ఆటో డ్రైవర్ ను నమ్మి పనిలో చేరిన అమ్మాయితో విజయవాడలో ఇష్టానుసారంగా వ్యభిచారం చేయించారు

Subscribe to Boldsky

విజయవాడలో ఒక అమ్మాయిని దారుణంగా ఉపయోగించుకున్నారు. విజయవాడకు వచ్చిన ఓ అభాగ్య యువతిని నమ్మించి వ్యభిచారం కూపంలోకి దించారు కొందరు దుర్మార్గులు. పని ఇప్పిస్తానని నమ్మబలికిన ఆటో డ్రైవర్‌.. ఆమెను వ్యభిచార నిర్వాహకురాలికి అమ్మేశాడు. దీంతో ఏడాదికిపైగా ఆ యువతి నరకం అనుభవిస్తోంది.

విజయవాడ జక్కంపూడి కాలనీలో దంపతులు నిర్వహిస్తున్న సెక్స్‌ రాకెట్‌ గురించి తాజాగా గుట్టురట్టయింది. అమ్మాయిల అవసరాలను ఆసరాగా చేసుకుని వారికి ఎరవేసి వ్యభిచారం చేయిస్తున్నారు ఇద్దరు భార్యాభర్తలు. ఆ దంపతులు తమకు ఇష్టం వచ్చినట్లుగా.. ఆడిందే ఆట పాడిందే పాటగా కాలం గడుపుతున్నారు. వారిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా ఏం లాభం లేకపోయింది.

వంగర శోభారాణి, నారాయణమూర్తి దంపతుల పని అదే

వంగర శోభారాణి, నారాయణమూర్తి దంపతుల పని అదే

విజయవాడ జక్కంపూడి కాలనీలోని బ్లాకు నంబరు 205లో వంగర శోభారాణి, నారాయణమూర్తి దంపతులు నివాసం ఉంటున్నారు. నారాయణమూర్తి పెయింటింగ్‌ పని చేస్తాడు. ఇక వ్యభిచారాలు చేయించడం ఆయనగారి ప్రవృత్తి. ఈ క్రమంలో ఈయన చేతికి ఒక అమ్మాయి చిక్కింది.

ముసలివాడికి ఇచ్చి పెళ్ళి చేయడంతో

ముసలివాడికి ఇచ్చి పెళ్ళి చేయడంతో

మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలానికి చెందిన ఓ యువతి తల్లిదండ్రులు చనిపోవడంతో పెదనాన్న ఆశ్రయంలోకి వెళ్లింది. బాధితురాలు ఇంటర్‌ వరకు చదివింది. ఆమె పెద్దనాన్న ముసలివాడికి ఇచ్చి పెళ్ళి చేయడంతో.. ఆ పెళ్లి ఇష్టం లేని ఆమె ఇంటి నుంచి పారిపోయి విజయవాడ వచ్చింది. విజయవాడ బస్టాండ్‌లో ఉన్న ఆమెను ట్రాప్‌ చేసి సతీష్‌ అనే ఆటో డ్రైవర్‌ వెంటపడ్డాడు.

శోభారాణి వద్దకు అమ్మాయిని తీసుకెళ్లాడు

శోభారాణి వద్దకు అమ్మాయిని తీసుకెళ్లాడు

ఏం అమ్మాయి ఆటో కావాలా.. ఎక్కడికి వెళ్లాలంటూ ఆమెను అడిగాడు. ఆమె అక్కర్లేదని చెప్పినా వినలేదు. ఎక్కడైనా పని చూపిస్తే చేసుకొని బతుకుతానని బాధితురాలు చెప్పింది. నీకు పని కావాలా ? అంతే కదా.. నాకు ఓ చెల్లి ఉంది.. ఆమె ఏదో ఒక షాపులో పని చూపిస్తుందని చెప్పి శోభారాణి వద్దకు ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు.

శోభారాణి ప్రవర్తనపై అనుమానం

శోభారాణి ప్రవర్తనపై అనుమానం

ఆ అమ్మాయి వద్ద రూ.10 వేలు తీసుకున్నాడు ఆటో డ్రైవర్. తర్వాత అమ్మాయిని శోభారాణికి అప్పగించాడు. దీంతో కొన్ని రోజులు ఆ అమ్మాయి శోభారాణి ఇంట్లో పనులు చేస్తూ గడిపింది. అయితే శోభారాణి ప్రవర్తనపై ఆ అమ్మాయికి అనుమానం వచ్చింది. శోభారాణి దగ్గరకు ఎవరెవరో వచ్చి మాట్లాడిపోయేవారు. అయినా తనకెందుకులే అనుకుని ఆ అమ్మాయి మాట్లాడకుండా ఉండిపోయింది.

బలవంతంగా వ్యభిచారం చేయించింది

బలవంతంగా వ్యభిచారం చేయించింది

ఇక ఒక రోజు ఆ అమ్మాయిని గదిలోకి నెట్టి మరొక వ్యక్తిని పంపించి తలుపు గడియ పెట్టింది శోభారాణి. బలవంతంగా వ్యభిచారం చేయించింది. అలా చాలాసార్లు ఆ అమ్మాయితో వ్యభిచారం చేయించింది శోభారాణి. తర్వాత ఆమెను చెన్నై తీసుకువెళ్లి అక్కడ కూడా వ్యభిచారం చేయించింది. ఇష్టానుసారంగా కొట్టి బలవంతంగా వ్యభిచారం చేయించింది.

పది నెలల పాటు ఉంచి వ్యభిచారం

పది నెలల పాటు ఉంచి వ్యభిచారం

తర్వాత భీమవరానికి తీసుకువెళ్లి అక్కడ కూడా వ్యభిచారం చేయించింది. తర్వాత గుంటూరు కొత్తపేటలో పది నెలల పాటు ఉంచి వ్యభిచారం చేయించింది. ఆ అమ్మాయి వ్యభిచారం చేయలేనని చెప్పినా శోభారాణి వినేది కాదు. ఇష్టానుసారంగా కొట్టి తిట్టేది. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ అమ్మాయి అలా చేయాల్సి వచ్చింది.

శోభారాణి వ్యభిచారం చేయించేది

శోభారాణి వ్యభిచారం చేయించేది

ఇక తాజాగా మళ్లీ జక్కంపూడి కాలనీకి ఆమెను తీసుకు వచ్చింది. ఇక్కడ కూడా ఆ అమ్మాయి ద్వారా వ్యభిచారం నిర్వహించేది. అలాగే విజయవాడ నగరానికి చెందిన మరో యువతితో కూడా శోభారాణి వ్యభిచారం చేయించేది. శోభారాణి దగ్గర నుంచి బయటకు వెళ్లాలని ప్రయత్నిస్తే ఆ అమ్మాయిలను దారుణంగా వేధించేది.

పోలీసులు పట్టించుకోలేదట

పోలీసులు పట్టించుకోలేదట

ఇక జక్కంపూడిలో వ్యభిచారం జరుగుతున్నట్లు స్థానికుల ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదట. బాధిత యువతితోపాటు కాలనీలోని మరికొంతమందిని వ్యభిచార కూపంలోకి ఆమె దింపినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్థానికుల సహాయంతో వ్యభిచార కూపం నుంచి బాధితురాలు బయటపడింది. స్థానిక మహిళలు, ఒక సామాజికి కార్యకర్త ఆమెను కాపాడారు.

ఎందుకు చర్యలు తీసుకోం

ఎందుకు చర్యలు తీసుకోం

మొత్తానికి జక్కంపూడిలో సోదాలు నిర్వహించి. వ్యభిచార గృహం నిర్వాహకురాలు శోభారాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే స్థానికుల ఫిర్యాదు చేస్తే తాము ఎందుకు చర్యలు తీసుకోం అంటూ పోలీసులు చెబుతున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    prostitution racket busted in vijayawada one girl rescued

    prostitution racket busted in vijayawada one girl rescued
    Story first published: Friday, June 22, 2018, 17:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more