Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
రైల్వే స్టేషన్‌లో కానిస్టేబుల్ నిద్రిస్తున్నట్టు నటిస్తూ మహిళను ఎక్కడెక్కడో టచ్ చేశాడు (వీడియో)
కానిస్టేబుల్ నిద్రిస్తున్నట్టు నటిస్తూ పక్కనే కూర్చున్న మహిళను అభ్యంతరకరంగా తాకాడు. రైల్వే స్టేషన్ లో లైంగిక వేధింపులు, ముంబైలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్, ముంబై రైల్వే పోలీసు, రైల్వే స్టేషన్
దేశవ్యాప్తంగా మహిళలపై రోజూ లైంగిక వేధింపులు సాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ మహిళ పట్ల ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తనలోని వక్రబుద్ధిని బయటపెట్టాడు. అదీకూడా పబ్లిగ్గా. అందరూ చూస్తుండగానే అమ్మాయిని తాకాలని అనుకున్నాడు. ఆమెను ఏదేదో చేయాలనుకున్నాడు. సీసీ కెమెరాల్లో అంతా రికార్డ్ అయ్యింది. అలాగే అక్కడున్న ఒక ప్రయాణికుడు దీన్ని మొత్తం వీడియో తీశారు.

కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో
ముంబైలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో ఇద్దరు మహిళలు ఆరో నంబర్ ప్లాట్‌ఫాంపై ఉన్న సీట్లలో కూర్చుని రైలు కోసం ఎదురుచూస్తున్నారు. వీరి పక్కనే రాజేశ్ జహంగీర్ అనే ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కూర్చుని ఉన్నాడు. జహంగీర్ పక్కన కూర్చున్న మహిళ ఉక్కపోతగా ఉండటంతో టవలత్ బాబుకు గాలి విసురుకుంటోంది.

అభ్యంతరకరంగా తాకాడు
ఇక కానిస్టేబుల్ నిద్రిస్తున్నట్టు నటిస్తూ పక్కనే కూర్చున్న మహిళను అభ్యంతరకరంగా తాకాడు. అంత మంది స్టేషన్‌లో ఉన్నారన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా ఆ మహిళపై కావాలని చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ వికృత చేష్టలను ఆ మహిళ పక్కనే కూర్చున్న మరో మహిళ గమనించింది.

దేహశుద్ధి చేశారు
ఆ తర్వాత ఆ మహిళ వారించగా మరో ప్రయాణీకుడు, మరికొందరు అతడికి దేహశుద్ధి చేశారు. దీంతో మిగిలిన ప్రయాణికులు కూడా తలోచేయి వేసి దేహశుద్ధి చేశారు. అలా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసోడే దారి తప్పాడు. కామంతో కళ్లు మూసుకుపోయి మహిళతో వెకిలి వేషాలు వేశాడు. ఇదంతా అక్కడి ప్రయాణికులు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

నిందితుడిపై చర్యలు
అయితే దీనిపై విచారణ జరిపి కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామని డివిజినల్ కమిషనర్ సెంట్రల్ రైల్వేస్ సచిన్ భలేడ్ పేర్కొన్నారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, వీడియో ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకున్నట్టు ఆయన చెప్పారు.

తగిన శాస్తి జరిగింది
రైల్వేస్టేషన్ వద్ద మహిళల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామని, పరిసర ప్రాంతాల్లో ఒక మహిళా పోలీసు అధికారి నేతృత్వంలో ఐదు మహిళా శక్తి టీమ్స్ నిరంతరం గమనిస్తూనే ఉంటారని తెలిపారు. అయినా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. మరోసారి జరగకుండా చూస్తామన్నారు. ఇక కానిస్టేబుల్ చేసిన తప్పుడు పనికి తగిన శాస్తి జరిగిందని నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు.



Click it and Unblock the Notifications