For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాన్యే వెస్ట్ డబుల్‌ మీనింగ్‌తో ట్వీట్ చేసిన మాతా అమృతానందమయి గురించి తెలియని నిజాలు

భారతీయ ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి ఆలింగనాలు తమకు కూడా కావాలంటూ అమెరికన్‌ ర్యాప్‌ సింగర్‌ కాన్యే వెస్ట్ ఈ మధ్యే ఒక ట్వీట్‌ చేశాడు. మాతా అమృతానందమయి, అమృతానందమయి అమ్మ, కాన్యే వెస్ట్.

|

భారతీయ ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి ఆలింగనాలు తమకు కూడా కావాలంటూ అమెరికన్‌ ర్యాప్‌ సింగర్‌ కాన్యే వెస్ట్ ఈ మధ్యే ఒక ట్వీట్‌ చేశాడు. గతంలోనూ ఆయన ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కున్నాడు. దాదాపు సంవత్సరం పాటు ట్విట్టర్‌కు దూరంగా ఉన్న ఆయన మళ్లీ తన ఖాతాను తెరచి ఇటువంటి ట్వీట్‌ చేశాడు.

ఇప్పటి వరకు అమృతానందమయి (అమ్మ) 32 మిలియన్ల ఆలింగనాలు ఇచ్చారని, అలాంటివి తమకూ కావాలని పేర్కొంటూ దుమారం రేపాడు. కేరళకు చెందిన మాతా అమృతానందమయి తన భక్తులను ఆలింగనం చేసుకుని, ఆశీర్వదించి పంపుతుంటారు.

కాన్యే డబుల్‌ మీనింగ్‌తో ట్వీట్

కాన్యే డబుల్‌ మీనింగ్‌తో ట్వీట్

ఈ నేపథ్యంలో కాన్యే ఇలా డబుల్‌ మీనింగ్‌తో ట్వీట్ చేశారు. ఇక హగ్గింగ్‌ సెయింట్‌గా విదేశాల్లోనూ పేరొందిన మాతా అమృతానందమయి (64) గతంలో దీనిగురించి ఒకసారి వివరించారు. తన వద్దకు వచ్చే భక్తులు తమ కష్టాలు చెప్పుకొని విలపించేవారని, వారికి ధైర్యం చెప్పేందుకు దగ్గరకు తీసుకుని, ఆలింగనం చేసుకుని కన్నీరు తుడిచేదాన్నని తెలిపారు. మూడు దశాబ్దాలకు పైగా ఇది కొనసాగుతూ వస్తోంది.

ఆలింగనం చేసుకోవడం స్పెషల్

ఆలింగనం చేసుకోవడం స్పెషల్

అమృతానందమయి అమ్మ అనే పిలవబడే ఈమె కేరళలో చాలా పాపులర్ మాతాజీ. ఈమెను చాలా మంది అమ్మఆమె బ్రహ్మచారిణి. ఆవిడ స్పెషాలిటీ అందర్నీ ఆలింగనం చేసుకోవడం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఆలింగనం చేసుకున్న రికార్డు ఆమె సొంతం.

సుధామణి

సుధామణి

మాతా అమృతానందమయి అసలు పేరు సుధామణి. ఆమె 1953 సెప్టెంబరు 27వ తేదీన కేరళలోని అలప్పాడ్‌ పంచాయతిలో పరయకడవ్ఞ పల్లెలో జన్మించింది. దమయంతి, సుగుణానందన్‌లు ఆమె తల్లిదండ్రులు. దమయంతి ఎంత పవిత్రంగా ఉండేదంటే ఊర్లోనివారు ఆమెను 'పట్టత్తి అమ్మ అనేవారు.

వివాహం చేయాలనుకున్నారు

వివాహం చేయాలనుకున్నారు

'పట్టత్తి అమ్మ అంటే బ్రాహ్మణ స్త్రీ అని అర్ధం. సుధామణికి వివాహం చేయాలని ఆమె తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నించారు కానీ ఆమె అన్ని ప్రయత్నాలను ఉద్దేశపూర్వకంగా విఫలం చేసింది. ఉన్నత చదువులు చదవలేదు. బాల్యం నుంచే ఆధ్యాత్మిక భావంలో మునిగిపోయింది.

కులమతాలకు అతీతంగా

కులమతాలకు అతీతంగా

మాతా అమృతానందమయిలో (అమ్మ) భక్తి, ప్రేమలు పొంగి పొర్లేవి. పేదరికంలో మగ్గుతున్నవారిని, కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నవారిని చూసి కన్నీరు కార్చేది మాతా అమృతానందమయి. మాతా అమృతానందమయి హిందువైన కులమతాలకు అతీతంగా మాతా ఉంటుంది. ఒక క్రైస్తవ మందిరం కార్ఖానాలో నడిచే తరగతులకు కూడా మాతా అమృతానందమయి హాజరయ్యేది. ఆమెకు శ్రీకృష్ణుడు నిరంతరం దర్శనమిచ్చేవాడట.

ఆదరాభిమానాల్ని చూరగొన్నారు

ఆదరాభిమానాల్ని చూరగొన్నారు

ఆమె తన దైవికశక్తితో ఎందరి రోగాలనో నయం చేశారని భక్తులు నమ్ముతారు. ఎందరి కష్టాలనో తొలగించారని ప్రజలు విశ్వసిస్తారు. ఎంతో పేరు, ప్రఖ్యాతలను పొంది ప్రపంచప్రముఖుల, ప్రజల ఆదరాభిమానాల్నిమాతా అమృతానందమయి చూరగొన్నారు.

ఆనందాన్ని అందిస్తూ ఉంటుంది

ఆనందాన్ని అందిస్తూ ఉంటుంది

మాతా అమృతానందమయి బాధతో, ఇబ్బందులతో వచ్చే భక్తుల్ని ఆలింగనం చేసికొని మాటలకందని ఆనందాన్ని, ప్రేమను అందిస్తూ ఉంటుంది. దేశవిదేశాల ప్రజలు ఆమెను ఆరాధిస్తున్నారు. బాధతో ఆమె దగ్గరకు వచ్చే భక్తులను భక్తితో ఆలింగనం చేసుకుని వారి ఇబ్బందులను పోగొట్టే మహాత్యం అమృతానందమయికి ఉందని చాలా మంది నమ్ముతారు.

ఏదో మహాత్యం లేకపోతే

ఏదో మహాత్యం లేకపోతే

ఆమె దగ్గర ఏదో మహాత్యం లేకపోతే ఇంత మంది ప్రజలు ఆమెను నమ్మరు కదా. ఏదో ఒక మహాత్యం ఆమె దగ్గరే ఉండే ఉంటుంది. అయితే మాతా అమృతానందమయి గురించి ఆ మధ్య భక్తురాలు రాసిన బుక్ మాత్రం దుమారం లేపింది. మాతా అమృతానందమయిలో మరో కోణం కూడా ఉందని ఆ బుక్ ద్వారా తెలిసింది. కానీ అది ఎంత వరకు నిజమో ఆ దేవుడికే తెలియాలి. కేరళలోని కొల్లమ్‌ వద్ద ఒక గుడిసెలో 33 ఏళ్ల క్రితం తన ఆశ్రమం మొదలుపెట్టిన ఆమె ఇప్పుడు వేలాది కోట్లకు అధిపతి.

ఆస్తులున్నాయి

ఆస్తులున్నాయి

భారతదేశంలో అనేక పట్టణాలలో, నగరాల్లో ఆమె ఆశ్రమానికి ఆస్తులున్నాయి. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, సింగపూరు, స్పెయిన్‌, జర్మనీ, బెల్జియం, జపాన్‌లలో కూడా..! అన్నిటికన్న మిన్న అయినది- ఒకప్పటి అమెరికా మాజీ అధ్యకక్షుడు కెనెడీ సోదరి యూనిస్‌ నుంచి సంపాదించిన వాషింగ్టన్‌ డిసిలోని 8 మిలియన్‌ డాలర్ల విలువైన ఎస్టేటు.

నరేంద్ర మోదీ వరకు

నరేంద్ర మోదీ వరకు

అనేక ఆశ్రమాల్లోగానే వీళ్లూ విద్య, వైద్యానికి చేయూత నిస్తున్నామంటూ స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు నడుపుతారు. ఇంత డబ్బున్న ఆశ్రమానికి రాజకీయనాయకుల దన్ను వుండడంలో ఆశ్చర్యం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ వరకు అందరూ ఆమె ఫంక్షన్లకు వచ్చినవాళ్లే. ఇక శశి థరూర్‌ తన పలుకుబడితో యునైటెడ్‌ నేషన్స్‌ చేత 2007లో గాంధీ-కింగ్‌ అవార్డు ఇప్పించాడు. అహింసామార్గాన్ని ప్రచారం చేసినందుకు ఇచ్చే ఈ అవార్డు నెల్సన్‌ మండేలా, కోఫీ అన్నన్‌లకు ఇచ్చారు.

గాయత్రి అలియాస్ గెయిల్

గాయత్రి అలియాస్ గెయిల్

ఇక మాత అమృతానందమయి గురించి ఒక పుస్తకం కూడా రాశారు. గాయత్రి పేరుతో ఆమె వద్ద శిష్యరికం చేసిన ఆస్ట్రేలియా దేశస్తురాలు గెయిల్‌ ట్రెడ్‌వెల్‌ రాసి, వెలువరించిన ''హోలీ హెల్‌ - ఎ మెమాయిర్‌ ఆఫ్‌ ఫెయిత్‌, డివోషన్‌ అండ్‌ ప్యూర్‌ మ్యాడ్‌నెస్‌'' అనే పుస్తకంలో ఆ వివరాలూ ఉన్నాయి.

శృంగార కార్యకలాపాల్లో పాల్గొందని

శృంగార కార్యకలాపాల్లో పాల్గొందని

అయితే గెయిల్‌, తన పుస్తకంలో అమృతానందమయి హింసాప్రవృత్తి కలదని, తన శిష్యులను, పరిజనాన్ని తిడుతుందని కొడుతుందని ఆరోపించింది. శృంగార కార్యకలాపాల్లో పాల్గొందని, డబ్బు విపరీతంగా సంపాదించి, దాచుకుందని కూడా చెప్పింది.

చాలా ఆసక్తికర విషయాలు

చాలా ఆసక్తికర విషయాలు

మాతాజీ ఆశ్రమం పెట్టిన తొలిరోజుల్లోనే 1981లో గెయిల్‌ వచ్చి ఆవిడ వద్ద శిష్యురాలిగా, వ్యక్తిగత సహాయకురాలిగా, ఆంతరంగికురాలిగా చేరి 18 ఏళ్ల పాటు ఉండి 1999లో విడిచి వెళ్లిపోయింది. తర్వాత పుస్తకం రాసింది.

గెయిల్‌ ఇంకా అప్పట్లో చాలా ఆసక్తికర విషయాలు కూడా బుక్ లో వివరిచింది. ''భక్తులిచ్చిన డబ్బును మాతాజీ తన తలిదండ్రులకు ఇస్తూండేది. ముగ్గురు సోదరులకు, ముగ్గురు సోదరీమణులకు ఖర్చుపెడుతూ వుంటే కుటుంబం బాంధవ్యాలు దృఢంగా వుండే భారతదేశంలో ఇది సహజం కాబోలు అనుకున్నాను."

లైంగిక దాడులు జరిగాయి

లైంగిక దాడులు జరిగాయి

"ఆశ్రమంలో నాపై లైంగిక దాడులు జరిగాయి. ఆర్థికపరమైన అక్రమాలు అనేకం జరిగాయి. ఆమె కోపతాపాలు భరించడం కష్టమైంది. ఇవన్నీ భరించలేక వెళ్లిపోయాక ఆ ట్రామా (మానసిక అవేదన) నుంచి బయటపడడానికి చాలా ఏళ్లు పట్టింది. ఆ తర్వాత యీ బాధలన్నీ మర్చిపోతే మంచిదన్న ఆలోచనలో కొంతకాలం గడిపాను. ఆ తర్వాత వాళ్లు భౌతికంగా దాడి చేస్తారన్న భయపడ్డాను. ఇక తెగించి పుస్తకం రాశాను.''అని గెయిల్ అప్పట్లో దుమారం రేపింది.

లైంగిక విశృంఖలత్వం కారణంగానే

లైంగిక విశృంఖలత్వం కారణంగానే

కానీ గెయిల్ వెళ్లిపోవడానికి ఇవేమీ కారణాలు కావు. ఆమె లైంగిక విశృంఖలత్వం కారణంగానే వెళ్లిపోమన్నాం. న్యూయార్క్‌ నుంచి వచ్చిన బిలియనీర్‌ను పెళ్లి చేసుకుంటానంటూ అతని వెంట పడింది. ఈమెతో వేగలేకపోతున్నానని అతను ఫిర్యాదు చేశాడు. దాంతో నువ్వు ఆశ్రమంలో ఉండొద్దు అని చెప్పామని మాతాజీ భక్తులు పేర్కొన్నారు.

ఆ నమ్మకాన్ని ఎవరూ దెబ్బతియ్యలేరేమో

ఆ నమ్మకాన్ని ఎవరూ దెబ్బతియ్యలేరేమో

అయితే ఆ సమయంలో కేరళ రాజకీయనాయకులందరూ అమృతానందమయికు మద్దతుగా నిలబడ్డారు. మాతా అమృతానందమయిపై ఎవరెన్ని విమర్శలు చేసినా భక్తులకు ప్రగాఢ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఎవరూ పోగొట్టలేరేమో. ఆమె దగ్గర ఏదో మహాత్యం ఉందని భక్తులు విశ్వసిస్తున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని ఎవరూ దెబ్బతియ్యలేరేమో.

English summary

noteworthy facts about mata amritanandamayi devi better known as amma

noteworthy facts about mata amritanandamayi devi better known as amma
Story first published:Friday, May 25, 2018, 10:55 [IST]
Desktop Bottom Promotion