For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తూత్తుకుడిలో ఒక్కడైనా చావాలి అంటూ చంపేశారు.. నటించింది చాలు అంటున్నారు

తూత్తుకుడి.. దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. ఇక్కడి స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ విస్తరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందళోనల్లో ఆందోళనకారులు చనిపోతూనే ఉన్నారు. తూత్తుకుడి కాల్పులు, స్టెరిలైట్ కాపర్ ప్లాంట్.

|

తూత్తుకుడి.. దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. ఇక్కడి స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ విస్తరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందళోనల్లో ఆందోళనకారులు చనిపోతూనే ఉన్నారు. ఈ ఘటనలో పోలీసుల ప్రవర్తన అత్యంత వివాదాస్పదంగా మారింది. తీవ్రవాదులపై గురిపెట్టినట్టు సామాన్యులపై తూటాగుళ్ల వర్షం కురిపించారు.

ఒక్కరైనా చావాలి

" ఈ రోజు కనీసం ఒక్కరైనా చావాలి" అంటూ ఆందోళనకారులే లక్ష్యంగా చేసుకుని పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టాల్సిందిపోయి.. వాళ్ల ప్రాణాలు తీయడమే లక్ష్యంగా పోలీసలు పనిచేసినట్టు వీడియోలో స్పష్టమవుతోంది.

13 మంది మృతిచెందారు

13 మంది మృతిచెందారు

తమిళనాడులోని ట్యూటికోరిన్‌లో ఇటీవలఆందోళనకారులపై పోలీసులు ఫైరింగ్ జరిపిన ఘటనలో 13 మంది మృతిచెందారు. స్టెరిలైట్ ఇండస్ట్రీస్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ప్రదర్శనలో భారీ స్థాయిలో హింస చోటుచేసుకున్నది. ఆ సమయంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తమిళనాడు పోలీసులు కాల్పులు జరిపారు. అయితే ఆ ఘటనకు సంబంధించి ఓ వీడియో రిలీజైంది.

వీడియోలో కనిపించింది

వీడియోలో కనిపించింది

సివిల్ డ్రెస్‌లో ఓ వాహనంపైన ఉన్న పోలీసు.. తన దగ్గర ఉన్న సెల్ఫ్ లోడింగ్ రైఫిల్(ఎస్‌ఎల్‌ఆర్)తో ఫైరింగ్‌కు పాల్పడ్డాడు. నిరసనకారులను టార్గెట్ చేయాలంటూ పోలీసులు గట్టిగా అరుస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. కనీసం ఒక్క ఆందోళనకారుడైనా చనిపోవాలంటూ పోలీసులు మాట్లాడుకుంటున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.

భారీ స్థాయిలో భద్రత

భారీ స్థాయిలో భద్రత

ఫైరింగ్ ఘటనపై సీఎం పళనిస్వామి జ్యుడిషియల్ విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఇవాళ తూత్తుకుడిలో భారీ స్థాయిలో భద్రతను పెంచారు. స్టెరిలైట్ పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో 144వ సెక్షన్ విధించారు.

నటించింది చాలు

నటించింది చాలు

ఇక పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగుల్లో పడి ఉండగా అతని పరిస్థితేంటో కూడా తెలుసుకోకుండా లాఠీతో బెదిరిస్తూ..‘నటించింది చాలు ఇక వెళ్లు' అని కసురుకున్నాడు ఓ పోలీసు. బుల్లెట్‌ తగిలి తీవ్ర రక్తస్రావమైన అతడిని సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు.

బుల్లెట్ తగిలింది

బుల్లెట్ తగిలింది

కాల్పులు జరిగిన సమయంలో 22 ఏళ్ల కలియప్పన్‌ అనే వ్యక్తికి బుల్లెట్‌ తగిలింది. దాంతో బాధ భరించలేక అతను అక్కడే కుప్పకూలిపోయాడు. అది చూసిన ఓ పోలీసు అధికారి కనీసం ఆస్పత్రికి కూడా తరలించకుండా ‘నటించింది చాలు ఇక వెళ్లు' అని అనడం అక్కడే ఉన్న ఓ రిపోర్టర్‌ వీడియో తీశాడు. దాంతో ఈ వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

హెచ్చరికలు లేకుండా

హెచ్చరికలు లేకుండా

ముందస్తు హెచ్చరికలు లేకుండా ప్రజలపై కాల్పులు జరిపినందుకు గానూ తూత్తుకుడి జిల్లా కలెక్టర్‌, పోలీసు అధికారిని బదిలీ చేశారు. ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్‌ సేవలను కూడా నిలిపివేశారు.

పనులు నిలిపి వేయాలని

పనులు నిలిపి వేయాలని

కాగా తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌ విస్తరణ పనులను నిలిపివేయాలని మద్రాస్‌ హైకోర్టు స్టే జారీ చేసింది. ఇప్పటివరకు ఏటా 4,00,000 టన్నుల రాగిని ఉత్పత్తి చేసే కర్మాగారాన్ని ఇక్కడ స్టెరిలైట్‌ నిర్వహిస్తోంది. దాదాపు మరో రూ.3,000 కోట్లు వెచ్చించి ఇక్కడే మరో రాగి ప్లాంట్‌ నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే కాలుష్యం కారణంగా ఇబ్బందులు పడుతున్న స్థానికులు పరిశ్రమ విస్తరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో చాలా మంది మరణించారు.

వ్యతిరేకత ఎందుకు?

వ్యతిరేకత ఎందుకు?

మానవాభివృద్ధి సూచిలో చెన్నైనగరం తర్వాత రెండో స్థానంలో ఉన్న తూత్తుకుడి పట్టణంలో పర్యావరణ కాలుష్యంతో పాటు భూగర్భ జలాల నిల్వలకు పెనుముప్పుగా మారిన వేదాంత కాపర్‌ యూనిట్‌ని మూసేయాలని స్థానికులు చాన్నాళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు కంపెనీ విస్తరణా ప్రణాళికలు రచించటం వారిలో ఆగ్రహాన్ని మరింత పెంచింది.

కళ్లు మండుతున్నాయి

కళ్లు మండుతున్నాయి

తూత్తుకుడిలో స్టెరిలైట్‌ కంపెనీ గత 20 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాని నుంచి వస్తున్న రసాయనాల వల్ల కళ్లు మండుతున్నాయని, ఇతర అలర్జీలు వస్తున్నాయని ప్రజలు ఫిర్యాదుచేయడంతో 2013లో అప్పటి సీఎం జయలలిత ఆ కంపెనీని మూసివేయాలని ఆదేశించారు.

కంపెనీ తిరిగి తెరుచుకుంది

కంపెనీ తిరిగి తెరుచుకుంది

అయితే ప్రభుత్వ ఉత్తర్వులను జాతీయ హరిత ట్రిబ్యునల్‌ తిరస్కరించడంతో కంపెనీ తిరిగి తెరుచుకుంది. రాగిని కరిగించే ప్రక్రియ వల్ల ఆ ప్రాంతంలో సీసం, ఆర్సెనిక్, సెలీనియం, అల్యూమినియం, రాగితో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

విద్యుత్ సరఫరా నిలిపివేత

విద్యుత్ సరఫరా నిలిపివేత

ఇక ఆందోళనల నేపథ్యంలో కర్మాగారానికి విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపివేశారు. తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ప్లాంట్‌కు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.

పరిశ్రమలో ఉత్పత్తిని ప్రారంభించేందుకు

పరిశ్రమలో ఉత్పత్తిని ప్రారంభించేందుకు

ఆందోళనల దృష్ట్యా పరిశ్రమలో ఉత్పత్తిని నిలిపివేయాలని తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది. ప్లాంట్‌ లైసెన్స్‌ను పునరుద్ధరించేంత వరకూ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలను పక్కనబెట్టి పరిశ్రమలో ఉత్పత్తిని ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి దృష్టికొచ్చింది. దీంతో స్పందించిన మండలి.. ప్లాంట్‌కు విద్యుత్‌ సరఫరాను నిలిపివేసింది.

ఇంటర్నెట్ సేవలు నిలిచాయి

మరోవైపు ఆందోళనల నేపథ్యంలో ట్యుటికోరిన్‌లో ఇంటర్నెట్‌ సేవలను ఐదు రోజుల వరకు నిలిపివేశారు. ట్యుటికోరిన్‌తో పాటు తిరునెల్వేలి, కన్యాకుమారిలోనూ ఇంటర్నెట్ పనిచేదని అధికారులు స్పష్టం చేశారు. సోషల్‌మీడియా ద్వారా ఎలాంటి వదంతులు వ్యాపించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. తిరిగి మే 27న సేవలను పునరుద్ధరిస్తామన్నారు.

English summary

police firing was pre planned in thoothukudi

police firing was pre planned in thoothukudi
Desktop Bottom Promotion