For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముక్కులో నుంచి నోట్లో నుంచి పొగలు కక్కించడమే ఇప్పుడు వైరల్ ట్రెండ్ డ్రాగన్స్ బ్రీత్ గురించి తెలుసా?

కొన్నాళ్లుగా కీకీ ఛాలెంజ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే నడుస్తున్న వాహనంలో నుంచి దిగి డ్యాన్స్ చేస్తూ కికీ ఛాలెంజ్ చేయడం వల్ల చాలా మంది ప్రమాదాలకు గురయ్యారు.

|

కొన్నాళ్లుగా కీకీ ఛాలెంజ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే నడుస్తున్న వాహనంలో నుంచి దిగి డ్యాన్స్ చేస్తూ కికీ ఛాలెంజ్ చేయడం వల్ల చాలా మంది ప్రమాదాలకు గురయ్యారు. దీంతో మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఛాలెంజ్ లు నిర్వహించకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం మరో ఛాలెంజ్ వైరల్ అవుతోంది. అదే డ్రాగన్స్ బ్రీత్. ఈ ట్రెండ్ ను ఇప్పుడు చాలా మంది ఫాలో అవుతున్నారు. అయితే ఇది కూడా చాలా ప్రమాదకరమైనది.

Imagecredit

గుప్పు గుప్పు మంటూ పొగను వదలడమే...

నోట్లో నుంచి ముక్కలో నుంచి గుప్పు గుప్పు మంటూ పొగను వదలడమే డ్రాగన్ బ్రీత్ ట్రెండ్ ఉద్దేశం. అయితే సిగరెట్ తాగి కాదులెండి. నైట్రోజన్‌ లో క్యాండీ లను ముంచి వాటిని తింటూనే ఇలాంటి పొగను ముక్కులో నుంచి నోటిలో నుంచి వదులుతూ ఆ వీడియోలను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది యువత.

ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం

దీనికి డ్రాగన్స్ బ్రీత్ అని పేరు పెట్టారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. దీనివల్ల నోటిలో ఉండే సున్నితమైన అవయవాలు దెబ్బతింటాయి. అయితే ఇప్పటికే ఈ ట్రెండ్ మొదలవ్వడంతో కొన్ని చోట్ల ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి.

#DragonBreath 🙀😋😋

A post shared by kay😉💕 (@kylaaa.____) on

అనారోగ్యాల బారినపడతారు

పఫ్ లను లిక్విడ్ నైట్రోజన్‌ లో ముంచుకుని తినడం వల్ల చాలా అనారోగ్యాల బారినపడే అవకాశం ఉంది. లిక్విడ్ నైట్రోజన్ వల్ల స్కిన్ తో పాటు శరీరంలోని కొన్ని అవయవాలు దెబ్బతింటాయి. అంతేకాదు శరీరానికి ఆక్సిజన్ కూడా సరిగ్గా అందని పరిస్థితి ఏర్పడుతుంది.

She got scared #dragonbreath #dragonbreathicecream #icecream

A post shared by Kike Ramirez (@kike2887) on

డేంజర్ ప్రయోగాలు చేయొద్దు

అయినా కొందరు ఈ సూచనలన్నీ బేఖాతర్ చేస్తూ ఇలాంటి ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఫ్లోరిడా లోని ఒక చిన్నారి ఇలా చేయడం వల్ల హాస్పిటల్ పాలయ్యాడు. అందువల్ల ఇలాంటి డేంజర్ ప్రయోగాలు చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

English summary

Now Dragon's Breath Is The Dangerous Trend Going Viral

Now Dragon's Breath Is The Dangerous Trend Going Viral
Story first published:Saturday, August 4, 2018, 14:36 [IST]
Desktop Bottom Promotion