For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భక్తుల తలపై కొబ్బరికాయను కొట్టే పూజారి

భక్తుల తలపై కొబ్బరికాయను కొట్టే పూజారి

|

భారతీయులు అనేక ఆచారాలను పాటిస్తూ ఉంటారు. వాటిలో కొన్ని వింతగా ఉంటాయి. ఈ ఆచారాల వెనుక ఉన్న ఆలోచన మాత్రం దైవాన్ని ప్రసన్నం చేసుకోవడమన్నది తెలిసిన విషయమే. కొన్ని సార్లు, ఈ ఆచారాల వలన శారీరక నొప్పులు కూడా తలెత్తుతాయి!

అటువంటి ఒక వింత ఆచారాన్ని పాటించే ఒక దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని ఒక దేవాలయంలో ఒక వింత ఆచారం ఆచరణలో ఉంది. ఇది భక్తులకు ఒక విధంగా శారీరక బాధను కలించే ఆచారం. భక్తుల తలపై కొబ్బరికాయను కొడతారు.

Priest Breaks Coconuts On Devotees Heads During Indian Festival

ఈ ఆచారాన్ని పర్వదినాలలో పాటిస్తారు. ఐతే, ఈ ఆచారానికి అక్కడి భక్తులు ఏ మాత్రం భయపడరు. కొబ్బరికాయను నెత్తిమీద కొట్టించుకోవడానికి వారు లైన్ లో వేచి ఉంటారు.

ఈ వింత ఆచారానికి సంబంధించిన వీడియోని చూడండిక్కడ.

ఈ ఆచారాన్ని దక్షిణ భారత దేశంలో థాంక్స్ గివింగ్ పండుగలో భాగంగా పాటిస్తారు. ఈ ఫుటేజ్ ను తమిళనాడులోని మెట్టు మహదానందపురంలో సేకరించారు. ఆది పేరుక్కు పండుగ సమయంలో ఇది తమిళ హిందువులు పాటిస్తున్న ఆచారాన్ని ఇక్కడ గమనించవచ్చు.

రిపోర్ట్స్ ప్రకారం, శ్రీ మహాలక్ష్మి కి చెందిన ఆలయంలో పాటించబడిన ఈ ఆచారంలో దాదాపు వెయ్యికి పైగా భక్తులు పాల్గొన్నారు. భక్తిశ్రద్దలతో భక్తులు ఈ ఆచారాన్ని విజయవంతంగా ఆచరిస్తున్నారు. ఎటువంటి భయం అలాగే బెరుకు లేకుండా కొబ్బరికాయను మహదానందంతో తలపై కొట్టించుకుంటున్నారు.

ఈ ఆచారంలో భాగంగా భక్తులకు గాయమైతే గాయమైన చోట విభూది మరియు పసుపును అప్లై చేస్తారు.

ఈ ఆచరమనేది అనేక విమర్శలను ఎదుర్కొంటోంది. స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఈ ఆచారంపై తీవ్ర విమర్శలు చేసినా భక్తులు ఈ ఆచారాన్ని భక్తి శ్రద్దలతో పాటిస్తున్నారు.

English summary

Priest Breaks Coconuts On Devotees' Heads During Indian Festival

Devotees sit in rows while a priest smashes coconuts over their heads as part of a thanksgiving festival in southern India. More than 1,000 devotees take part in the practice at the Sri Mahalakshmi Temple as part of a celebration of the life-giving properties of water. The smashing of coconuts cause injuries to the devotees, yet it is followed.
Desktop Bottom Promotion