకోలేక పారిపోయి వచ్చిన వారూ ఉంటారు. వారంతా మగ ప్రపంచానికి దూరంగా...స్వేచ్ఛగా, తమ కాళ్ల మీద తాము నిలబడి ఆనందంగా బతుకుతున్నారు. వారే కెన్యా దేశంలోని యుమోజా గ్రామస్థులు.

ఉత్తర కెన్యాలో యుమోజా గ్రామం

ఉత్తర కెన్యాలో యుమోజా గ్రామం

ఉత్తర కెన్యాలోని సాంబూర్ ప్రాంతంలో యుమోజా గ్రామం ఉంది. దీన్ని మొట్టమొదట 1990లో రెబెక్కా లొలోసోలి అనే మహిళా నాయకత్వంలో ఓ 15 మంది బాధిత మహిళలు ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారు. వారిలో ఎక్కువ మంది బ్రిటన్ సైనికుల గ్యాంగ్ రేప్‌లకు గురై భర్తల నుంచి వేధింపులు ఎదుర్కొన్నవారే.

యుమోజా గ్రామం వార్షికోత్సవాలు

యుమోజా గ్రామం వార్షికోత్సవాలు

ఆ గ్రామం ఏర్పడి ఇప్పటికి పాతిక సంవత్సరాలయింది. మగవారి తోడు, నీడ అవసరం లేకుండా ఇంతకాలం స్వతంత్రంగా బతికామన్న ఆనందంలో వారు గతంలో గ్రామం వార్షికోత్సవాలను కూడా జరుపుకున్నారు. గ్రామం ఏర్పాటైన సంవత్సరం మినహా వారికి తేదీలు, నెలలు గుర్తులేవు. అందుకనే వారు ఈ ఏడాదంతా తమకు వార్శికోత్సవ పండుగేనని చెబుతున్నారు.

సెక్స్ కోసం మగవాళ్లకు అనుమతి

సెక్స్ కోసం మగవాళ్లకు అనుమతి

15 మందితో మొదలైన యుమోజి గ్రామంలో ఇప్పుడు 47 మంది మహిళలు, 200 మంది పిల్లలు ఉన్నారు. పిల్లల్లో కొంతమంది బాల్య వివాహాలకు బలై వచ్చిన వారు కాగా, ఎక్కువ మంది ఈ 47 మంది మహిళల పిల్లలే. సెక్స్ కోసం వారు మగవాళ్లను రాత్రిపూట గ్రామంలోకి అనుమతిస్తారు. తెల్లవారక ముందే మగవాళ్లు వెళ్లిపోవాలి. గ్రామంలో ఉండడానికి వీల్లేదు.

సెక్స్ కోసం ఇష్టపడతాం

సెక్స్ కోసం ఇష్టపడతాం

మగవాళ్లను మేము సెక్స్ కోసం ఇప్పటికీ ఇష్టపడతాం...అయితే వారిని మా గ్రామంలో ఉండనీయం. మాకు ఒక్కొక్కరి నలుగురు నుంచి ఐదుగురు పిల్లలున్నారు. వారంతా వేర్వేరు తండ్రులకు పుట్టిన వాళ్లే అని అక్కడున్న ఆడవారు ధైర్యంగా చెబుతారు. అందుకే వారి పిల్లల్లో రకరకాల జాతుల లక్షణాలు కనిపిస్తుంటాయి.

ఊరిడిచి వెళ్లి పోవాల్సిందే

ఊరిడిచి వెళ్లి పోవాల్సిందే

రకరకాల మగవాళ్ల వేధింపులతో ఈ గ్రామానికి చేరుకున్న తమలో ఎవరికి మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదని, చేసుకునే ప్రసక్తే లేదంటూ అక్కడి ఆడవారు చెబుతారు. ఇక తమ పిల్లలను మాత్రం వారి ఇష్టానికే వదిలేస్తున్నామని, పెళ్లి చేసుకుంటే మాత్రం వారు ఊరిడిచి వెళ్లి పోవాల్సిందేనంటారు.

పర్యాటకుల కోసం

పర్యాటకుల కోసం

గ్రామస్థులు ప్రధానంగా పూసలతో చేసిన గాజులు, నగలను, వెదురు చాపలను పర్యాటకులకు విక్రయించడం ద్వారా లభించే ఆదాయంతో వీరు జీవిస్తున్నారు. గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉండే ఓ నది పక్కన వారు ఓ స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ విడిది చేసే పర్యాటకుల కోసం వారు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు.

యునిటి పేరిట మరో కుగ్రామం

యునిటి పేరిట మరో కుగ్రామం

వంటచేసి పెడతారు. సమీపంలోని పర్వత ప్రాంతాల్లో విహరించాలనుకునే వాళ్లకు గైడ్‌గా వ్యవహరిస్తారు. గ్రామస్థులు స్థానిక ప్రభుత్వంపై పోరాటం జరిపి ఊరికి ఓ ప్రాథమిక పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అమెరికాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో యుమోజా గ్రామం పక్కనే యునిటి పేరిట మరో కుగ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

హక్కులు మగవాళ్లకే

హక్కులు మగవాళ్లకే

తాజాగా తమకు భూములపై హక్కులు కావాలని గ్రామం మహిళలు డిమాండ్ చేస్తున్నారు. కెన్యాలో భూములపై హక్కులు మగవాళ్లకే ఉంటాయి. గ్రామం ఏర్పడి తొలినాళ్లలో దాన్ని నాశనం చేసేందుకు ఎన్నోసార్లు దాడులు చేసి విసిగిపోయిన మగవాళ్లు ఇప్పుడు భూమిపై హక్కుల డిమాండ్‌తో మళ్లీ మండిపడుతున్నారు. ‘యుమోజ్‌విమెన్.నెట్' పేరిట గ్రామస్థులకు వెబ్‌సైట్ కూడా ఉంది.

యోగ్యకర్త

యోగ్యకర్త

ఇక ఇండోనేషియాలో కూడా మహిళా శక్తి చక్రం తిప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జావా ద్వీపంలో సుందర ప్రదేశం యోగ్యకర్త. స్వయం ప్రతిపత్తి కల్గిన ఈ ప్రావిన్స్‌కు రాజు.. సుల్తాన్‌ హామెన్‌కుబువాంగ్‌. రాణి.. గస్తి కాంజెంగ్‌ రాతు హేమాస్‌. 1945లో డచ్‌ వారిపై పోరాడినందుకు గౌరవ సూచకంగా యోగ్యకర్త సుల్తానులే ప్రావిన్స్‌ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ రాజవంశాన్ని ప్రజలు ఎంతో ఆరాధిస్తారు.

ఇద్దరూ అమ్మాయిలే

ఇద్దరూ అమ్మాయిలే

ప్రస్తుత సుల్తాన్‌ హామెన్‌కు అబ్బాయిలు లేరు. ఉన్నది ఇద్దరూ అమ్మాయిలే. కానీ యువరాణులను యువ రాజుల్లాగే పెంచారు సుల్తాన్‌. కూతుళ్లను యూరప్‌, అమెరికా, ఆస్ట్రేలియాల్లో చదివించారు. సుల్తాన్‌కు ఇప్పుడు 72 ఏళ్లు. ఆయన తదనంతరం యోగ్యకర్త సుల్తాన్‌ తన పెద్ద కూతురేనని ఆయన ఇప్పటికే సంకేతాలిచ్చారు.

సింహాసనం మీద కూర్చోబెట్టడానికి

సింహాసనం మీద కూర్చోబెట్టడానికి

రేపో మాపో పెద్ద కూతురు మాంగ్‌ కుబుమిని తన వారసురాలిగా ప్రకటించి.. యోగ్యకర్త మహారాణిగా సింహాసనం మీద కూర్చోబెట్టడానికి సిద్ధమయ్యారు. మరి పెద్ద కూతురు పట్టాభిషేకానికి సిద్ధంగా ఉందా? ‘నేను, నా చెల్లి అదృష్టవంతులం. ఇది అమ్మాయిల పని అని ఏనాడూ మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచలేదు.

మహిళలు ఏలారు

మహిళలు ఏలారు

మేం పదవులకు బానిసలం కాదు. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం. ఎన్నో ముస్లిం రాజ్యాలను మహిళలు ఏలారు' అంటున్నారు యువరాణి మాంగ్‌కుబుమి. మొత్తానికి భూ ప్రపంచం మీద ఇంకా ప్రమీలా రాజ్యాలు ఉన్నాయనడానికి ఇవే నిదర్శనాలు.

Image Credit (all images) :

https://face2faceafrica.com/article/no-men-allowed-inside-umoja-female-matriarch-village/8

https://upliftconnect.com/umoja-the-village-where-men-are-banned/

English summary

no men allowed umoja the all female matriarch village in kenya

no men allowed umoja the all female matriarch village in kenya
Story first published:Wednesday, June 6, 2018, 14:53 [IST]
Desktop Bottom Promotion